సంఝౌతా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాకిస్తాన్ బోగీలతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్
అవలోకనం
చివరిస్థానంఢిల్లీ జంక్షన్
లాహోర్ జంక్షన్
స్టేషన్లుఅమృత్‌సర్ లాహోర్
ఆపరేషన్
నిర్వాహకులుభారతీయ రైల్వేలు
పాకిస్తాన్ రైల్వేలు
సాంకేతికం
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
మార్గ పటం
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రూట్ మ్యాప్
కి.మీ.
0 లాహోర్ జంక్షన్
ముఘల్‌పురా
జాల్లో
25 వాఘా
పాకిస్తాన్-భారత దేశము సరిహద్దు
రైలు మార్పు
28 అటారీ
39 ఖాసా
46 చెహర్తా
52 అమృత్‌సర్
ఢిల్లీ జంక్షన్ వైపునకు
లాహోర్ సెంట్రల్ స్టేషన్, రైలు పాకిస్తాన్ టెర్మినస్
అమృత్‌సర్ రైల్వే స్టేషను, భారతదేశంలోని రైల్వే స్టేషన్లలో ఒకటి
ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్, భారతదేశంలో టెర్మినస్

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ (హిందీ: समझौता एक्सप्रेस, పంజాబీ భాష: ਸਮਝੌਤਾ ਐਕਸਪ੍ਰੈਸ, ఉర్దూ: سمجھوتا ​​اکسپريس) సాధారణంగా ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. ప్రతి బుధవారం, ఆదివారం భారతదేశం లోని ఢిల్లీ జంక్షన్, అటారీ, పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. సంఝౌతా అనే పదం హిందీ, ఉర్దూ భాష రెండింటిలో "ఒప్పందం", "రాజీ" అని అర్ధం.

థార్ ఎక్స్‌ప్రెస్ పునఃప్రారంభం వరకు, ఇది రెండు దేశాల మధ్య నడిచే ఏకైక రైలు కనెక్షన్‌గా ఉంది. సిమ్లా ఒప్పందాన్ని అనుసరించి 1976 జూలై 22 న ఈ రైలు ప్రారంభమైంది. అమృత్సర్, లాహోర్ మధ్య 42 కిలోమీటర్ల దూరం ఇది నడిచింది. ఎనభై దశకం చివర్లో పంజాబ్‌లో అల్లర్లకు గురైన తరువాత, భద్రతా కారణాల వల్ల భారత రైల్వేలు అటారీ వరకు నడిచేందుకు మాత్రమే ఈ రైలు సేవలను పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాయి. అటారీ వద్ద కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్సులు జరుగుతాయి.

పరిధి[మార్చు]

2000 ఏప్రిల్ 14 న భారతీయ రైల్వేలు, పాకిస్థాన్ రైల్వేలు (పిఆర్) మధ్య ఒప్పందంలో భాగంగా దీని దూరం మూడు కిలోమీటర్ల పరిధి లోనికి సవరించబడింది.

సేవలు[మార్చు]

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సేవలు మొదలుపెట్టినప్పుడు రోజువారీ రైలుగా ప్రారంభమైంది. 1994 లో వారానికి రెండు రోజులు షెడ్యూల్‌గా మార్చబడింది. ఇంతకు మునుపు ఆ రైలు బోగీలు స్వదేశానికి తిరిగి వచ్చేవి. కాని 2000 లో ఆ రైలు బోగీలు ఆ రాత్రికి రాత్రంతా టెర్మినస్ నందే ఉండే పోయాయి. పాకిస్తాన్‌లో లాహోర్, భారత దేశంలో ఢిల్లీ టెర్మినస్ స్టేషన్లుగా ఉన్నాయి

సరిహద్దు[మార్చు]

పాకిస్తాన్‌లో వాఘా, భారతదేశంలోని అటారీ మధ్య సరిహద్దు దాటే ప్రక్రియ జరుగుతుంది. మొట్టమొదట ఎకాఎకీగా ఒకే బోగీలతో ఉన్న రైలు టెర్మినస్ స్టేషను వరకు ఈ రైలు నడిచి సేవలు అందించడం జరిగింది. తదుపరి కాలంలో పాకిస్తాన్ బోగీలు అటారీ స్టేషను వద్ద అగిపోతాయి. అక్కడ నుండి ప్రయాణీకులు మరొక ప్రయాణం చేయవల్సిన అవసరం ఏర్పడింది.

ఇప్పుడు ఢిల్లీ నుండి అటారీకి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంది. అక్కడ ప్రయాణీకులు అందరూ కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ కోసం దిగుతారు. ఈ రైలు ఢిల్లీ, అటారీల మధ్య ఏ వాణిజ్య అవసరాలకు విరామాలకు తావు లేదు.  దీనిని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అని తప్పుగా పిలుస్తారు. అధికారికంగా ఢిల్లీ-అటారీ లేదా అటారీ-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు.

వాస్తవమైన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అటారీ నుండి లాహోర్ వరకు నడుస్తుంది. అయితే పాకిస్థాన్ వైపు మొట్టమొదటి స్టేషను అయిన వాఘా వద్ద ప్రయాణీకులు తనిఖీ చేయబడతారు. ఈ రైలు సేవ భారతీయ రైల్వేలు (ఐఆర్), పాకిస్థాన్ రైల్వేలు (పీఆర్) ల మధ్య ఒక ఒప్పందంతో ఏర్పాటు చేయబడింది. ఈ ఒప్పంద సమయంలో రైలు కోసం ఒక భారతీయ, ఒక పాకిస్తానీ రేక్ (మొత్తం రైలుబోగీలు), లోకోమోటివ్‌ను ఇరు దేశాలు ఆరు నెలల పాటు ఉపయోగించు కోవచ్చు.

రైలు సాధారణంగా నాలుగు, ఎనిమిది కోచ్‌ల మధ్య ఉంటుంది. పాకిస్థాన్ అందించే రేక్ సాధారణంగా ఆల్కో డిఎల్ -543 క్లాస్ ఎఎల్‌యు20 డీజిల్ లోకో (లాహోర్ షెడ్) చేత నడుపబడుతోంది, పాకిస్థాన్ రైల్వేలు (పీఆర్) యొక్క ప్రామాణిక ముదురు ఆకుపచ్చ రంగులో మొత్తం రైలు ఉంటుంది.

రైలు విరామం[మార్చు]

2001 జనవరి 13 న భారతీయ పార్లమెంటుపై జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో, 2002 జనవరి 1 న ఇది రద్దు చేయబడినప్పుడు రైలు యొక్క తొలి విరామం ఏర్పడింది. 2004 జనవరి 15 న సేవ పునఃప్రారంభించబడింది.

2007 డిసెంబరు 27 న బెనజీర్ భుట్టో హత్య తర్వాత భారతదేశం, పాకిస్తాన్ రెండింటికీ గొప్ప సంకేత ప్రాముఖ్యతగా తీవ్రవాదులను నివారణ చర్యగా "అధిక విలువ లక్ష్యంగా" తిరస్కరించడానికి, ఈ రైలు సేవ (సర్వీస్) కూడా సస్పెండ్ చేయబడింది.

హెరాయిన్ , మందుగుండు[మార్చు]

2012 అక్టోబరు 8 న పోలీసులు ఢిల్లీకి వెళ్లే రైలులో వాఘా సరిహద్దు వద్ద 100 కిలోల కాంట్రాబాండ్ హెరాయిన్, 500 రౌండ్ల బుల్లెట్ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.[1][2]

2019 ప్రతిష్టంభన[మార్చు]

2019 ఫిబ్రవరి 28 న, భారతదేశం-పాకిస్థాన్ ప్రతిష్టంభన తరువాత ఈ సేవ నిలిపివేయబడింది. పాకిస్థాన్, భారతదేశం మధ్య ఉన్న ఉద్రిక్తతలు దృష్ట్యా" సేవను నిలిపివేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. "ప్రయాణీకుల రద్దీ క్షీణత", "సరిహద్దు నుండి సేవల సస్పెన్షన్" కారణంగా, భారతదేశం రైలు పరుగును దాని వైపున నిలిపివేసినట్లు తెలిసింది.[3][4]

2007 బాంబు దాడి[మార్చు]

19 ఫిబ్రవరి 2007 ఉదయం ప్రారంభంలో, ఢిల్లీ - అటారీ ఎక్స్‌ప్రెస్‌పై తీవ్రవాద దాడిలో 70 మంది (ఎక్కువగా పాకిస్తానీ పౌరులు, రైలును రక్షించే కొంతమంది భారతీయ సైనికాధికారులు) చంపబడ్డారు, గాయపడ్డారు.[5][6] హర్యానా లోని పానిపట్ సమీపంలోని దవానా స్టేషను వద్ద ఈ దాడి జరిగింది. అధునాతన పేలుడు పరికరాలు (ఐఈడిలు), మండే స్వభావంగల పదార్థాల యొక్క సాక్ష్యాలను అధికారికంగా కనుగొన్నారు. వీటిలో మూడు పేలని కాని ఐఈడిలు ఉన్నాయి. స్వామి అసీమానంద్ పేలుళ్లను పేల్చారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానించింది. కానీ, తరువాత సాక్ష్యం లేకపోవడంతో ఈ అనుమానం తొలగించబడింది.[7]

జులై 1, 2009 న, యుఎస్ ట్రెజరీ విభాగం, లష్కర్-ఏ తైయిబా యొక్క ఆరిఫ్ ఖాస్మానీని తీవ్రవాదానికి పాల్పడిన వ్యక్తిగా గుర్తించింది, ఇది ఇతర విషయాలతో పాటుగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబులో అతని పాత్ర ఉన్నట్లు పేర్కొన్నది.[8]

2010 డిసెంబరు 30 న, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్వామి అసీమానంద పేలుళ్లకు కారణమనే సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తన స్నేహితుడు భౌతిక శాస్త్రంలో అధిక అధ్యయనం చేసిన సందీప్ డాంగీ, పేలుడులో ఉపయోగించిన పేలుడు సామగ్రిని నిర్మించడానికి ఒక ఎలక్ట్రీషియన్ అయిన రామ్జీ కల్సాంగ్రా నుండి సహాయం తీసుకున్నాడు.[7]

8 జనవరి 2011 న, అజీమానంద్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ యొక్క బాంబు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.[9] తరువాత ఒక ప్రకటన తర్వాత దుర్బలమయింది.[10] తరువాత హిందూ జాతీయవాద గ్రూపు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్), సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కు చట్టపరమైన నోటీసును పంపింది. ఇది ఉద్దేశపూర్వకంగా, మీడియాలో స్వామి అసీమానంద నేరాంగీకారం గురించి ప్రకటించినట్లు ఆరోపించింది. ఆర్.ఎస్. ప్రతినిధి రామ్ మాధవ్, సంస్థలు, వ్యక్తుల విచారణను విమర్శించారు.[11]

వివిధ స్థానిక వార్తాపత్రికల ప్రకారం, 2012 ఫిబ్రవరిలో ఎన్ఐఎ ప్రధాన కార్యకర్తగా భావించిన కమల్ చౌహాన్‌ను ఎన్ఐఎ అరెస్టు చేసింది.

మూలాలు[మార్చు]

 1. Rs.505 crore drug bust from India-bound Samjhauta Express Vikas Kahol, Mail Today, Chandigarh, 8 October 2012, indiatoday.intoday.in
 2. Heroine worth R 505 crore, ammunition seized from Samjhauta Express, Chandigarh, 8 October 2012, Dailybhaskar.com
 3. Siddiqui, Naveed (28 February 2019). "Samjhota Express operations suspended: FO". Dawn (in ఇంగ్లీష్). Retrieved 28 February 2019.
 4. "India cancels Samjhauta Express operations on its end, lack of occupancy behind decision". The Times of India. 28 February 2019. Retrieved 28 February 2019.
 5. "Archived copy". Archived from the original on 21 ఫిబ్రవరి 2007. Retrieved 1 మార్చి 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 6. Zee News - Passengers recount horror on blast-hit train
 7. 7.0 7.1 "Direct hand of Aseemanand in Samjhauta blasts: NIA". Hindustan Times. 30 డిసెంబరు 2010. Archived from the original on 22 జనవరి 2011. Retrieved 1 మార్చి 2019.
 8. "Treasury Targets Al Qaida and Lashkar-E Tayyiba Networks in Pakistan". Treasury.gov. Retrieved 2012-02-05.
 9. Vishwa Mohan; Abantika Ghosh (8 January 2011). "Aseemanand owns up to strike on Mecca Masjid". Times of India. Archived from the original on 28 సెప్టెంబరు 2011. Retrieved 8 January 2011.
 10. Swami Aseemanand 'confessed' under duress Archived 2011-09-28 at the Wayback Machine Times of India - 10 January 2011
 11. Iyer, Shekhar (8 జనవరి 2011). "Indresh lawyers issue notice to CBI for statement 'leak'". Hindustan Times. Archived from the original on 20 అక్టోబరు 2012. Retrieved 8 జనవరి 2011.