సందీప్ కుమార్ (రాజకీయ నాయకుడు)
| సందీప్ కుమార్ | |||
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 14 – 2016 ఆగస్టు 31 | |||
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 14 – 2020 | |||
| ముందు | జై కిషన్ | ||
|---|---|---|---|
| తరువాత | ముఖేష్ కుమార్ అహ్లవత్ | ||
| నియోజకవర్గం | సుల్తాన్‌పూర్ మజ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1980 July 12 సోనిపట్ , హర్యానా[1][2] | ||
| జాతీయత | |||
| ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | రీతు వర్మ | ||
| సంతానం | ప్రవీణ్, రుద్రా ప్రతాప్ సింగ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సందీప్ కుమార్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ మజ్రా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 ఫిబ్రవరి 14 నుండి 2016 ఆగస్టు 31 వరకు స్త్రీ, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల శాఖల మంత్రిగా పని చేశాడు.[3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సందీప్ కుమార్ 198 జూలై 12న హర్యానాలోని సోనిపట్‌లో జన్మించాడు. ఆయన 2001లో ఢిల్లీ స్కూల్ నుండి 12వ తరగతి, 2004లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి ఆ తరువాత మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సందీప్ కుమార్ 2012లో జరిగిన అవినీతి వ్యతిరేక భారత ఉద్యమం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ మజ్రా శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జై కిషన్ చేతిలో 1,112 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రభు దయాళ్‌ను 6,031 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5] అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో స్త్రీ, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల శాఖల శాఖ మంత్రిగా పని చేసి అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఆయనను 2016 ఆగస్టు 31న మంత్రివర్గం నుండి తొలగించి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బహిష్కరించారు.[6][7][8]
సందీప్ కుమార్ ఆ తరువాత 2021లో తన రాజకీయ పార్టీ 'కీర్తి కిసాన్ షేర్ పంజాబ్'ను స్థాపించి 2024 ఆగస్టు 12న హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి, ఆయన వివాదాస్పద గతం బయటపడిన తర్వాత ఆయన చేరిన ఆరు గంటలకే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "संदीप कुमार : गांव सरगथल अब मंत्री बने : The Dainik Tribune".
- ↑ "Latest Gohana News 16/02/2015: महिला एवं बाल विकास की सोनीपत को जिम्मेदारी". www.bhaskar.com. 2015-02-16. Retrieved 2016-09-04.
- ↑ "Only Dalit face in Delhi Cabinet, AAP's Sandeep Kumar made news for glowing tribute to wife" (in ఇంగ్లీష్). The Indian Express. 1 September 2016. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "संदीप कुमार". आज तक. 2024. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Ex-Delhi minister Sandeep Kumar acquitted in 2016 rape case after complainant turns hostile" (in ఇంగ్లీష్). The Indian Express. 12 September 2024. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Sandeep Kumar becomes fourth AAP MLA to be disqualified". The Times of India. 21 August 2019. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "BJP targets Sandeep Kumar over wife's US trip, says more secrets will tumble out of AAP closet" (in ఇంగ్లీష్). India Today. 5 September 2016. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Haryana BJP expels ex-Delhi Minister within 6 hours of joining party" (in ఇంగ్లీష్). India Today. 12 August 2024. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.