సంతోష్ కుమార్ కాకర్
సంతోష్ కుమార్ కాకర్ | |
|---|---|
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకుంటున్న డాక్టర్ సంతోష్ కుమార్ కాకర్. | |
భారతదేశం | |
| వృత్తి | చెవి, ముక్కు, గొంతు నిపుణుడు (ENT) |
| పురస్కారాలు | పద్మశ్రీ |
సంతోష్ కుమార్ కాకర్ భారతీయ చెవి, ముక్కు, గొంతు నిపుణుడు (ENT). ఈయన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మాజీ డైరెక్టర్.[1] 1960లో వైద్య విద్య పూర్తి చేసిన ఈయన, 1963లో లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS) పట్టా పొందారు. అనంతరం వైద్య వృత్తిని ప్రారంభించారు. 1968లో లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోషిప్ కూడా దక్కించుకున్నారు.[2]
కాకర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), అసోసియేషన్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా నిపుణుల బృందంలో సభ్యులుగా ఉన్నారు.[3] వికలాంగులకు తోడ్పడే పరికరాల అభివృద్ధి కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.[2] భారత రాష్ట్రపతికి గౌరవ సర్జన్‌గా కూడా సేవలందించారు.[2] ఈయన తన పరిశోధనలను అనేక అంతర్జాతీయ వైద్య పత్రికల్లో వ్యాసాలుగా ప్రచురించారు.[4][5] భారత ప్రభుత్వం 1986లో ఈయనను నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సన్మానించింది.[6] న్యూఢిల్లీలోని సీతారామ్ భారతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఈయన వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ధర్మశాలలు, సేవా ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.[1]
మూలాలు
[మార్చు]- 1 2 "Keeping yourself busy is key". Hindustan Times. 27 సెప్టెంబరు 2012. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 21 జూలై 2015.
- 1 2 3 "Expert profile". Doctor [suspicious link removed]. 2015. Retrieved 21 జూలై 2015.
- ↑ "Association of the Otorhynolaryngologists of India". Association of the Otorhynolaryngologists of India. 2015. Archived from the original on 21 జూన్ 2015. Retrieved 21 జూలై 2015.
- ↑ Mukhesh Sooknundun; Santosh Kumar Kacker; Rajesh Bhatia; R.C. Deka (నవంబరు 1986). "Nasal septal deviation: Effective intervention and long term follow-up". International Journal of Pediatric Otorhinolaryngology. 12 (1): 65–72. doi:10.1016/S0165-5876(86)80059-3. PMID 3818192.
- ↑ Swati Y. Bhave (2014). ECAB Invasive Meningococcal Disease. Elsevier Health Sciences. p. 118. ISBN 9788131239568.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 జూలై 2015.
మూస:వైద్యరంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')
- May 2019 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- May 2019 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- వైద్యరంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- పుట్టిన సంవత్సరం తెలియని జీవించి ఉన్న వ్యక్తులు
- భారతీయ ఈఎన్టీ నిపుణులు
- భారతీయ వైద్య పరిశోధకులు
- భారతీయ వైద్య రచయితలు
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
- రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోలు
- భారతీయ వైద్య విద్యావేత్తలు
- జీవిస్తున్న ప్రజలు
- ఉత్తరప్రదేశ్ వైద్యులు
- 20వ శతాబ్దపు భారతీయ సర్జన్లు
- ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్లు