సంకురాత్రి చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంకురాత్రి చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త మరియు సంఘ సేవకుడు. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్ మరియు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకుడు.

చంద్రశేఖర్ ప్రాథమిక విద్య రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ. చేసి ఉన్నత విద్య కోసం 1967లో కెనడా వెళ్ళాడు. జీవశాసత్రం లో పి.హెచ్.డి. చేసి కెనడా ఆరోగ్యశాఖలో చేరాడు. 1985 జూన్ 23న ఉగ్రవాదులు పేల్చివేసిన కనిష్క విమానంలో లో భార్య మంజరి, కుమార్తె శారద మరియు కుమారుడు శ్రీ కిరణ్ లను పోగొట్టుకున్నాడు. ఈ దుర్ఘటన తరువాత గంపెడు దుఃఖంతో 1988లో కాకినాడ వచ్చాడు.

శారద విద్యాలయంలో 1200 మందికి విద్యాదానం చేశాడు. 1993లో శ్రీ కిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను ప్రారంభించాడు. ఇంచుమించు 13 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స చేశాడు.

ఉన్నత విలువలతో సామాజిక సేవలో నిమగ్నమైన ఆయనను సీ.ఎన్.ఎన్. హీరోగా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  • కాకినాడ న్యూస్ లైన్ ద్వారా సాక్షి పత్రికలో ఆగష్టు16, 2008 నాడు ప్రచురించబడిన వ్యాసం ఆధారంగా.

బయటి లింకులు[మార్చు]