Jump to content

షైతాన్ (2024 సినిమా)

వికీపీడియా నుండి

షైతాన్ 2024లో విడుదలైన భారతీయ హిందీ సినిమా. దేవ్‌గన్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ & పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లపై అజయ్ దేవగన్, వికాస్ బహల్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గన్, ఆర్. మాధవన్, జ్యోతిక, జానకి బోడివాలా, అంగద్ అంగద్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలై[1] విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.

షైతాన్ సినిమా ముఖ్యంగా దేవగన్, మాధవన్ & జానకి బోడివాలా నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ₹ 60–65 కోట్ల అంచనా బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా ₹ 211.06 కోట్లు వసూలు చేసి 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ హిందీ సినిమాగా నిలిచింది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందించగా, కుమార్ సాహిత్యం రాశారు. "ఖుషియాన్ బాటర్ లో" మొదటి సింగిల్ ఫిబ్రవరి 15న విడుదలైంది.[2] రెండవ సింగిల్ "ఐసా మై షైతాన్" ఫిబ్రవరి 29న విడుదలైంది.[3] మూడవ సింగిల్ "షైతాన్ థీమ్" విడుదల మార్చి 8న విడుదలైంది. నాల్గవ సింగిల్ "పాపా తు హై నా" ఏప్రిల్ 2న విడుదలైంది.

సం.పాటగాయకుడు(లు)పాట నిడివి
1."షైతాన్ థీమ్"సిద్ధార్థ్ బస్రూర్2:34
2."ఐసా మైన్ షైతాన్"రఫ్తార్2:58
3."ఖుషియాన్ బాటర్ లో"జుబిన్ నౌటియాల్3:32
4."పాపా తు హై నా"శిరీష భాగవతుల4:06
మొత్తం నిడివి:13:10

ప్రశంసలు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం నామినీ ఫలితం మూ
2025 25వ IIFA అవార్డులు ఉత్తమ చిత్రం షైతాన్ ప్రతిపాదించబడింది [4][5]
ఉత్తమ సహాయ నటి జానకి బోడివాలా గెలుపు
ప్రతికూల పాత్రలో ఉత్తమ నటన ఆర్. మాధవన్ ప్రతిపాదించబడింది
షోషా రీల్ అవార్డ్స్ 2025 ఉత్తమ సహాయ నటి - పాపులర్ ఛాయిస్ జ్యోతిక ప్రతిపాదించబడింది [6]
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటి జానకి బోడివాలా ప్రతిపాదించబడింది [7]
ఉత్తమ సహాయ నటుడు ఆర్. మాధవన్ ప్రతిపాదించబడింది
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అమిల్ కీయన్ ఖాన్ ప్రతిపాదించబడింది

మూలాలు

[మార్చు]
  1. "Ajay Devgn, R Madhavan, Jyotika's next titled 'Shaitaan'. Release date out" (in ఇంగ్లీష్). India Today. 19 January 2024. Retrieved 15 October 2025.
  2. "Shaitaan first song 'Khushiyaan Bator Lo' will make you want to take a long drive with family. Watch". 15 February 2024. Archived from the original on 23 February 2024. Retrieved 23 February 2024.
  3. "The song 'Aisa Main Shaitaan' is an electrifying experience with lyrics penned by Kumaar and rap delivered by Raftaar, all set to the composition of Amit Trivedi". The Times of India. Archived from the original on 29 February 2024. Retrieved 29 February 2024.
  4. Awasthi, Pragati (2025-03-07). "IIFA Awards 2025: Date, time, host, venue, nominees list and more". Wion (in ఇంగ్లీష్). Retrieved 2025-03-11.
  5. "IIFA Awards 2025: Laapataa Ladies Sweeps 10 Awards. Kartik Aaryan Named Best Actor. Check Full List Of Winners". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2025-03-11.
  6. "Jyothika Wins Best Supporting Actress (Popular Choice) for 'Srikanth' at Showsha Reel Awards 2025".
  7. "Nominations for The 70th Hyundai Filmfare Awards 2025 With Gujarat Tourism: Full List Out". Filmfare. 26 September 2025.

బయటి లింకులు

[మార్చు]