Jump to content

సచీంద్ర చౌదురి

వికీపీడియా నుండి
నెదర్లాండ్స్‌లోని భారత రాయబారి రాజ్‌కుమార్ రఘునాథ్ సిన్హాతో మాట్లాడుతున్న చౌదురి (ఎడమ వైపు), 1966.

సచీంద్ర చౌదురి (24 ఫిబ్రవరి 1903[1] – 12 జూన్ 1992) భారతీయ న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ హయాంలో 1965 నుండి 1967 మార్చి 13 వరకు భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే పలు కంపెనీలకు డైరెక్టరుగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు సభ్యునిగా, లా కమిషన్ సభ్యునిగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి వెళ్ళిన భారత ప్రతినిధి బృందంలో సభ్యునిగా వ్యవహరించారు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సచీంద్ర చౌదురి ఘటాల్ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు.[citation needed] ఈయన భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన హయాంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా భారత ఆర్థిక వ్యవస్థ 2 సంవత్సరాల పాటు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. వాస్తవ జీడీపీ వృద్ధి 1965లో 3%, 1966లో 1% పడిపోయింది. పర్యవసానంగా రూపాయి విలువను మొదటిసారిగా తగ్గించారు .[citation needed]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సచీంద్ర చౌదురి 1903 ఫిబ్రవరి 24న కలకత్తాలో జన్మించారు. తండ్రి ప్రభోద్ చంద్ర చౌదురి. ఈయన కలకత్తాలోని రాణి భవాని పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తరువాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల, ఆపై కేంబ్రిడ్జ్ లోని ఫిట్జ్‌విలియం కళాశాలలో చదువుకున్నారు. లింకన్స్ ఇన్ లో కూడా ఉన్నారు. ఈయన 1930 డిసెంబరు 11న సీతా మిట్టర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

వీరి కుటుంబం వాస్తవానికి పశ్చిమ బెంగాల్, హుగ్లీలోని బక్షా అనే ప్రాంతంలో (సమీప రైల్వే స్టేషన్ జనై రోడ్) "బక్షా చౌదురి బాటి" అని పిలువబడే ప్రఖ్యాత జమీందారీ ఇంటికి చెందినది. "బక్షా చౌదురి బాటి" డోల్ ఉత్సవ్ (రంగుల పండుగ), 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దుర్గాపూజకు ప్రసిద్ధి చెందింది.[citation needed]

సుదీర్ఘ అనారోగ్యం తర్వాత ఈయన 1992 జూన్ 12న మరణించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Profile on Lok Sabha website". loksabha.nic.in. లోక్‌సభ/నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, న్యూఢిల్లీ. Retrieved 31 May 2013.
  2. "Fourth Session of the Tenth Lok Sabha" (PDF). Lok Sabha Debates. 13 (1): 3–4. 8 July 1992. Retrieved 19 June 2021.