సందీప్ లామిఛానె
2018 లో సందీప్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | సందీప్ లామిఛానె | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 2000 ఆగస్ట్ 2 ఆరుచౌర్, సయాంగ్‌జా జిల్లా, నేపాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టులు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 6) | 2018 ఆగస్టు 1 నేపాల్ - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2024 నవంబరు 4 నేపాల్ - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 20) | 2018 మే 31 వరల్డ్ XI - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2024 అక్టోబరు 2 నేపాల్ - ఒమన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018–2020 | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018 | సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018 | నంగర్హర్ లెపార్డ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2018/19-2019/20 | మెల్బోర్న్ స్టార్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019 | సిల్హెట్ సిక్సర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019 | లాహోర్ ఖలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019 | బార్బడాస్ ట్రైడెంట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020 | జమైకా తల్లావాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020/21–2022 | హోబార్ట్ హరికేన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024–ప్రస్తుతం | బిరాట్‌నగర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2026 | రాజ్‌షాహీ వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2025 డిసెంబరు 31 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సందీప్ లామిచ్ఛానే (జననం 2000 ఆగస్టు 2) నేపాల్ అంతర్జాతీయ క్రికెటర్, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.[1][2][3][4][5]
కుడిచేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన లామిచానే ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ20 ఫ్రాంచైజీ జట్ల తరపున ఆడాడు.[6] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్, [7] బిగ్ బాష్ లీగ్ (BBL)లో హోబర్ట్ హరికేన్స్,[8] పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ ఖలందర్స్ వంటి జట్ల తరపున ఆడాడు.[9] 2019లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2025–26 సీజన్ కోసం రాజ్‌షాహి వారియర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[10] అతను వన్డేలు, ట్వంటీ20 అంతర్జాతీయ (T20Is)లో నేపాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలరు.[11][12]
లామిచానే వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ XI జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, తన తొలి టి20I ఆడాడు. ఓ సంయుక్త జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ టి20I రంగప్రవేశం చేసిన మొదటి క్రికెటరతడు.[13] 2018 ఆగస్టులో నెదర్లాండ్స్‌తో జరిగిన నేపాల్ తొలి వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లో ఆడిన పదకొండు మంది క్రికెటర్లలో లామిచానే ఒకడు. 2021 డిసెంబరులో నేపాల్ క్రికెట్ అసోసియేషన్, (CAN) జ్ఞానేంద్ర మల్లా స్థానంలో లామిచానేను నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది.[14]
జీవితం తొలినాళ్ళు
[మార్చు]లామిచానే చిత్వాన్ జిల్లాకు వెళ్లి చిత్వాన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ ప్రారంభించాడు, దీనిని మాజీ కెప్టెన్ రాజు ఖడ్కా నిర్వహించేవాడు.[15] కెప్టెన్ పరాస్ ఖడ్కా, నేపాల్ కోచ్ పుబుడు దాసనాయకే లు అక్కడికి వచ్చినపుడు, లామిచానేను నెట్స్‌లో బౌలింగ్ చేయమని అడిగారు. అతన్ని జాతీయ అండర్-19 శిక్షణా శిబిరానికి ఎంపిక చేసారు. లామిచానే 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని ప్రతిభను మొదట గుర్తించినది దాసనాయకే.[16]
లామిచానే ఒక గాయకుడు కూడా. తన పాటలు, మ్యూజిక్ వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాడు.[17] 2018 జూలైలో లామిచానే, ప్రతీక్ష్య - ది వెయిటింగ్ ఆల్బమ్ నుండి తన మొదటి పాట ఉదాష్ థియోను విడుదల చేశాడు.[18][19][20]
తొలినాళ్లలో కెరీర్
[మార్చు]లామిచానే 2015–17 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో 2016 ఏప్రిల్ 16న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్ ఎ క్రికెట్ లో అడుగుపెట్టాడు.[21] దానికి ముందు, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం నేపాల్ అండర్-19 జట్టులో ఎంపికయ్యాడు. [22] [23] ఐర్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండవ మ్యాచ్‌లో, అతను తన లెగ్-బ్రేక్ బౌలింగ్‌తో హ్యాట్రిక్ సాధించాడు.[24] అతని 5/27 గణాంకాలకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[24]
అతను టోర్నమెంట్‌ను 14 వికెట్లతో, 17.07 సగటుతో, 21.9 స్ట్రైక్ రేట్‌తో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముగించాడు.[25]
2016లో హాంకాంగ్ T20 బ్లిట్జ్ ప్రారంభ ఎడిషన్‌లో కౌలూన్ కాంటన్స్ ఫ్రాంచైజీ తరపున ఆడటానికి మాజీ హాంకాంగ్ క్రికెటర్ స్కాట్ మెక్‌కెక్నీ అతన్ని నియమించుకున్నాడు.[26] 2016 నవంబరులో నేపాల్‌లో జరిగిన MCC పర్యటనలో తన ప్రదర్శనతో స్కాట్‌ను ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో స్కాట్, రెండుసార్లు సందీప్ స్పిన్‌కు దొరికిపోయాడు. ఇది, 2016 హాంకాంగ్ బ్లిట్జ్ పోటీ కోసం లామిచానేను తీసుకునేందుకు స్కాట్ మెక్‌కెక్నీని ప్రేరేపించింది.[27][28] పర్యటనకు వచ్చిన మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలో లామిచానే ఏడు వికెట్లు పడగొట్టాడు.[29]
నిజానికి హాంకాంగ్ T20 బ్లిట్జ్, లామిచానేకి ఒక బ్రేక్అవుట్ టోర్నమెంట్‌గా మారింది. చివరికి అది అతని అద్భుతమైన ఎదుగుదలకు దారితీసింది. ఎందుకంటే అతను తన బౌలింగ్ ప్రదర్శనకు ప్రసిద్ధి చెందాడు. టోర్నమెంట్ సమయంలో ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను కూడా పంచుకున్నాడు.[30][31]
2016 సెప్టెంబరులో లామిచానేకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నుండి ఒక లేఖ వచ్చింది. సిడ్నీకి చెందిన వెస్ట్రన్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్‌లో ఆడటానికి అతన్ని ఆహ్వానించాడు.[32] 2017 ACC అండర్-19 ఆసియా కప్‌లో, అతను 5/8 బౌలింగ్ గణాంకాలను సాధించాడు. దాంతో, మలేషియా అండర్-19 జట్టు స్కోరు 45కి పరిమితమైంది. స్స్ందీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[33] అతను బాగ్మతి ప్రావిన్స్ తరపున ఆడతాడు.
రికార్డులు, మైలురాళ్ళు
[మార్చు]- ఇన్నింగ్స్ పరంగా 100 వన్డే వికెట్లకు అత్యంత వేగంగా - 42 మ్యాచ్‌లు. [34]
- ఇన్నింగ్స్ పరంగా 50 వన్డే వికెట్లు తీసిన రెండవ వేగవంతమైన బౌలర్ - 22. [35]
- 100 వికెట్లు తీసిన రెండవ వేగవంతమైన బౌలర్ [36]
గౌరవాలు
[మార్చు]- NNIPA ఏటి ఉత్తమ యువ క్రీడాకారుడు: 2017 [37]
- NCCS-CPAN క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: 2018 [38]
- ICC పురుషుల ఆటగాడి నెల - 2021 సెప్టెంబరు[39]
వివాదం
[మార్చు]సందీప్ తనపై అత్యాచారం చేశాడని 2022 సెప్టెంబరులో 18 ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.[4] 2024 జనవరిలో, ఈ కేసులో ఖాట్మండు కోర్టు అతనికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. [4] ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయడంతో, 2024 మేలో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు [40]
మూలాలు
[మార్చు]- ↑ "Captains share their thoughts ahead of the ICC Men's T20 World Cup Qualifier A". International Cricket Council. Retrieved 17 February 2022.
- ↑ "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
- ↑ "Sandeep Lamichhane suspended from Nepal's National Cricket Team". My Republica (in ఇంగ్లీష్). Retrieved 6 October 2022.
- ↑ 4.0 4.1 4.2 "Sandeep Lamichhane sentenced to eight years in jail for rape". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 29 March 2024.
- ↑ "Sandeep Lamichhane arrested in Kathmandu, Nepal cricket body suspends former captain after conviction in rape case". Hindustan Times (in ఇంగ్లీష్). 11 January 2024. Retrieved 29 March 2024.
"We inform you that Sandeep Lamichhane has been suspended from any kind of domestic and international cricket activities as he has been convicted and sentenced," the CAN said.
- ↑ "Captains share their thoughts ahead of the ICC Men's T20 World Cup Qualifier A". International Cricket Council. Retrieved 17 February 2022.
- ↑ "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
- ↑ "Sandeep Lamichhane suspended from Nepal's National Cricket Team". My Republica (in ఇంగ్లీష్). Retrieved 6 October 2022.
- ↑ "Sandeep Lamichhane arrested in Kathmandu, Nepal cricket body suspends former captain after conviction in rape case". Hindustan Times (in ఇంగ్లీష్). 11 January 2024. Retrieved 29 March 2024.
"We inform you that Sandeep Lamichhane has been suspended from any kind of domestic and international cricket activities as he has been convicted and sentenced," the CAN said.
- ↑ "Captains share their thoughts ahead of the ICC Men's T20 World Cup Qualifier A". International Cricket Council. Retrieved 17 February 2022.
- ↑ "Emerging Players to Watch Under 21: Part 1". Emerging Cricket. 16 April 2020. Retrieved 17 April 2020.
- ↑ "Nepal Cricket Team Records & Stats | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2 August 2022.

- ↑ 24.0 24.1 "13th Match, Group D, ICC Under-19 World Cup at Fatullah, Jan 30 2016 - Match Summary". ESPNcricinfo. Archived from the original on 24 March 2018. Retrieved 9 February 2018.

- ↑ "Lamichhane and Knight voted ICC Players of the Month for September". International Cricket Council. Retrieved 2 November 2021.