సందీప్ ఉన్నికృష్ణన్
| మేజరు సందీప్ ఉన్నికృష్ణన్ అశోక్ చక్ర అవార్డు(AC) | |
|---|---|
సందీప్ ఉన్నికృష్ణన్ | |
| జననం | 1977 మార్చి 15 కోజికోడ్, కేరళ, భారతదేశం |
| మరణం | 2008 నవంబరు 28 (వయసు: 31) ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం |
| దహన సంస్కారాలు | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం[1] |
| రాజభక్తి | |
| సేవలు/శాఖ | |
| సేవా కాలం | 1999–2008 |
| ర్యాంకు | |
| సర్వీసు సంఖ్య | IC-58660 |
| యూనిట్ | బీహార్ రెజిమెంట్]] |
| పోరాటాలు / యుద్ధాలు | ఆపరేషన్ విజయ్ (1999) ఆపరేషన్ పరాక్రమ్ ఆపరేషన్ రక్షక్ కాశ్మీర్‌లో తిరుగుబాటు 2008 ముంబై దాడులు |
| పురస్కారాలు | |
సందీప్ ఉన్నికృష్ణన్, (1977 మార్చి 15 –2008 నవంబరు 28) ఒక భారతీయ సైనిక అధికారి. అతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 51వ స్పెషల్ యాక్షన్ గ్రూప్‌లో డిప్యుటేషన్‌పై పనిచేసాడు. 2008 ముంబై దాడుల సమయంలో జరిగిన ఎదురు కాల్పులలో మరణించాడు.[2] 2009 జనవరి 26న అతనికి భారతదేశపు అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్ర మరణానంతరం లభించింది.[3]
ప్రారంభ, వ్యక్తిగత జీవితం
[మార్చు]సందీప్ ఉన్నికృష్ణన్, బెంగళూరుకు చెందిన మలయాళీ నాయర్ కుటుంబానికి చెందిన ఇస్రో విశ్రాంత అధికారి కె. ఉన్నికృష్ణన్ [4][5] ధనలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు.[6][7] అతని తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కేరళలోని కోజికోడ్ నుండి బెంగళూరు వెళ్లారు.[8][9]
1995లో ఐ.ఎస్.సి. సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేట్ చేయడానికి ముందు బెంగళూరు లోని ది ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌లో 14 సంవత్సరాలు చదివాడు.[10]1995లో భారతీయ స్కూల్ సర్టిఫికెట్ కోర్స్, సైన్స్ విభాగంలో పట్టభద్రుడయ్యాడు.[11] చిన్నప్పటి నుంచి ఉన్నికృష్ణన్ సాయుధ దళాలలో చేరాలని అనుకున్నాడు.[12] అతను నేహాను వివాహం చేసుకున్నాడు.[13]
సైనిక జీవితం
[మార్చు]సందీప్ ఉన్నికృష్ణన్, 1995లో మహారాష్ట్ర, పూణే లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. అతను ఆస్కార్ స్క్వాడ్రన్ (నం. 4 బెటాలియన్)లో భాగం, 94వ కోర్సు భారతీయ సాయుధ దళాల అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.[14]
ఉన్నికృష్ణన్, 1999 జూన్ 12 న డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో, 104వ రెగ్యులర్ కోర్సులో భాగంగా ఐఎంఎ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత భారత సైన్యం బీహార్ రెజిమెంట్ (పదాతిదళం), 7వ బెటాలియన్‌లో లెఫ్టినెంట్‌గా నియమితుడయ్యాడు. [15][16] 1999 జూలైలో "ఆపరేషన్ విజయ్" సమయంలో, ఉన్నికృష్ణన్, పాకిస్తాన్ దళాల భారీ ఫిరంగి కాల్పులను, చిన్న ఆయుధాల కాల్పులనూ ఎదుర్కొంటూ వారి శిబిరాల వద్దకు వెళ్లాడు. 1999 డిసెంబరు 31 సాయంత్రం[17] అతను ఆరుగురు సైనికుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రత్యర్థి వైపు నుండి 200 మీటర్ల దూరంలో ప్రత్యక్ష పరిశీలన కాల్పుల్లో భాగంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు.[18]
అతను 2003 జూన్ 12న కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు.[19] ఆ తర్వాత 2005 జూన్ 13న మేజర్‌గా పదోన్నతి పొందాడు.[20] 'ఘాతక్ కోర్సు' (బెల్గాంలోని ఇన్‌ఫాంట్రీ వింగ్ కమాండో స్కూల్‌లో) సమయంలో, అతను రెండుసార్లు "ఇన్‌స్ట్రక్టర్" గ్రేడింగ్ ప్రశంసలను పొందాడు.[21]
అతను గుల్మార్గ్‌లోని హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్‌లో కూడా శిక్షణ పొందాడు.[22] సియాచిన్, జమ్మూ, కాశ్మీర్, గుజరాత్ (2002 గుజరాత్ అల్లర్ల సమయంలో), హైదరాబాద్, రాజస్థాన్‌లతో సహా వివిధ ప్రదేశాలలో పనిచేసిన తరువాత, అతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో చేరడానికి ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తయిన తర్వాత, అతను 2007 జనవరిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ (51) శిక్షణ అధికారిగా నియామక ఉత్తర్వులను అందుకున్నాడు. ఎన్.ఎస్.జి. వివిధ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నాడు.[23]
ఆపరేషన్ బ్లాక్ టోర్నడో
[మార్చు]2008 నవంబరు 26 రాత్రి, దక్షిణ ముంబైలోని అనేక భవనాలపై దాడి జరిగింది.[24] 100 సంవత్సరాల పురాతనమైన తాజ్ మహల్ ప్యాలెస్ హోటలులో దుండగులు బందీలుగా ఉంచుకున్నవారిని రక్షించడం కోసం మోహరించిన స్పెషల్ యాక్షన్ గ్రూప్ (51) బృందానికి సందీప్ కమాండర్‌గా నాయకత్వం వహించాడు. అతను 10 మంది కమాండోల బృందంతో హోటల్‌లోకి ప్రవేశించి, మెట్ల ద్వారా ఆరవ అంతస్తుకు చేరుకున్నాడు. ఆరవ, ఐదవ అంతస్తుల నుండి బందీలను తరలించిన తర్వాత, బృందంతో మెట్లు దిగుతుండగా, లోపలి నుండి లాక్ చేయబడిన నాల్గవ అంతస్తులోని గదిలో ఉగ్రవాదులు ఉన్నారని వారు అనుమానించారు. కమాండోలు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగానే, ఉగ్రవాదుల కాల్పుల్లో కమాండో సునీల్ కుమార్ యాదవ్ రెండు కాళ్లకు తూటాలు తగిలాయి.[25] మేజర్ సందీప్ యాదవ్‌ను రక్షించి ఖాళీ చేయించాడు, కానీ గదిలో గ్రెనేడ్ పేలిన తర్వాత ఉగ్రవాదులు అదృశ్యమయ్యారు.[26]
సందీప్, అతని బృందం దాదాపు 15 గంటల పాటు హోటల్ నుండి బందీలను ఖాళీ చేయించడం కొనసాగించారు. 2008 నవంబరు 27న అర్ధరాత్రి సమయంలో, సందీప్ ఉన్నికృష్ణన్, అతని బృందం హోటల్‌లోని ఉగ్రవాదులచేతిలో బందీలుగా ఉన్నవారి వైపు ఉన్న ఏకైక మార్గం, సెంట్రల్ మెట్ల మార్గంలో పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఊహించినట్లుగానే, ఉగ్రవాదులు సెంట్రల్ మెట్ల గుండా కమాండోలు పైకి వస్తున్నట్లు చూసినప్పుడు, వారు మొదటి అంతస్తు నుండి ఎన్.ఎస్.జి. బృందంపై మెరుపుదాడి చేశారు. దీనిలో 27 ఏళ్ల కమాండో సునీల్ కుమార్ జోధా ఏడు బుల్లెట్లతో తీవ్రంగా గాయపడ్డాడు (ఎడమ చేతిలో మూడు, అతని కుడి అరచేతిలో ఒకటి, కుడి భుజంలో రెండు, అతని ఛాతీలో ఒకటి). సందీప్ అతని తరలింపుకు ఏర్పాట్లు చేసి, ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగించటంలో నిమగ్నమయ్యాడు.
తరువాత ఉగ్రవాదులు తదుపరి అంతస్తుకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతను ఒంటరిగా వారిని వెంబడించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో, అతను నలుగురు ఉగ్రవాదులను తాజ్ మహల్ హోటల్ ఉత్తర చివరన ఉన్న బాల్‌రూమ్‌కు ఒంటరిగా తీసుకెళ్లగలిగాడు, కానీ ఆ డాడిలో తన ప్రాణాలను త్యాగం చేశాడు. అతని చివరి మాటలు, "పైకి రావద్దు, నేను వారిని అడ్డుకుంటాను" అని ఎన్.ఎస్.జి. అధికారులుకు తెలిపాడు. తరువాత ఎన్.ఎస్.జి కమాండోలు ముంబై తాజ్ హోటల్‌లోని బాల్‌రూమ్, వాసాబి రెస్టారెంట్‌లో చిక్కుకున్న నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.[27][28]
మూలాలు
[మార్చు]- ↑ Ravindran, Nirmala (29 November 2008). "Nation bid tearful adieu to Karkare, Unnikrishnan". India Today (in ఇంగ్లీష్). Retrieved 7 July 2022.
- ↑ "2 NSG men martyred, six others injured in Mumbai gunbattles". The Economic times. PTI. 28 November 2008. Retrieved 2008-11-28. [1]
- ↑ "11 security personnel to get Ashok Chakra". Archived from the original on 2009-02-03. Retrieved 2009-01-25.
- ↑ "Kerala aid for Maj Sandeep's family".
- ↑ "'He asked me to watch the operation on TV'". 14 May 2012.
- ↑ "Kerala aid for Maj Sandeep's family".
- ↑ "'He asked me to watch the operation on TV'". 14 May 2012.
- ↑ "Biopic of Major Sandeep Unnikrishnan is all set to release this year, know all about the braveheart of India".
- ↑ "Army Major from Kerala dies in Mumbai encounter". WebIndia 123. 28 November 2008. Archived from the original on 13 February 2012. Retrieved 28 November 2008.
- ↑ "Bangalore boy's supreme sacrifice". Bangalore Mirror, India Times. Retrieved 29 November 2008.
- ↑ "Maj Sandeep UnniKrishnan - A school remembers". Times of India. Retrieved 29 November 2008.
- ↑ "A school remembers". The Times of India. Times of India. 2008-11-29. Archived from the original on 2012-10-22. Retrieved 2008-11-29.
- ↑ Lulla, Anil Budur (29 November 2008). "Thousands take first & last look at martyr". Telegraph India. The Telegraph (India). Retrieved 7 July 2022.
- ↑ Mund, Prasenjit (2008-11-30). "NDA Buddies Remember Unni=". The Times of India. The Times Of India. Archived from the original on 2012-10-22. Retrieved 2008-11-30.
- ↑ "2 NSG men martyred, six others injured in Mumbai gunbattles". The Economic times. PTI. 28 November 2008. Retrieved 2008-11-28. [2]
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 13 May 2000. p. 625.
- ↑ "Major Unnikrishnan's colleagues recall his qualities". Zee News. Retrieved 10 December 2008.
- ↑ "Major Unnikrishnan's colleagues recall his qualities". The Hindu. Chennai, India. 2008-12-10.
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 8 November 2003. p. 1508.
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 29 October 2005. p. 2075.
- ↑ Verma, Kumod (2008-11-29). "Bihar Regiment fondly remembers Major Unnikrishnan". The Times of India. Archived from the original on 2012-10-22.
- ↑ Verma, Kumod (2008-11-29). "Bihar Regiment fondly remembers Major Unnikrishnan". The Times of India. Archived from the original on 2012-10-22.
- ↑ "Mangalorean.Com- Serving Mangaloreans Around The World!". Archived from the original on 4 December 2008. Retrieved 29 November 2008.
- ↑ Levy, Adrian; Scott-Clark, Cathy (2013). The Siege : The Attack on the Taj (in English). New Delhi, India: Penguin Books. pp. clxxxviii. ISBN 978-0-14-342010-1.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ "A buddy called Major Unnikrishnan". Sify. Archived from the original on 19 February 2009. Retrieved 1 December 2008.
- ↑ "sify.com". Sify. Archived from the original on 19 February 2009. Retrieved 1 December 2008.
- ↑ "Sandeep Unnikrishnan waged a valiant battle against terrorists". The Hindu. Chennai, India. 29 November 2008. Archived from the original on 2 December 2008. Retrieved 29 November 2008.
- ↑ Nation bids adieu to ATS chief, NSG commando – India News – IBNLive