సచ్చిదానంద రౌత్రాయ్
సచ్చిదానంద రౌత్రాయ్ | |
|---|---|
| జననం | 1916 మే 13 గురుజంగ్, ఖొద్రా |
| మరణం | 2004 ఆగస్టు 21 (వయసు: 88) కటక్ |
| కలం పేరు | సచీ రౌతర |
| సాహిత్య ప్రక్రియ | కవిత్వం |
| ప్రసిద్ధ రచనలుs | పల్లిశ్రీ |
| ప్రసిద్ధ పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం |
సచ్చిదానంద రౌత్రాయ్ (1916–2004) ఒరియా భాషకు చెందిన కవి, నవలా రచయిత, లఘు కథా రచయిత. ఈయనకు 1986 లో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన "సాచీ రౌత్రాయ్"గా సుపరిచితులు.[1]
జీవితం
రౌత్రాయ్ మే 13, 1916 న ఖుర్దాకు దగ్గరలో గల గురుజంగ్లో జన్మించారు.[2] ఈయన బెంగాల్ లో విద్యాభ్యాసం చేశారు. ఈయన గొల్లపల్లిలో రాజకుటుంబానికి చెందిన రాకుమారిని వివాహమాడారు.[1]
రౌత్రాయ్ తన 11 యేండ్ల వయసు నుంచే రచనా ప్రస్థానాన్ని ప్రారంభ్హించారు.[1] పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ భావాలు ఉన్నాయన్న కారణంగా ఆయన రచనలలో కొన్నింటిని బ్రిటిష్ రాజులు నిషేధించారు.
సాహితీ సేవ
రౌత్రాయ్ తన రచనా వ్యాసాంగాన్ని 1932లో " పథేయ " (తొలి కవిత) తో ప్రారంభించాడు. 1943లో బాజీ రౌత్ అనే కవిత ప్రచురణతో రౌత్రాయ్ ఒరియా పాఠకులలో చాలా ప్రాచుర్యం పొందాడు. ఈ దీర్ఘ కవిత, బ్రిటీషు పోలీసులను తన్న చిన్న పడవలో బ్రాహ్మణి నది ఆవలి ఒడ్డుకు చేర్చటానికి నిరాకరించినందుకు, వారి బుల్లెట్లకు బలైన పడవనడిపే అబ్బాయి యొక్క వీరమరణాన్ని కీర్తిస్తుంది. రౌత్రాయ్ కవితా ఝరి అనర్గళంగా సాగింది. ఈయన దాదాపు ఇరవై దాకా కవితా సంపుటాలను ప్రచురించాడు. ఈయన పట్టణపు యువతి యొక్క వేదనను, కష్టాలను చిత్రిస్తూ వ్రాసిన ప్రతిమా నాయక్ ఎంత ప్రాచుర్యం పొందిందో, ఒరిస్సా గ్రామీణ జీవితంపై వ్రాసిన పల్లిశ్రీ', కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ఈయన ప్రజా కవులుగా పేరుపొందిన రచయితల కోవకు చెందుతాడు[1]
రౌత్రాయ్ మతసంబంధమైన విషయాలపై కూడా కొన్ని కవితలు ప్రచురించాడు.
అవార్డులు - గుర్తింపులు
- 1962 : పద్మశ్రీ [1]
- 1963 : సాహిత్య అకాడమీ అవార్డు - "కవితా 1962"కు వచ్చింది.[3]
- 1965 : సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు [1]
- 1986 : జ్ఞానపీఠ్ అవార్డు [4]
- 1988 : లైఫ్ టైం ఫెలోషిప్ (కేంద్రసాహిత్య అకాడమీ)
- 1986 : "మహాకబి" సమాన్ - రూర్కెలా,
- 1988 : కటక్ ప్రెసిడెంట్ - నిఖిల్ భరత్ కబితా సమ్మేళన్
- 1997 : సాహిత్య భారతి అవార్డు.
ఇవికూడా చూడండి
మూలాలు
- 1 2 3 4 5 6 7 "Sachidananda Routray passes away". The Hindu. 2004-08-22. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-11-06.
- ↑ "SACHI ROUTRAY". orissadiary.com. 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 May 2012.
Sachi Routray was born in Gurujang near Khurda on May 13, 1916.
- ↑ "Sahitya Akademi Awards 1955-2007 (Oriya)". Sahity Akademi. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-11-06. [dead link]
- ↑ "Jnanpith Laureates". Bharatiya Jnanpith. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-11-06.
బయటి లంకెలు
- Articles with dead external links from October 2010
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1916 జననాలు
- 2004 మరణాలు
- ఒడిషా ప్రజలు
- భారతీయ రచయితలు
- ఒరియా కవులు
- ఒరియా రచయితలు
- సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీతలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- ఒరియా సాహిత్యవేత్తలు