సంజీవ్ ఝా
సంజీవ్ ఝా | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2015 ఫిబ్రవరి 14 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
---|---|---|---|
నియోజకవర్గం | బురారి | ||
పదవీ కాలం 2013 డిసెంబర్ 28 – 2014 ఫిబ్రవరి 14 | |||
ముందు | క్రిషన్ త్యాగి | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
నియోజకవర్గం | బురారి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మధుబని,[1] బీహార్ | 1979 ఆగస్టు 1||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | గుల్షన్ ఝా | ||
సంతానం | 1 | ||
నివాసం | H.no. 9, గాలి నం. 11, IInd ఫ్లోర్, A2 బ్లాక్, వెస్ట్ సంత్ నగర్, బురారి |
సంజీవ్ ఝా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు బురారి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సంజీవ్ ఝా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బురారి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీ కృష్ణ త్యాగిపై 10,351 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపాల్ ఝాపై 67,950 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
సంజీవ్ ఝాను ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్, జార్ఖండ్ రాష్ట్ర ప్రతినిధి & ప్రభారిగా నియమితుడై 2016లో ఢిల్లీ ప్రభుత్వ పార్లమెంటరీ రవాణా కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆయన 2018 నుండి జనవరి 2020 వరకు శాసనసభలో పార్టీ జనరల్ సెక్రటరీగా, ఢిల్లీ శాసనసభ ద్వారా జిల్లా అభివృద్ధి కమిటీ (సెంట్రల్ డిస్ట్రిక్ట్), పబ్లిక్ అకౌంట్ కమిటీ,[5] విద్యపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడిగా, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా పని చేశాడు.[6]
సంజీవ్ ఝా 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బురారి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి శైలేంద్ర కుమార్‌పై 88,158 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8] ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి శైలేంద్ర కుమార్‌పై 20,601 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "रहिका के संजीव दिल्ली में फिर बने विधायक". Hindustan. Retrieved 2020-02-11.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "Delhi Legislative Assembly National Capital Territory Of Delhi Composition Of House Committees 2021-2022". Archived from the original on 26 December 2021. Retrieved 17 September 2022.
- ↑ "Committee System in Legislative Assembly of National Capital Territory of Delhi" (PDF). Legislative Assembly National Capital Territory of Delhi. Archived from the original (PDF) on 20 సెప్టెంబర్ 2022. Retrieved 17 September 2022.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Burari" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.