సంజీవ్ బిఖ్‌చందానీ
| సంజీవ్ బిఖ్‌చందానీ | |
|---|---|
| విద్య | సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ నుండి బి.ఏ. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఐఐఎం అహ్మదాబాద్ నుండి ఎం.బి.ఏ. |
| వృత్తి | వ్యాపారవేత్త |
| సంస్థ | ఇన్ఫోఎడ్జ్ (nfoEdge) |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
| వెబ్‌సైటు | |
| https://www.infoedge.in/ | |
సంజీవ్ బిఖ్‌చందానీ, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఆయన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, ఇది జాబ్ పోర్టల్ నౌక్రి.కామ్ (naukri.com), అలాగే అలాగే అశోక విశ్వవిద్యాలయం సహ వ్యవస్థాపకుడు.[1][2][3] జనవరి 2020లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించబడ్డాడు.[4][5]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆయన ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో చదివి, అక్కడ నుండి 1981లో పాఠశాల విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత, 1984లో స్థానిక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు. 1989లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ నుండి ఎంబీఏ పూర్తి చేసాడు.
కెరీర్
[మార్చు]పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత, ఆయన హిందూస్తాన్ మిల్క్ ఫుడ్ మాన్యుఫాక్చరర్స్(గ్లాక్సో స్మిత్క్లైన్ కన్స్యూమర్ హెల్త్కేర్ ఇండియా) లో హార్లిక్స్ మార్కెటింగ్ ఉద్యోగం చేసాడు.[6] ఆయన 1995లో ఇన్ఫో ఎడ్జ్ ను స్థాపించాడు. 1997లో, ఆయన భారతదేశంలో జాబ్స్ పోర్టల్ నౌక్రి.కామ్, తరువాత ఆఫ్లైన్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ బిజినెస్ క్వాడ్రాంగిల్.ఇన్ ను ఏర్పాటు చేసాడు.[7] 2005లో, నౌక్రి.కామ్ భారతదేశపు అతిపెద్ద వెబ్ ఆధారిత ఉపాధి సైట్ గా అవతరించింది.[8]
ఇన్ఫో ఎడ్జ్ తరువాత రియల్ ఎస్టేట్ కొరకు 99 ఎకర్స్.కామ్, వివాహ సంబంధాల కోసమై జీవన్‌సాథి.కామ్, విద్య గురించిన శిక్షా.కామ్ వంటి ఇతర వర్గీకృత సైట్లను ప్రారంభించింది.
హైస్కూల్ విద్యార్థులలో సామాజిక వ్యవస్థాపకతకు మద్దతు ఇచ్చే ఫౌండేషన్ ఫర్ యంగ్ ఇన్నోవేటర్స్ (ఎఫ్వైఐ) విజన్ సర్కిల్లో కూడా ఆయన సభ్యుడు.
గుర్తింపు
[మార్చు]- ఆయన 2008లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు.[9]
- ఆయన ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 లో $2.1 బిలియన్ల నికర విలువతో #68 స్థానంలో ఉన్నాడు.[10]
- 2024 అక్టోబరు 9 నాటి ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితా ప్రకారం, సంజీవ్ బిఖ్‌చందానీ, ఆయన కుటుంబం 75వ స్థానంలో ఉంది.[11]
- 21వ శతాబ్దపు తొలి భారతీయ డాట్ కామ్ వ్యవస్థాపకుల్లో సంజీవ్ ఒకడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "Bikhchandani hits Rs 722 cr jackpot". Business Standard. 2006-11-21. the original నుండి 2010-09-26 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Kushan Mitra (2008-01-13). "Dot-com's poster boy - Sanjeev Bikhchandani". Business Today. ఒరిజినల్ నుండి 2011-07-31 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది.
- ↑ Menon, Rashmi (2018-01-23). "What's in a name? Sanjeev Bikhchandani was apprehensive of 'Ashoka' University". The Economic Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-03-07.
- ↑ "Anand Mahindra, Venu Srinivasan to be honoured with Padma Bhushan; Naukri.com founder to get Padma Shri". The Economic Times. 26 January 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2020.
- ↑ "MINISTRY OF HOME AFFAIRS" (PDF). padmaawards.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 January 2020.
- ↑ "Sanjeev Bikhchandani traces his journey from dreamer to achiever". India Today. 2012-09-28. ఒరిజినల్ నుండి 2018-03-07 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-05-23.
- ↑ "Info Edge's Sanjeev Bikhchandani shares his slip-ups on the path to success". Business Today. 24 April 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 August 2021.
- ↑ Jain, Sunil (14 December 2005). "How Naukri.com became a hit". Business Standard. New Delhi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 August 2021 – via Rediff.com.
- ↑ "Strategic Growth Forum India - Speaker - Sanjeev Bikhchandani". Ernst & Young. the original నుండి 7 March 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 August 2021.
- ↑ "#68 Sanjeev Bikhchandani & family". Forbes India. 2020.
- ↑ "India's 100 Richest".
- ↑ "The First Class of the Indian Startups: The Unsung Heroes". www.startupguru.co. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-07-11.