సంకల్ప్ రెడ్డి
సంకల్ప్ రెడ్డి | |
---|---|
జననం | అక్టోబరు 20, 1984 |
వృత్తి | తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కీర్తి |
పిల్లలు | దేవ్ కవిశ్, శ్యమంత్ |
సంకల్ప్ రెడ్డి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. ఘాజీ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఘాజీ సినిమా హీందీ, తమిళంలో కూడా విడుదలైంది.[1] 2018 లో అంతరిక్షం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]సంకల్ప్ రెడ్డి 1984, అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో జన్మించాడు.[2] 2006లో హైదరాబాదులోని సి.వి.ఆర్. కళాశాలో ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. అనంతరం ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లోని గ్రిఫ్ఫిత్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చదువుకున్నారు. ఆ చదువును మధ్యలోనే వదిలేసి ఆస్ట్రేలియాలోనే ప్రసిద్ధిపొందిన గ్రిఫిత్ ఫిల్మ్ స్కూల్లో చిత్ర దర్శకత్వంలో MFA ను (2009) చదివాడు.
వివాహం
[మార్చు]సంకల్ప్ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ లో పనిచేస్తున్న కీర్తితో వివాహం జరిగింది. వీరికి దేవ్ కవిశ్, శ్యమంత్ అనే ఇద్దరు పిల్లలు.
సినిమారంగం
[మార్చు]సినిమారంగంలోకి రావడానికి ముందు 4 లఘుచిత్రాలను తీశాడు. సొంతంగా కథ రాసుకొని, ఘాజీ సినిమాను తీశాడు.
దర్శకత్వం వహించినవి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (25 January 2017). "ఫిబ్రవరి 17న ఘాజీ విడుదల". Retrieved 28 December 2017.[permanent dead link]
- ↑ బాలె, శ్రీనివాస్ (23 December 2018). "ప్రేమించాలనుకున్నా... ఏ అమ్మాయీ పడలేదు!". eenadu.net. ఈనాడు. Archived from the original on 24 December 2018.
- ↑ Namasthe Telangana (19 July 2021). "సంకల్ప్‌రెడ్డి 'ఐబీ 71'". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.