Jump to content

సంగారెడ్డి పురపాలకసంఘం

వికీపీడియా నుండి

సంగారెడ్డి పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1954లో ఏర్పడిన ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మొదటిశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2011 గణన ప్రకారం పురపాలక సంఘం పరిధిలోని జనాభా 71426 కాగా, 2014 మార్చి నాటికి 52556 ఓటర్లున్నారు. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు ఉన్నాయి.

ఆదాయ-వ్యయములు

[మార్చు]

2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం రూ. 976.45 కోట్లు కాగా వ్యయము రూ. 806.14 కోట్లు.[1]

ఎన్నికలు

[మార్చు]

1954 నుంచి 2005 వరకు జరిగిన 9 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5, భారతీయ జనతాపార్టి 3, తెరాస ఒక్కసారి చైర్మెన్ పదవులను పొందాయి. ఈ పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేసిన లక్ష్మన్‌జీ తదుపరి కాలంలో ఆందోల్ శాసన సభ్యులు కూడా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికలు

[మార్చు]

2014 మార్చి 30న 10వ సారి ఎన్నికలు జరిగాయి.

2026 ఎన్నికలు

[మార్చు]

2026లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం 38 వార్డుల్లో 22 స్థానాల్లో కాంగ్రెస్,  బీఆర్‌ఎస్ 10, బీజేపీ 1, ఎంఐఎం  1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-09. Retrieved 2014-04-04.
  2. ↑ "తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు సంగారెడ్డి జిల్లా - 2026". Eenadu. 14 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.

వెలుపలి లంకెలు

[మార్చు]