Jump to content

సంతోష్ కౌటిక తర్ఫే

వికీపీడియా నుండి
సంతోష్ కౌటిక తర్ఫే

పదవీ కాలం
2014 – 2019
ముందు రాజీవ్ సాతావ్
తరువాత సంతోష్ బంగర్
నియోజకవర్గం డెగ్లూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి) (2022–)
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
భారత జాతీయ కాంగ్రెస్
నివాసం మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

సంతోష్ కౌటిక తర్ఫే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కలమ్నూరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సంతోష్ కౌటిక తర్ఫే బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కలమ్నూరి నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[1] ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి గజానన్ విఠల్‌రావ్ ఘుగేపై 10,536 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

సంతోష్ కౌటిక తర్ఫే 2019లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కలమ్నూరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[4] ఆయన 2022లో శివసేన (యుబిటి) పార్టీలో చేరి[5] 2024లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సంతోష్ బంగర్ చేతిలో 31,083 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  4. "Kalamnuri Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  5. "VHP leader Uddhav Kadam, former Congress MLA Santosh Tarfe join Uddhav Thackeray-led Shiv Sena". The Times of India. 30 August 2022. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  6. "Maharastra Assembly Election Results 2024 - Kalamnuri". Election Commission of India. 23 November 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.