సంగమేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగమేశ్వరం
—  రెవిన్యూ గ్రామం  —
సంగమేశ్వరం is located in Andhra Pradesh
సంగమేశ్వరం
సంగమేశ్వరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°59′59″N 78°22′43″E / 15.999733°N 78.378534°E / 15.999733; 78.378534
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం కొత్తపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 518422
ఎస్.టి.డి కోడ్

సంగమేశ్వరం, కర్నూలు జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామం.[1]. ఇక్కడ ప్రసిద్ధ శివుని ఆలయము ఉంది. ఇది మండల కేంద్రమైన కొత్తపల్లె (కర్నూలు మండలం) నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 75 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593960[2].

విద్యా సౌకర్యాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

తాగు నీరు[మార్చు]

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

విద్యుత్తు[మార్చు]

భూమి వినియోగం[మార్చు]

సంగమేశ్వరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 33 హెక్టార్ల
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 300 హెక్టార్లు

గ్రామ చరిత్ర[మార్చు]

సంగమేశ్వరానికి చెందిన ఆలయ ద్వారం

యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ గ్రామంలో 1830 జూన్ 20వ తేదీన తన కాశీయాత్రా మార్గమధ్యంలో మజిలీ చేశారు. ఆ సందర్భంగా తాను చూసిన పలు విశేషాలను రికార్డు చేశారు. ఆయన ఈ గ్రామాన్ని గురించి 1830 నాటి గ్రామ స్థితిగతుల గురించి ఇలా వ్రాశారు: అది కృష్ణాతీరం. ఆ కృష్ణలో తుంగభద్రతో సహా ఐదు నదులు కృష్ణలో కలుస్తున్నాయి. అందువల్ల అక్కడ నది లోతుగా, వేగంగా ప్రవహిస్తోంది. ఇది నివాసానికి అనువైన ప్రదేశం. ఏటి వొడ్డున ధర్మరాజు ప్రతిష్టితమైన శివాలయం ఒకటి వుంది. గురుడు కన్యారాశిలోకి ప్రవేశించినపుడు అక్కడ చాలామంది ప్రజలు వచ్చి కృష్ణా పుష్కరాల యాత్ర చేసుకుని వెళ్తున్నారు. సకల పాపాలను నివృత్తి చేసే ప్రదేశం కనుక ఈ త్రివేణి సంగమానికి నివృత్తి సంగమం (సంగెం) అనే పేరు వచ్చింది. ఇక్కడ 20 బ్రాహ్మణుల ఇళ్లున్నాయి. కావలసిన వస్తువులన్నీ లభిస్తాయి గాని ధరలు అధికంగా వున్నాయి. ఊరు నదికి ఎత్తయిన ప్రదేశంలో వుంది. అక్కడ కృష్ణానది ఉత్తర వైపుకు ప్రవహిస్తోంది. మేము వచ్చిన తోవ బాగుంది. అడవి ఎక్కడా కనపడలేదు. దారిలో అడుగడుగునా గ్రామాలున్నాయి. నీటి వసతి బాగుంది. ప్రతి దారిలో శిథిలమైన కోటలున్నాయి. అవి పాండవులు తమ అరణ్యవాస కాలంలో నిర్మించుకున్నారని స్థానికులు చెప్పారు. అక్కడి గుళ్లలో తంబళివాళ్లు అర్చకులుగా వున్నారు.[3]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి నివృత్తి సంగం, నివృత్తి సంగమం వంటి పేర్లు కూడా ఉండేవి. 1830లో కాశీయాత్రచరిత్రలో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని నివృత్తి సంగం అని ప్రస్తావించారు. ఈ గ్రామనామం ఇక్కడి భౌగోళిక స్థితిని అనుసరించి వచ్చింది. కృష్ణానది తీరంలోని ఈ గ్రామం వద్ద ఉపనదులు వచ్చి కలుస్తూండడంతో సంగమేశ్వరమనే పేరు వచ్చింది, విశేషమైన సమయాల్లో ఈ ప్రాంతంలో ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించి నివృత్తి మార్గంగా దీన్ని భావించినందున నివృత్తి సంగం అనే పేరు వచ్చిందని వీరాస్వామయ్య వ్రాశారు.[3]

గ్రామ జనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2015-08-16.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. 3.0 3.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. CS1 maint: discouraged parameter (link)