సంజయ్ బంగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ బంగర్

1972, అక్టోబర్ 11న మహారాష్ట్రలోని బీడ్లో జన్మించిన సంజయ్ బంగర్ (Sanjay Bangar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 12 టెస్టులు, 15 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళి క్రికెట్ పోటీలలో మహారాష్ట్ర, ముంబాయి, రైల్వే జట్ల తరఫున ఆడినాడు. 2000-01లో రైల్వే తరఫున ఆడి జట్టును రంజీ ట్రోఫిలో ఫైనల్ వరకు నడిపించాడు. కాని బరోడా చేతిలో ఓటమి చెందింది. మరుసటి ఏడాది బరోడాపై విజయంతో ట్రోఫీ గెలిచి బంగర్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2001-02లో ఇంగ్లాండుపై టెస్ట్ ఆరంగేట్రం చేశాడు.[1] తన రెండో టెస్టులో జింబాబ్వేపై నాగ్పూర్లో 7 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రవేశించి 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిల్చాడు. అదే అతని టెస్ట్ జీవితపు అత్యధిక స్కోరు. 2002 లో ఇంగ్లాండుపై హెడింగ్లీ టెస్టులో ఓపెనర్‌గా ఆడినాడు. ఆ తరువాత 2003లో ప్రపంచ కప్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2004 జనవరి నుంచి సెలెక్టర్లు యువకులకు ప్రాతినిధ్యంఈవ్వడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

బంగర్ 12 టెస్టులు ఆడి 29.37 సగటుతో 470 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడీ అత్యధిక స్కోరు 100 నాటౌట్. బౌలింగ్‌లో 7 వికెట్లను కూడా సాధించాడు. అత్యున్నత బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 2 వికెట్లు.[2]

వన్డే గణాంకాలు

[మార్చు]

బంగర్ 15 వన్డేలలో జట్టుకు ప్రాతినిధ్యం వహించి 13.84 సగటుతో 180 పరుగులు చేశాడు. వన్డేలో అతడి అత్యధిక స్కోరు 57 నాటౌట్. బైలింగ్‌లో 7 వికెట్లు కూడా సాధించాడు. వన్డే బౌలింగ్‌లో అతడి అత్యున్నత విశ్లేషణ 39 పరుగులకు 2 వికెట్లు. 2003 ప్రపంచ కప్‌లో కూడా భారత్‌కు ప్రానిధ్యం వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. http://www.cricinfo.com/ci/content/story/106944.html
  2. http://www.cricinfo.com/ci/content/player/27225.html