సంతానోత్పత్తి దశలో ఉన్న ఈము పక్షుల పెంపక నిర్వహణ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
ఈము పక్షులు, 18 – 24 మాసాల వయసులో సంతానోత్పత్తి దశకు చేరుకుంటాయి. మగ, ఆడ పక్షుల నిష్పత్తి 1 : 1 గా ఉండేలా చూడాలి. కొట్టంలో జతకట్టించినట్లైతే, ఆ రెండు పక్షుల మైత్రి సంబంధాల ఆధారంగా చేయాలి. జతకట్టించే సమయంలో, ఒక జంటకు 2500 చ|| అడుగుల (100x25) వైశాల్యం గల ప్రదేశాన్ని కల్పించాలి. చెట్లు, పొదలను ఏర్పాటు చేసి, వాటి ఏకాంతానికి, ప్రణయానికి వీలు కలిగించాలి. ఈ జత కట్టించే కార్యక్రమానికి 3 – 4 వారాల ముందే, ఆ పరిస్థితికి తగిన ఆహారాన్ని సమకూర్చాలి. ఆ ఆహారంలో, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి బలవర్థకమైన పోషక పదార్థాలు ఉండి, పక్షులలో ఫలవంతమైన సంతానోత్పత్తి కలగడానికి దోహద పడుతుంది. సామాన్యంగా, ఒక పెద్ద పక్షి, ఒక రోజుకు 1 కేజీ ఆహారం తీసుకుంటుంది. కాని జతకట్టే (కాలం) దశతో, ఆహారం తీసుకోవడం చాల తగ్గిపోతుంది. అందువలన పోషకాలను పక్షులు పొందేటట్లు చూసుకోవాలి[1].
మొదటి గుడ్డును 2 ½ సంవత్సరాల వయసులో, ఎమూపక్షి పడుతుంది. అక్టోబరు నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు ఎక్కువగా పెట్టబడతాయి. ముఖ్యంగా, సంవత్సరంలో ఎక్కువ చలిగా ఉన్న రోజులలో, ఎక్కువగా పక్షులు గుడ్లు పెడతాయి. ఎమూపక్షి, సాయంత్రం 5.30 నుండి 7.00 పి.మ్ మధ్యకాలంలో గుడ్లు పెడుతుంది. రోజుకి రెండు సార్లు, గుడ్లను ఏరడం వలన అవి కొట్టంలో పాడవకుండా జాగ్రత్తపడవచ్చు. సాధారణంగా, ఒక ఆడ ఎమూ పక్షి, మొదటి సంవత్సరం ఆ వృత్తిలో 15 గుడ్లను పడ్తుంది. ఆ తరువాతి సంవత్సరాలలో, గుడ్ల ఉత్పత్తి అధికమై, సుమారు 30 – 40 గుడ్ల ఉత్పత్తి దాకా చేరుకుంటుంది. సగుటున, ఒక ఆడ పక్షి, సంవత్సరానికి 25 గుడ్ల పెడుతుంది. ఒక గుడ్డు బరువు సుమారు 475 - 650 గ్రాములు ఉంటుంది. సంవత్సరానికి, ఒక గుడ్డు సగుటు బరువు 560 గ్రాములు ఉంటుంది. గుడ్డు ఆకుపచ్చరంగులో ఉండి గరుకు పాలరాయిలో కనిపిస్తుంది. ఆ రంగు గాఢత క్రమేపీ లేత మధ్యస్తం మ
ఈము గుడ్లు
[మార్చు]జతకట్టే దశలో ఉన్న పక్షులకు యిచ్చేమేతలో తగిలంత కాల్షియం (2.7%) ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన, గుడ్డు, కాల్షియంతో దృఢంగా ఉంటుంది. అధికంగా కాల్షియం, జత కట్టే పక్షికి యిచ్చినట్లైతే గుడ్ల ఉత్పత్తి పై చెడు ప్రభావం చూపుతుంది. మగ పక్షుల సంతానోత్పత్తి సామర్థ్యం పై కూడా దుష్ప్రభావం కలుగుతంది. అదనపు కాల్షియంను, ప్రకృతి సిద్ధమైన కాల్షియం కార్చొనేట్ గరుకు పొడిగా గాని, మెత్తటి పొడిగా గాని వేరే తొట్టి ఏర్పరచి, దాని ద్వారా అందించవచ్చు. తరచుగా, కొట్టం నుండి, గుడ్లను సేకరించాలి. ఒకవేళ గుడ్లు మలిన పడితే, వాటిని గరుకు యిసుక కాగితం (sand papers) తో శుభ్రం పరేచి మాదితో తుడవాలి. ఒక చల్లటి గదిలో 600 f ఉష్ణోగ్రతలో గుడ్లను భద్రపరచాలి. 10 రోజుల కంటే ఎక్కువగా గుడ్లను అందులో ఉంచరాదు, ఎందుకంచే వాటి పొదిగే సామర్థ్యానికి ఆటంకం కలుగుతుంది. గది ఉష్ణోగ్రతలో భద్రపరచిన గుడ్లు, మూడు, నాలుగు రోజుల కొకసారి పొదుగుటకు అమర్చాలి[1].