సంధి
Appearance
వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు. పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడు రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది. [1]
వర్ణాల మార్పు
[మార్చు]వర్ణ లోపము
[మార్చు]ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగును సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమంటారు.
రాజు + అతడు = రాజతడు (జులో ఉకారం లోపించినది.)
వర్ణాగమము
[మార్చు]ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణం కల్గడాన్ని వర్ణాగమము అంటారు.
ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు (ఇందు 'త' లోపించి య వచ్చినది. దీనిని యడాగమము అంటారు.)
వర్ణాదేశము
[మార్చు]ఒక వర్ణమునకు బదులు ఇంకొక వర్ణము వచ్చిచేరుట.
కృష్ణుడు + పోయెను = కృష్ణుడు వోయెను. (పకార స్థానమున వకారము వచ్చినది)
భాష ప్రకారం సంధులు
[మార్చు]- తెలుగు సంధులు
మూలాలు
[మార్చు]- ↑ షేక్ అలీ (1998). లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము. నవరత్న బుక్ సెంటర్.