సంజయ్కాక పాటిల్
| సంజయ్కాక పాటిల్ | |||
| పదవీ కాలం 16 మే 2014 – 4 జూన్ 2024 | |||
| ముందు | ప్రతీక్ పాటిల్ | ||
|---|---|---|---|
| తరువాత | విశాల్ పాటిల్ | ||
| నియోజకవర్గం | సాంగ్లీ | ||
| పదవీ కాలం 2008 ఏప్రిల్ 25 – 2014 ఏప్రిల్ 24 | |||
| నియోజకవర్గం | శాసనసభ సభ్యులచే | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1965 జనవరి 4 చించని , మహారాష్ట్ర , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2024 - ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2014కి ముందు) భారతీయ జనతా పార్టీ (2024కి ముందు) | ||
| తల్లిదండ్రులు | రామచంద్ర కృష్ణాజీ పాటిల్, వైజంత | ||
| జీవిత భాగస్వామి | జ్యోతి పాటిల్ (వివాహం. 1993 ) | ||
| సంతానం | 1 కొడుకు & 1 కూతురు | ||
| నివాసం | చించని , తాస్గావ్, సాంగ్లీ జిల్లా , మహారాష్ట్ర , భారతదేశం | ||
| మూలం | |||
సంజయ్ రామచంద్ర పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సంజయ్కాక పాటిల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2008 ఏప్రిల్ 25 నుండి 2014 ఏప్రిల్ 24 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పని చేసి 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రతీక్ పాటిల్‌పై 2,39,292 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
సంజయ్కాక పాటిల్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వాభిమాని పక్ష అభ్యర్థి విశాల్ ప్రకాష్బాపు పాటిల్‌పై 1,64,352 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి విశాల్ ప్రకాష్బాపు పాటిల్ చేతిలో 1,00,053 ఓట్లు తేడాతో ఓడిపోయాడు.[3]
సంజయ్కాక పాటిల్ 2024 శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీని వీడి అక్టోబర్ 25న అజిత్ పవార్ సమక్షంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి[4] 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తాస్గావ్-కవాతే మహంకల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ - ఎస్పీ అభ్యర్థి రోహిత్ పాటిల్ చేతిలో 27644 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (8 October 2024). "Sanjaykaka Patil" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ TV9 Marathi (4 March 2021). "आधी राष्ट्रवादीशी जवळीकीची चर्चा, आता संजयकाकांनाच भाजपकडून 'करेक्ट कार्यक्रमाची सुपारी'". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Sangli". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Hindustantimes (26 October 2024). "Sanjay Kaka Patil joins NCP, to contest from Tasgaon". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Tasgaon-Kavathe Mahankal". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.