సఃకుటుంబానాం
| సఃకుటుంబానాం | |
|---|---|
సఃకుటుంబానాం పోస్టర్ | |
| దర్శకత్వం | ఉదయ్ శర్మ |
| స్క్రీన్ ప్లే | ఉదయ్ శర్మ |
| కథ | ఉదయ్ శర్మ |
| నిర్మాత |
|
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | రోహిత్ కుమార్ పద్మనాభ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | మధు దాసరి |
| కూర్పు | శశాంక్ మాలి |
| సంగీతం | మణిశర్మ |
| ఆర్ట్ డైరెక్టర్ | పీఎస్ వర్మ |
| ఫైట్స్ | అంజి - కార్తీక్ |
నిర్మాణ సంస్థ | హెచ్.ఎన్.జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీ | 2026 జనవరి 1 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సఃకుటుంబానాం 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. హెచ్.ఎన్.జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై హెచ్. మహదేవ్‌గౌడ్, హెచ్. నగరత్న నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ శర్మ దర్శకత్వం వహించాడు. రామ్ కిరణ్, మేఘా ఆకాష్, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 21న,[1] ట్రైలర్‌ను నవంబర్ 29న విడుదల చేసి,[2] సినిమాను 2026 జనవరి 1న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- రామ్ కిరణ్
- మేఘా ఆకాష్
- రాజేంద్ర ప్రసాద్
- బ్రహ్మానందం
- శుభలేఖ సుధాకర్
- సత్య
- రాజశ్రీ నాయర్
- రచ్చ రవి
- గిరిధర్
- తాగుబోతు రమేశ్
- భద్రం
- నిత్య శ్రీ
కథ
[మార్చు]సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (రామ్ కిరణ్) తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతనిది ప్రశాంతమైన జీవితం.. మంచి జీతం. అయితే ఒక అమ్మాయి తన టీమ్‌లో చేరడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అలా ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బయటపడే రహస్యాలు.. అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఏంటి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అసలు అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. [5]
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "స:కుటుంబానాం[6]" | అనంత శ్రీరామ్ | ఎస్. పి. చరణ్, శృతిక సముద్రాల | 5:17 |
| 2. | "డ్రీమ్" | ఉమా వంగూరి | వైష్ణవి కొవ్వూరి | 3:09 |
| 3. | "ఫేక్ సేల్స్" | అనంత శ్రీరామ్ | రామ్ మిరియాల | 3:19 |
| 4. | "అధి ధా సారు" | అనంత శ్రీరామ్ | ధనుంజయ్ సీపాన | 4:35 |
మూలాలు
[మార్చు]- ↑ "ఆసక్తిరంగా "స:కుటుంబానాం" టీజర్". Sakshi. 21 June 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.
- ↑ "హీరోకు.. ఎమోషన్స్ లేని డిజార్డర్ ఉంటే! కొత్త కాన్సెప్ట్.. తెస్తున్నారుగా". Chitrajyothy. 30 November 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.
- ↑ "కుటుంబ విలువలు తెలిపే సినిమా". NT News. 1 December 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.
- ↑ "కొత్త ఏడాదిలో పలకరించే మొదటి సినిమాలివే". Eenadu. 29 December 2026. Archived from the original on 2 January 2026. Retrieved 2 January 2026.
- ↑ "సఃకుటుంబానాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Sahakutumbaanaam Movie Review And Rating In Telugu, A Complete Family Drama For The New Year | Sakshi". www.sakshi.com. Retrieved 2026-01-11.
- ↑ "'స:కుటుంబానాం' మూవీ టైటిల్ సాంగ్". Chitrajyothy. 14 January 2025. Archived from the original on 6 December 2025. Retrieved 6 December 2025.