సంకసాల మల్లేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్‌.మల్లేశం
జననం
సంకసాల మల్లేశ్‌

జాతీయత భారతదేశం
వృత్తిప్రొఫెసర్, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌

సంకసాల మల్లేశ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌. ఆయన 2021, మే 21న కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2][3][4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఎస్‌.మల్లేశం తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం, హనుమాజీపేట్ గ్రామంలో సంకసాల పోచయ్య, రాములమ్మ దంపతులకు జన్మించాడు. మల్లేశం తండ్రి పోచయ్య కవి సి.నారాయణరెడ్డి ఇంట్లో పాలేరుగా పని చేశాడు. 5వ తరగతి వరకు హనుమాజీపేట్ ప్రాధమిక పాఠశాలలో చదివి, సిరిసిల్ల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంది 10వ తరగతి పూర్తి చేశాడు. మల్లేశం హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్‌ పూర్తి చేసి, ఇంటర్నేషనల్‌ జర్మనీ ఫెలోషిప్‌ అందుకుని జర్మనీలోని బెర్లిన్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[5]

వృత్తి జీవితం[మార్చు]

ఎస్‌.మల్లేశం 1992 నుంచి ఆర్ట్స్‌ కాలేజీ, నిజాం కాలేజీల్లో లెక్చరర్‌గా పని చేశాడు. ఆయన నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశాడు. 2010లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా, 2012 నుంచి 2014 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ఆయన అనంతరం ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా, ఉస్మానియా యూనివర్సిటీ లో ఫిలాసఫీ విభాగాధిపతిగా పని చేశాడు.[6]

వైస్‌చాన్సలర్‌గా భాద్యతలు[మార్చు]

ప్రొఫెసర్‌ సంకసాల మల్లేశం 2021, మే 24న శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. The New Indian Express (23 May 2021). "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021. Missing |author1= (help)
  3. TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  4. Eenadu (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  5. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  6. Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  7. Namasthe Telangana (24 May 2021). "ఓయూ, శాతవాహన వీసీలను సన్మానించిన విప్ సుమన్‌". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.