సంగిశెట్టి వీరభద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగిశెట్టి వీరభద్రరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

సంగిశెట్టి వీరభద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

సంగిశెట్టి వీరభద్రరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో పిఠాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వెన్న నాగేశ్వరరావు చేతిలో 11628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో వెన్న నాగేశ్వరరావుకు 43905 ఓట్లు రాగా, వీరభద్రరావుకు 32277 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు పై 4413 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో వీరభద్రరావుకు 36612 ఓట్లు రాగా, వీరభద్రరావుకు 32199 ఓట్లు పోలయ్యాయి.[3]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (16 March 2019). "అప్పట్లో అలాగ.. ఈసారెలాగో..?". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.
  2. Sakshi (25 March 2014). "స్వతంత్ర పతాక సత్తాకు ప్రతీక". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.
  3. Result University (2021). "Pithapuram Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.