సంపంగి నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంపంగి నూనె ఒక ఆవశ్యక నూనె (సుగంధ తైలం). సంపంగి నూనెను ఎక్కువ సుపరిమళం కల్గివున్నందున, ఈ తైలాన్ని సుగంధనూనెగా/సుగంధ ద్రవ్యం/పెర్ఫ్యూమ్ గా ఉపయోగిస్తారు.అంతే కాకుండా సంపంగి తైలాన్ని దేశీయ, ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా సంపంగి పూలనుండి సంపంగి తైలాన్ని ఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు.సంపెంగ ఆకుల నుండి కూడా తైలాన్ని తీస్తారు. సంపంగి చెట్టు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో విరివిగా పెరుగును.సంపంగి మూలస్తావరం దక్షిణ, తూర్పు ఆసియా.భారతదేశంలో, ఉష్ణ ఆసియాలో సంపంగిని పవిత్రమైనదిగా భావిస్తారు.భారతదేశంలో సంపంగి పూలను దైవారాధనకు, మహిళలు సిగలో అలంకరణగా ధరించుటకు ఉపయోగిస్తారు.సంపంగిని సంస్కృతంలో చంపీక అంటారు సింహళ భాషలో సపు అంటారు.

సంపంగి చెట్టు[మార్చు]

సంపంగి మాగ్నో లియేసియే కుటుంబానికి చెందిన చెట్టు.[1] సంపంగిలో పలురకాలు ఉన్నాయి.ముఖ్యంగా బంగారపు పసుపు పూలుకల్గిన, తెల్లని పూలను పూచే రకాలు.సంపంగి చెట్టు వృక్షశాస్త్ర పేరు మైకెలియా అల్బా, మైకెలియా చంపక. సంపంగిచెట్టు సతతహరితం.చెట్టు 65 అడుగుల ఎత్తు వరకు పెరుగును.విస్తారమైన పక్కకొమ్మలను కల్గివుండును. పొడవైన నునుపు ఉపరితలం కల్గిన పత్రాలు వుండును.పూలు సువాసన భరితంగా చిన్నవిగా వుండును.[2] సంపంగి పూలు రాత్రి సమయంలో ఎక్కువ సువాసన వెదజల్లడం వలన పూలను రాత్రి సమయంలో స్ర్తీలు సిగలో ధరిస్తారు.

సంపంగి చెట్టు

సంపంగి నూనె[మార్చు]

తియ్యని సుపరిమళాన్ని కల్గి వుండును. నూనె ఎరుపు బ్రౌన్ రంగులో పారదర్శకంగా వుండును. నూనెలో ఆల్కహాల్, అల్డిహైడులు వుండును. తైలంలో 62% లినలూల్ వుండును.సంపంగి నూనెలోని కొన్ని ముఖ్యమైన రసాయనాలు బీటా ఏలేమేన్, బీటా-కారియూ పిల్లేన్, మిథైల్ యూజనోల్.[2][3] పసుపు పూల నూనె ఎక్కువగా ఐసో యూజెనోల్, బెంజోయిక్ ఆమ్లం, బెంజైల్ఆల్కహాల్, బెంజాల్దిహైడ్, సినేఓల్,, p –క్రెసోల్ మిథైల్ ఈథరులను కలిగి వుండును.

  • పసుపు రంగు పూలనుండి తీసిన నూనె భౌతిక గుణాలు[4]
వరుస సంఖ్య గుణం విలువమితి
1 సంపంగి నూనె విశిష్ట గురుత్వం 30°/30 °C 0.904—0.9107
2 వక్రీభవన సూచిక30°C, వ ద్ద 1.4640—1.4688
3 ఈస్టరు విలువ 124—146
4 ఆసీటైలేసన్ తరువాత
ఈస్టరు విలువ
199

పసుపు పూల నూనెను వాక్యూమ్ (పీడన రహిత స్థితి) లోడీస్టిల్ చేసినపాలిమేరైసెస్ చెందును.

  • తెల్ల సంపంగి పూల (Michelia longifolia Bl.) నుండి తీసిన నూనె యొక్క భౌతిక గుణాలు.[4]
వరుస సంఖ్య గుణం విలువమితి
1 సంపంగి నూనె విశిష్ట గురుత్వం 0.897
2 వక్రీభవన సూచిక30°C, వ ద్ద 1.4640—1.4688
3 ఈస్టరు విలువ 180.0

నూనె ఉపయోగాలు[మార్చు]

  • సంపంగి నూనెనుగులాబీ నూనె, జాస్మిన్ ఆయిల్ (మల్లె నూనె), చందన నూనె, నేరోలి నూనె వంటి సుగంధ నూనెలలో మిశ్రమం చేస్తారు.అలాగే సిట్రస్ నూనెలలో కూడా సంపంగి నూనెను కలుపుతారు.[1]

నూనెను వాడునపుడు జాగ్రత్తలు[మార్చు]

  • సంపంగి విషగుణరహిత తైలం.అలాగే నాన్ ఇరిటేసన్ (ప్రేరక రహిత) గుణం వున్న తైలం.అయితే కళ్ళల్లో పడకుండా జాగ్రత్త వహించాలి, అలాగే చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచడం మంచిది.తైలాన్నివేడి, వెలుతురు లేని చోట ఉంచాలి.[1]
  • సంగంధ తైలాలను ఎప్పుడు కూడా వైద్యుల ప్రత్యక్ష సలహా లేకుండా కడుపులోకి తీసుకోరాదు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Champaca oil - Pure esssential oil Champak". ayurveda-healing.com. Archived from the original on 2017-01-11. Retrieved 2018-08-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Champaca Essential Oil". gritman.com. Archived from the original on 2018-08-22. Retrieved 2018-08-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "CHAMPACA OIL". indiaessentialoils.com. Archived from the original on 2018-02-11. Retrieved 2018-08-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 "Michelia champaca, Linn". wisdomlib.org. Archived from the original on 2018-08-22. Retrieved 2018-08-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)