సంగీత సామ్రాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత సామ్రాట్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం కె. శ్యామలమ్మ
కథ శ్యామలమ్మ
చిత్రానువాదం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద
సంగీతం రమేష్ నాయుడు
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం సెల్వరాజ్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్యామల ఫిల్మ్స్
భాష తెలుగు

సంగీత సామ్రాట్ 1984 లో విడుదలైన సినిమా. దీనిని శ్యామల ఫిల్మ్స్ పతాకంపై, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కె. శ్యామలమ్మ నిర్మించింది.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[2]

గోపి (అక్కినేని నాగేశ్వరరావు) అనాథ. దైవదత్తమైన సంగీత విద్య అతడి సొంతం. అతని స్నేహపూర్వక స్వభావం కారణంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతని పట్ల ఆప్యాయతతో ఉంటారు. అతను కూడా వారిని తన కుటుంబంగా చూస్తాడు. ఒకసారి గ్రామంలో ఓ పెళ్ళి జరిగినప్పుడు గోపి మొత్తం బాధ్యత తీసుకుంటాడు. వధువు తన సంగీత గురువు విశ్వనాథ శాస్త్రి (గుమ్మడి) తో పాటు కొద్దిమంది స్నేహితులను ఆహ్వానించడానికి నగరానికి వెళ్తుంది. రాధ (జయప్రద) ఒక అసాధారణ ప్రతిభ కలిగిన నర్తకి. పెళ్ళి కూతురు స్నేహితుల్లో ఆమె కూడా ఒకరు. గోపి ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్ళి సమయంలో, తన పాటకు ఆమె నాట్యం చేయాలని అతడు అడిగినపుడూ ఆమె గోపిని అవమానిస్తుంది. విశ్వనాథ శాస్త్రి గోపి కళను చూసి, అతణ్ణి తన వద్ద శిష్యరికం చెయ్యమని ప్రతిపాదించగా గోపి నిరాకరిస్తాడు. కానీ తన ఆటకు తగినట్లు పాడగల సమర్ధుడిని తాను పెళ్ళి చేసుకోవాలనేది రాధ ఆశయమని తెలిసాక వెంటనే, అతను నగరానికి వెళ్లి, కష్టపడి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అవుతాడు. రాధ అతన్ని ప్రేమిస్తుంది. మరొక వైపు, నరసింహశాస్త్రి (ధూళిపాళ) ఒక అహంకారి, విశ్వనాథ శాస్త్రిపై పగతో ఉంటాడు. తన కుమారుడు పూర్ణ చంద్ర (నరసింహ రాజు), కుమార్తె మాలిని (జయమాలిని) లు విశ్వనాథ శాస్త్రి శిష్యులతో పోటీ పడటానికి శిక్షణ ఇస్తాడు. ఇంతలో, చేయని నేరానికి గోపిని ఇన్స్టిట్యూట్ నుండి బహిష్కరిస్తారు. రాధ కూడా అతన్ని అసహ్యించుకుంటుంది. కాని తరువాత వారు నిజం తెలుసుకుంటారు. అదే సమయంలో, సాంస్కృతిక పోటీలు జరుగుతాయి, దీనిలో మాలిని రాధకు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. ఇక్కడ నరసింహ శాస్త్రి, విశ్వనాథశాస్త్రి గొంతు పోగొట్టి మోసం చేస్తాడు. ఆ దుస్థితి సమయంలో, గోపి వచ్చి తన గురువు గౌరవాన్ని కాపాడుతాడు. ఆ తరువాత గోపి, రాధ ఒక విదేశీ పర్యటనకు వెళ్ళి గొప్ప ఖ్యాతిని పొందుతారు. ఆ సమయంలో నరసింహ శాస్త్రి, విశ్వనాథ శాస్త్రికి పరిపూర్ణ నైపుణ్యం కలిగిన శిష్యుడు లేడని అవమానిస్తాడు.

ప్రస్తుతం, విశ్వనాథ శాస్త్రి సంగీత సామ్రాట్ బిరుదును సంపాదించడానికి గోపీని సిద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. కాని గోపి పూర్తిగా రాధ ప్రేమలో మునిగిపోయి ఉంటాడు. సంగీతంపై దృష్టి పెట్టలేకపోతాడు. దాని గురించి తెలుసుకున్న విశ్వనాథ శాస్త్రి, గోపి జీవితం నుండి వైదొలగమని రాధను కోరుతాడు. ఆమె ఒప్పుకుంటుంది. కానీ రాధ చేసిన ద్రోహాన్ని గోపి సహించలేక, తాగుబోతు అవుతాడు. అది తెలిసి, విశ్వనాథ శాస్త్రి కుప్పకూలిపోతాడు. గోపీ తన కీర్తిని తిరిగి దక్కించుకుంటానని వాగ్దానం చేస్తాడు. పోటీ సమయంలో, దురదృష్టవశాత్తు గోపీ నిరుత్సాహపడినపుడు, సరిగ్గా సమాయనికి రాధ వచ్చి అతడి నూతనోత్తేజం కలిగిస్తుంది. గోపీ పోటీ గెలుస్తాడు. చివరికి, విశ్వనాథ శాస్త్రి కూడా ఈ జంట యొక్క దైవిక సంబంధాన్ని అర్థం చేసుకుంటాడు. నరసింహ శాస్త్రి కూడా అతన్ని క్షమాపణ కోరుతాడు. చివరగా, ఈ చిత్రం గోపి రాధల పెళ్ళితో ముగుస్తుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు రమేష్ నాయుడు బాణీలు కట్టాడు. SEA రికార్డ్స్ ఆడియో కంపెనీ విడుదల చేసింది.[3]

ఎస్. పాట పేరు సింగర్స్ పొడవు
1 "సంగీతం" ఎస్పీ బాలు, పూర్ణ చంద్రరావు 4:31
2 "నాయనా హృదయ" ఎస్పీ బాలు 6:13
3 "నాట్యమే నా ఆరాధన" పి.సుశీల, ఎస్పీ శైలజ, పూర్ణ చంద్రరావు 6:57
4 "ఎంత సోగసు గాడే" పి.సుశీలా, కృష్ణ మూర్తి రాజు 4:13
5 "ఇధి కన్నులు పలికే" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:40
6 "ప్రేమా నీకోక్క నమస్కారం" ఎస్పీ బాలు 4:19
7 "జాము రాతిరి" ఎస్పీ బాలు 4:45
8 "జడివానా పడుతుంటే" ఎస్పీ బాలు, ఎస్పీ సైలాజా 4:19
9 "సంగీతం" ఎస్పీ బాలు, పూర్ణ చంద్రరావు 7:39

మూలాలు

[మార్చు]
  1. "Sangeeta Samrat (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-09-13. Retrieved 2020-08-17.
  2. "Sangeeta Samrat (Review)". Know Your Films.
  3. "Sangeeta Samrat (Songs)". Music India Online. Archived from the original on 2017-02-23. Retrieved 2020-08-17.