షో టైమ్
షో టైమ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కిశోర్ గరికపాటి నిర్మించిన ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించాడు.[1] నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 24న విడుదల చేయగా,[2] సినిమాను జూలై 4న విడుదల చేశారు.[3][4]
కథ
[మార్చు]సూర్య (నవీన చంద్ర), శ్రుతి (కామాక్షి భాస్కర్) భార్యాభర్తలు హాయిగా జీవితాన్ని సాగిస్తుంటాడు. ఒక రాత్రి బిల్డింగ్ లోని ఫ్యామిలీస్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసుకుంటారు, ఆ సమయంలో అటు పెట్రోలింగ్ కు వచ్చిన సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) వారి ఇంటికి వచ్చి, అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని హెచ్చరిస్తాడు. ఈ క్రమంలో సూర్య, శృతి, సీఐ లక్ష్మీకాంత్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక రోజు సూర్య కూతురు మెడలో గొలుసును ఒకడు లాక్కుపోతుంటే వీరు ప్రతిఘటిస్తారు. దాంతో అతను ప్రమాదవశాత్తు ప్రాణాలు కొల్పాతాడు. సూర్య పై కక్ష కట్టిన సీఐ లక్ష్మీకాంత్ అతన్ని ఎలాంటి వేదింపులకు గురి చేశాడు? ఈ కేసు నుండి ఆ కుటుంబం ఎలా బయటపడింది? వారికి లాయర్ వరదరాజులు (వి.కె. నరేష్) ఎలా సహాయం చేసి కాపాడాడు? వీటి నుండి సూర్య కుటుంబం ఎలా బయట పడ్డారు? అనేది మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర[6]
- కామాక్షి భాస్కర్ల[7]
- నరేష్
- రాజా రవీంద్ర
- రోహిణి
- జెమిని సురేష్
- మాణిక్ రెడ్డి
- గోసుకొండ లక్ష్మి సుజాత
- వాణి శాలిని
- ఉహా రెడ్డి సోలిపురం
- సూర్య
- ప్రభావతి వర్మ
- గవిరెడ్డి శ్రీనివాస్
- రోహిణి రెడ్డి నోని
- బిహెచ్ఇఎల్ ప్రసాద్ రావు
మూలాలు
[మార్చు]- ↑ "ఎన్నెన్నో మలుపుల షో టైం". Eenadu. 3 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "నవీన్‌చంద్ర మరో థ్రిల్లర్.. ట్రైలర్ అదిరింది". Chitrajyothy. 24 June 2025. Retrieved 8 July 2025.
- ↑ "నవీన్ చంద్ర 'షో టైమ్' మూవీ జులై 4న రిలీజ్". V6 Velugu. 22 June 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "'షో టైమ్' రివ్యూ.. నవీన్ చంద్ర కొత్త మూవీ ఎలా ఉందంటే.!". NT News. 4 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ "ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడానికి కారణం అదే". Chitrajyothy. 6 July 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
- ↑ ""షో టైమ్" అంటూ భయపెడుతున్న 'పొలిమేర' బ్యూటీ కామాక్షి." R TV. 31 March 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.