Jump to content

సంపాదకుడు

వికీపీడియా నుండి

సంపాదకుడు అనగా దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక పత్రికలు, పుస్తకం, వెబ్‌సైట్ మొదలైన వాటిలోని వార్తల ముద్రణ, ఎంపిక, నిర్వహణలో ప్రధాన బాధ్యత వహించే వ్యక్తి. వీరిని ఆగ్లములో ఎడిటర్ అంటారు. సంపాదకీయం రాయడం ఈయన ముఖ్యమైన పని. సంపాదకీయాలు ముఖ్యంగా జాతీయంగాను, అంతర్జాతీయంగాను జరిగే సంఘటనలపై రాయబడతాయి. ప్రపంచాన్ని గూర్చి సరిఅయిన దృక్పదం, సర్వతోముఖ పరిజ్ఞానం గల రచయితే నిజమైన సంపాదకుడు కాగలడు.. సంపాదకీయాలు ఆ పత్రిక యొక్క పాలసీలు తెలియజేస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎడిటర్లలో సంపాదకీయాలను రాయని వారు కూడా కొందరున్నారు.

పేరొందిన సంపాదకులు

[మార్చు]

తెలుగులో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలకు సంపాదకుడిగా చిరకాలం పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, చక్రవర్తుల రాఘవాచారి తదితరులు.

మూలాలు

[మార్చు]
  • విశ్వవిజ్ఞాన దర్శిని,(1984) రచయిత నరేంద్రదేవ్, ఫోనిక్స్ పబ్లికేషన్స్ పుస్తకం నుండి.

వెలుపలి లంకెలు

[మార్చు]