సంగీతా ఎన్ కలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీతా ఎన్ కలే
వృత్తిమహిళా శాస్త్రవేత్త

పాఠశాల[మార్చు]

సాధారణంగా ఉపాద్యాయులు వ్యక్తి జీవితానికి పునాదులు వేస్తారని అంటారు. కాలేజ్, యూనివర్శిటీ స్థాయిలో అలంటి ఉపాద్యాయుల అండ లభించుందన్నది సంగీతా ఎన్ కలే భావన. బాల్యం నుండి ఆనెకు ఎక్స్‌పరిమెంటల్ విజ్ఞాన శాస్త్రము అంటే అభిమానం ఎక్కువ. ఆమె ఇంట్లో, స్కూలులో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉండేది. అలాగే ఆమె ఒక చిన్న సైజు డైరీలో తన విజ్ఞాన శాస్త్రము ఆసక్తులను వ్రాయడం అలవాటు చేసుకుంది. అలాగే ఆనోట్సులో బ్లాక్‌హోల్స్, టెలెప్రొటేషన్, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్‌కైండ్ వంటి ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి.

పి.హెచ్.డి[మార్చు]

సంగీతా ఎన్ కలే డిగ్రీ, పోస్ట్ గ్రాజ్యుయేషన్ తరువాత మెటీరియల్ విజ్ఞాన శాస్త్రము‌లో పరిశోధనలు చేపట్టింది. ఒకవైపు పరిశోధనలూ మరొక వైపు కాలేజ్ విద్యార్థులకు టీచింగ్ ఏకకాలంలో చేసింది. తరువాత ఆమె పోస్ట్ డాక్టొరల్ పరిశోధన కొరకు రెండుసంవత్సరాల ఫెలోషిప్ తీసుకుని " యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ "కు వెళ్ళింది. ఆమెకు ఏకకాలంలో యూనివర్శిటీ నిర్వహణాబాధ్యతలు, టీచింగ్, విద్యార్థులకు కౌంసిలింగ్, యూనివర్శిటీ పాఠ్యాంశం రూపుదిద్దడం , పరిశోధనలు వంటి వైవిధ్యమైన అకాడమిక్ బాధ్యతలను చేపట్టే అవకాశం లభించింది. ఆమ విద్యార్థులకు మెటీరియల్ విజ్ఞాన శాస్త్రము , ఎలెక్ట్రానిక్స్ గురించి బోధించింది. కాలేజీ విద్యార్థులకు బోధించే సమయంలో ఆమెకు ఒక విషయం అవగాహన కలిగింది. కాలేజీ బోధనాంశాలలో పరిశోధనలూ విద్య వేరు వేరు విభాగాలుగా ఉన్నాయని ఆమె గ్రహించింది. అధ్యయనం అన్నది నిరంతరంగా కొనసాగుతుందని, అది ప్రయోగాత్మకంగా లోతైన అధ్యయనం ఆధారంగా సాగుతుందని తెలుసుకున్నది. విద్యార్థుల ఆసక్తిని ఆధికం చేయగలిగిన శాస్త్రీయమైన అవగాహన కలిగించే మార్గదర్శకమైన విద్యావిధానం రూపొందాలని ఆమె భావించింది.

టీచరుగా[మార్చు]

సంగీతా ఎన్ కలే టీచర్‌గా కాలేజీ విద్యార్థులకు టీచింగ్ లాబరేటరీ ప్రయోగాలతో సబ్జెక్టు కంటే అధికంగా అందించే ప్రయత్నాలు చేస్తుంది. అదనపు చర్చలు , వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేక తరగతుల నిర్వహణ వంటివి ఈ విధానంలో అంతర్భాగంగా ఉంటాయి. ఆమె పరిశోధనలు చేస్తున్న మెటీరియల్ విజ్ఞాన శాస్త్రము , నానోమెటీరియల్ కొరకు ఇంస్టిట్యూట్‌లో ఒక వేదిక ఏర్పాటుచేసింది. అలాగే " ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్" (ఐ.ఎస్.ఆర్.ఓ), యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యు.జి.సి), డిపార్ట్మెంట్ అఫ్ అటామిక్ ఎనర్జీ ( డి.ఎ.ఇ), అందించిన నిధుల సహాయంతో 2003లో ఒక రీసెర్చ్ లాబరేటరీ ఏర్పాటుకు పాటుపడింది. అది చాలా శ్రమతో కూడుకున్న పనైనా ఆమె ఏర్పాట్ల ఫలితంగా విజిటింగ్ సైంటిస్టుల నుండి పలు వ్యాసాలను ప్రచురించడానికి వీలుపడింది. ఆమె ఇటలీకి చెందిన " ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియొరేటికల్ ఫిజిక్స్ " సభ్యత్వం అందుకొనడం ఆమె కృషికి తార్కాణం.

పరిశోధన[మార్చు]

2003లో సంగీతా ఎన్ కలే బృందం పలు పరిశీధనా పత్రాలు ప్రచురించబడ్డాయి. ఆ వ్యాసాలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలచేత సునిశితంగా పరిశీలించబడ్డాయి. వాటిలో ప్రధానమైనవి ఫిజికల్ రివ్యూ లెటర్స్, అప్లైడ్ ఫిజిక్స్ లెటర్స్, ఫిజికల్ రివ్యూ-బి, ఐ.ఇ.ఇ.ఇ ట్రాన్‌శాక్షంస్ ఆన్ మేగ్నటిక్స్, జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్, జర్నల్ ఆఫ్ అయోమెడికల్ టెక్నాలజీ, అప్లైడ్ సర్‌ఫేస్ విజ్ఞాన శాస్త్రము అండ్ నానో టెక్నాలజీ మొదలైనవి ప్రధానమైనవి. ఆమె విద్యార్థులు వారి ప్రజంటేషంస్ సమర్పించడానికి పలు అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యారు. విద్యార్థులతో కాలీజి యువసిబ్బంది బృందంకూడా ఆమెతో కలిసి పనిచేసారు. ఆమె పనిచేసిన కాలేజి మాత్రమే కాక పూనా పరిసర కాలేజి విద్యార్థులు కూడా ఆమెతో కలిసి పనిచేసారు. ఆమె కృషికి గుర్తింపుగా ఇటలీకి చెందిన "

కుటుంబం[మార్చు]

సంగీతా ఎన్ కలే భర్త నరేంద్ర అలాగే ఆమె అత్తగారు సంగీతాకు వృత్తి జీవితంలో ఎదగడానికి చక్కగా సహకరించారు. ఆమెకు లభించిన సహకారం వంటిది ప్రతి మహిళకు లభిస్తే మహిళలు వృత్తిపరంగా అభివృద్ధి సాధించగలరని ఆమె భావించింది. ఆమె అత్తమామలు ఆమెకు నిరంతర ప్రోత్సాహం సహకారం అందించారని అలాగే ఆమె విద్యాపరంగా చేసిన సాధనను గుర్తించారని స్వతంత్రంగా వ్యవహరించడానికి సహకరించారని ఆమె తెలిపింది. ఆమె పరిశోధనలు సాగిస్తున్న తరుణంలో ఆమె రెండు సంచత్సరాల కుమార్తె పోషణకు అత్తమామలు అందించిన సాయం మరవురానిదని తెలిపింది. కుటుంబ సహకారం మాత్రమే ఆమెకు లభించిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి, విద్యారంగంలో సాధనకు కారణమని ఆమె భావించింది.

స్వీయ అనుభవం[మార్చు]

పరిశోధనలలో విజయం సాధించాలంటే బలమైన కోరిక, విస్తారమైన పరిశ్రమ, మనఃపూర్వక ప్రయత్నాలు ఉంటే ఏదైనా సాధ్యపడుతుందన్నది తథ్యం. సంగీతాకు నాణ్యమైన పరిశోధన అంటే ఆరాధన అధికం. పరిశోధనతో సంభంధంఉన్న విద్యావిధానం నాణ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఇంస్టిట్యూట్లు టోచింగ్‌తో పరిశోధనలను జతచేసి బోధించడం అవసరం. ప్రత్యేకంగా ఇది అండర్ గ్రాజ్యుయేషన్ నుండి ప్రారంభించాలి. ఆమె శక్తివంతమైన, సృజనాత్మకమైన, విఙాన ఆధారితమైన వాతావరణం విద్యార్థులకే కాక వృత్తిలో ఎదగడానికి సహకరిస్తుంది. అంతేకాక విద్యాసంస్థల అభివృద్ధికి అది తోడ్పడుతుంది. యువకులను తనపనిలో భాగస్వాములను చేయాలన్నది ఆమె సంకల్పం, స్వప్నం, లక్ష్యం. పరిశోధన, తెలుసుకోవాలన్న ఆసక్తి మానవుని సహజ గుణం. విద్యార్థులు మంచి ప్రశ్నలు వేసేలా తయారుచెయ్యడం ఉపాద్యాయుల బాధ్యత అన్నది ఆమె భావన.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.