సంకువారికుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంకువారికుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొత్తపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 523286
ఎస్.టి.డి కోడ్

సంకువారికుంట, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం.[1] యస్.టీ.డీ.కోడ్ 08592.

పేరువెనుక చరిత్ర[మార్చు]

చాలా సంవత్సరాల క్రితం, "సంకు" ఇంటిపేరుగల ఒక కుటుంబం, ఇక్కడ ఉన్న కుంట ప్రక్కన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరు ఈ గ్రామానికి సమీపంలో ఉన్న ఈతముక్కల, ఆలకూరపాడు తదిత్ర గ్రామాలవారికి చెందిన పొలాలకు కాపలాగా ఉండేవారు. తదనంతర కాలంలో వారి బంధువులు గూడా ఇక్కడకు రావడంతో ఈ గ్రామం ఏర్పడినది. ఈ రకంగా వారి ఇంటిపేరుమీదుగా "సంకువారికుంట"గా మారిందని స్థానికుల కథనం. [2]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో బ్రిటిషువారి కాలంలోనే ఒక మిషనరీ పాఠశాల ఉండేది. 1916లో అప్పటి విద్యాశాఖాధికారి ఇక్కడ పాఠశాల ఉన్నలు ధృవీకరించారు. 1953లో దీనిని మేనేజిమెంటు పాఠశాలగా మార్చారు. 1954 లో ఈ పాఠశాలలో పనిచేసిన శ్రీ పిల్లి సుందరరావు, జయరావు అను సోదరులు "పిల్లలు పనులలో కాదు, బడిలోనే ఉండాలని" తల్లిదండ్రులకు హితబోధ చేసారు. అప్పటి వరకు పొలాలలో పనులకు వెళ్ళే పిల్లలను, బడిబాట పట్టించారు. ఈ ఒక్క నినాదం ఇప్పటికీ గ్రామంలో మార్మోగటంతో, గ్రామంతా చదువుల నిలయమైనది. స్వాతంత్ర్యం అనంతరం గూడా ఈ పాఠశాల ప్రాథమిక పాఠశాలకే పరిమితమైనా, చదవాలనే పట్టుదలను ఈ గ్రామస్థులు వీడలేదు. ఈ గ్రామస్థులు బస్సు ఎక్కాలంటే ఒకటిన్నర కిలోమీటరు నడచి వెళ్ళాల్సినదే. అయినా సరే గ్రామస్థులు ఎంతకష్టమైనా, తమ పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపి చదివించుచున్నారు. 800 మంది గ్రామజనాభా ఉండి, 200 గడపలు గల ఈ గ్రామంలో ప్రస్తుత అక్షరాస్యత 100% ఉంది. అందువలన ఈ గ్రామం నుండి ఎంతోమంది విద్యావంతులు ఉద్యోగస్థులు తయారైనారు. [2]

గ్రామ ప్రముఖులు, విద్యావంతులు, ఉన్నతోద్యోగులు[మార్చు]

  1. శ్రీ బీరం మస్తాన్ రావు - రెండు పర్యాయలు మెదక్ జిల్లా గజ్వేల్ ఎం.ఎల్.ఏ.గా సేవలందించారు.
  2. శ్రీ డి.ఎం.రాజశేఖర్ - ఓ.ఎన్.జి.సి.లో జి.జె.ఎం. వీరు 2012లో ఉత్తమ పనితీరుకుగాను రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
  3. శ్రీ డి.ఎం.రత్నశేఖర్ - ఓమన్ దేశంలోని "జోర్డాన్ ఫాస్ఫేట్ మైనింగ్ కంపెనీ"లో పరిశోధక శాస్త్రవేత్త.
  4. శ్రీ జూపూడి ప్రభాకరరావు - ఏరోనాటికల్ ఇంజనీరు. ప్రస్తుతం ఎం.ఎల్.సి.గా కొనసాగుచున్నారు.
  5. శ్రీమతి చెన్నమ్మ - జిల్లా ఉద్యాన శాఖలో జె.డి.
  6. శ్రీ తిరుపతిరావు - పంచాయతీరాజ్ శాఖలో జె.యి.
  7. శ్రీ చిట్టితోట రమణయ్య - డి.ఎం.& హెచ్.ఓ. (రిటైర్డ్.)

వీరేగాక వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేయుచున్న 25 మంది ఇంజనీర్లు, ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, 13 మంది బ్యాంకు ఉద్యోగులు, వివిధశాఖల కార్యాలయాలలో 50 మంది ఉద్యోగులు. శతాబ్దాల క్రితం ఒక చిన్నకుంటప్రక్కన వ్యవసాయ కూలీ కుటుంబాలలో, ఈ గ్రామం నుండి ఎందరో ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగథులు, రాజకీయనాయకులు వెలుగుచూసినారు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశo/ఒంగోలు; జూన్-29, 2014; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-27; 9వపేజీ.