సందీప్ పాఠక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సందీప్ పాఠక్

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఏప్రిల్ 2022
నియోజకవర్గం పంజాబ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ

సందీప్ పాఠక్ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌, రాజకీయ నాయకుడు. ఆయన 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా పని చేసి పార్టీ విజయం కోసం పని చేశాడు. సందీప్ పాఠక్ ను 2022 మార్చి 21న గుజరాత్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా[1], ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[2][3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సందీప్ పాఠక్ 1979 అక్టోబర్ 4న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, ముంగేలి జిల్లా, లోర్మీలో జన్మించాడు. ఆయన బిలాస్పూర్ నుండి ఎంఎస్సీ పూర్తి చేసి, యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సందీప్ పాఠక్ పీహెచ్‌డీ పూర్తి చేసి స్వాదేశానికి తిరిగి వచ్చి ఐఐటీ ఢిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఆయన రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో ఎక్కువ కాలం ఉంటూ ఢిల్లీ ఎన్నికల్లో కూడా పని చేశాడు. సందీప్ పాఠక్ ఆ తరువాత అరవింద్ కేజ్రీవాల్‌కు సలహా ఇచ్చే బృందంలో భాగమయ్యాడు.

పాఠక్ పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల ముందు క్యాంపు వేసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలనే వ్యూహాన్ని రూపొందించి పార్టీ గెలుపులో కీలకంగా పని చేశాడు. సందీప్ పాఠక్ ను 2022 మార్చి 21న గుజరాత్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా[1], ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Eenadu (22 March 2022). "దేశవ్యాప్త విస్తరణకు ఆప్‌ సై.. 9 రాష్ట్రాలకు కొత్త ఆఫీస్‌ బేరర్ల నియామకం". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  2. Sakshi (21 March 2022). "కేజ్రీవాల్‌ 'కీ' స్టెప్‌.. రాజ‍్యసభకు హర‍్భజన్‌ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  3. TV9 Telugu (21 March 2022). "పంజాబ్‌ ఆప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఫిజిక్స్ ప్రొఫెసర్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కేజ్రీవాల్". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (21 March 2022). "రాజ్య‌స‌భ‌కు హ‌ర్భ‌జ‌న్‌, సందీప్‌, రాఘ‌వ్‌, సంజీవ్‌, అశోక్‌". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.