సంత్ కబీర్ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sant Kabir Nagar జిల్లా

संत कबीर नगर जिला
Uttar Pradesh లో Sant Kabir Nagar జిల్లా స్థానము
Uttar Pradesh లో Sant Kabir Nagar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముBasti
ముఖ్య పట్టణంKhalilabad, India
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుSant Kabir Nagar
విస్తీర్ణం
 • మొత్తం1,659.15 కి.మీ2 (640.60 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం17,14,300
 • సాంద్రత1,000/కి.మీ2 (2,700/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత76.01 per cent
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో సంత్ కబీర్ నగర్ జిల్లా (హిందీ:संत कबीर नगर जिला) ఒకటి. ఖలిలాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సంత్ కబీర్ నగర్ జిల్లా బస్తి డివిషన్‌లో భాగంగా ఉంది. 1997 సెప్టెంబరు 5 న బస్తి జిల్లా నుండి 131 గ్రామాలు మరియు బంసి జిల్లాలోని సిద్ధార్ద్ నగర్ నుండి 161 గ్రామాలు చేర్చి సంత్ కబీర్ నగర్ జిల్లా రూపొందించబడింది.

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో సిద్ధార్ధ్ నగర్ జిల్లా మరియు మహారాజ్‌గజ్ జిల్లా, తూర్పు సరిహద్దులో గోరక్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో అంబేద్కర్ నగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బస్తి జిల్లా ఉన్నాయి. జిల్లావైశాల్యం 1659.15 చ.కి.మీ.

పేరువెనుక చరిత్ర[మార్చు]

జిల్లకు 15వ శతాబ్ధానికి చెందిన కవి కబీర్దాస్ స్మృత్యర్ధం నామకరణం చేయబడింది. కబీర్దాస్ జిల్లాలోని మఘర్‌లో నివసించాడు. ఆయన మరణం గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. భారతదేశంలో పాఠశాలలలో ఇది పాఠ్యాంశ్యంగా (నీతి కథలు లేక చరిత్ర) కూడా ఉంది. ఆయనను ఖనం చేసే సమయంలో ముస్లిములు మరుయు హిందువుల మద్య వివాదం చెలరేగింది. ముస్లిములు మరణానంతరం శరీరాన్ని పూడ్చి పెట్టడం ఆనవాయితీ. హిందువులు మరణానంతరం శరీరాన్ని దహనం చేయడం ఆనవాయితీ. కబీర్‌దాస్ చెప్పిన విషయాలను పుస్తకరూపంలో హిందువులు మరియు ముస్లిములు వ్రాసి ఉంచినదానిని గుర్తించుకు తెచ్చుకుని దానిని అనుసరించారు. ఇలా వివాదం ముగింపుకు వచ్చింది.మఘర్‌లో ఆయన సమాధి (దర్గా) మరియు మందిరం పక్కపక్కన ఉంటాయి.

చరిత్ర[మార్చు]

1997 సెప్టెంబరు 5 న బస్తి జిల్లా నుండి 131 గ్రామాలు మరియు బంసి జిల్లాలోని సిద్ధార్ద్ నగర్ నుండి 161 గ్రామాలు చేర్చి సంత్ కబీర్ నగర్ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సంత్ కబీర్ నగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు[మార్చు]

విషయాలు వివరణలు
డివిషన్ బస్తి
తాలూకాలు 3 ఖాలిలబ్ధ్, మెందావల్ మరియు ధన్ఘట
మండలాలు శాంత, మెందవల్, బెళర్ కలాన్, సెమెరియవన్, బఘౌలి, ఖలిలబద్, నాథ్ నగర్, హైన్సర్ బజార్, పౌలి
అసెంబ్లీ నియోజక వర్గం 3 ఖాలిలబ్ధ్, మెందావల్ మరియు ధన్ఘట
పార్లమెంటు నియోజక వర్గం సంత్ కబీర్ నగర్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,714,300,[2]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 283 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 1041 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.71%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 869 :1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 69.01%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

.

ప్రముఖ ప్రదేశాలు[మార్చు]

  • ఖలిలాబాద్ (భారతదేశం) (జిల్లా ప్రధాన కార్యాలయం)
  • మఘార్ (భారతదేశం )
  • బఖరియా
  • మెహద్వాల్
  • ధంఘటా
  • ధర్మసింగ్వా

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

  • సంత్ కబీర్ దాస్ (కవి)
  • అఖిలేష్ సింగ్ (మేనేజింగ్ డైరెక్టర్ ఎ.పి.ఆర్.ఐ కుటుంబ అసోసియేట్స్)
  • అహసాన్ ఖాన్ (రాజకీయవేత్త)
  • జగదీష్ లాల్ శ్రీవాస్తవ (విలేఖరి)
  • రాజు రంజన్ యాదవ్ (సోషలిస్టు)
  • సిద్ధార్థ నీర్ (విలేఖరి)
  • విమలేష్ త్రిపాఠి (విలేఖరి)
  • అఖిలేష్ త్రిపాఠి (డైరెక్టర్ యాక్షన్ రూరల్ డెవెలెప్మెంట్ వరదన్ సొసైటీ, ధర్మసింగ్వా)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est. line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341 line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)

http://www.linkedin.com/profile/view?id=273308780&goback=%2Enmp_*1_*1_*1_*1_*1_*1_*1_*1_*1_*1&trk=spm_pic

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]