సంధ్యారాణి (నటి)
Appearance
సంధ్యారాణి | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1965–1974 |
సంధ్యారాణి 1960 - 70 దశకాలలో తెలుగు చిత్రాలలో నటించిన సినిమానటి.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె బెజవాడ వాస్తవ్యురాలు. [1] తను చిన్నతనంలో కొత్తసినిమా వచ్చినప్పుడల్లా ఆమె అందులో బాగా నచ్చిన వేషాన్ని ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఎదుట ప్రదర్శించేది. అందరూ మెచ్చుకునేవారు. ఆమె 1965లో తేనె మనసులు చిత్రంలో చిత్రసీమలోకి ప్రవేశించింది. ఈ చిత్రంతో బాబూ మూవీస్ డైరెక్టర్ , టెక్నీషియన్ల ద్వారా శిక్షణ పొందింది. వారు ఆమె నటనలోని లోపాలను తెలియజేసి నటనలో శిక్షణనిచ్చారు. ఈ సినిమాలో "సీత" పాత్ర ద్వారా తెలుగు సినిమాలో అందరికీ సుపరిచితురాలైంది.[2] ఈ చిత్రంలో కథానాయకుడు ఘట్టమనేని కృష్ణ. అతనికి కూడా ఇది తొలి చిత్రం. ఈ సినిమా విజయవంతమైంది.[3]
సినిమాల జాబితా
[మార్చు]ఈమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు:
- తేనె మనసులు (1965)[4]
- కన్నె మనసులు (1966 సినిమా)
- ఇద్దరు మొనగాళ్లు (1967)
- మరపురాని కథ (1967)
- శ్రీకృష్ణావతారం (1967)
- సుడిగుండాలు (1967)
- నేనంటే నేనే (1968)
- వింత కాపురం (1968)
- ప్రతీకారం (1969)
- పగ సాధిస్తా (1970)
- బస్తీ కిలాడీలు (1970)
- ప్రేమజీవులు (1971)
- బస్తీ బుల్బుల్ (1971)
- శ్రీకృష్ణ విజయం (1971)
- శ్రీకృష్ణసత్య (1971)[5]
- మొహమ్మద్ బీన్ తుగ్లక్ (1972)
- మేమూ మనుషులమే (1973)
- స్త్రీ గౌరవం (1974)
మూలాలు
[మార్చు]- ↑ "50 ఏళ్ల తేనెమనసులు". Sakshi. 2015-03-29. Retrieved 2020-07-26.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-07-26.
- ↑ "కృష్ణ తొలి చిత్రానికి 55 ఏళ్లు.. మహేశ్ కామెంట్". www.eenadu.net. Retrieved 2020-07-26.
- ↑ ఐ.ఎం.డి.బి.లో తేనెమనసులు
- ↑ Vadlmudi, Raghu (2015-03-30). "50 Years For Super Star Krishna Thene Manasulu Movie". TeluguStop.com. Retrieved 2020-07-26.
బయటిలింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంధ్యారాణి పేజీ