సజ్జల రామకృష్ణా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణా రెడ్డి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 16 జూన్ 1958
ముసాల్ రెడ్డిపల్లి, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సజ్జల సుబ్బారెడ్డి, పార్వతమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం భార్గవ

సజ్జల రామకృష్ణా రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) పని చేస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సజ్జల రామకృష్ణారెడ్డి 16 జూన్ 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, ముసాల్ రెడ్డిపల్లి గ్రామంలో సజ్జల సుబ్బారెడ్డి, పర్వతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కడప జిల్లా పులివెందులలో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన అనంతరం కడప ప్రభుత్వ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

సజ్జల రామకృష్ణారెడ్డి డిగ్రీ పూర్తి చేసిన తరువాతఈనాడు పత్రికలో గ్రామస్థాయిలో వార్తలు అందించే కంట్రిబ్యూటర్‌గా చేరి, ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం మీద శిక్షణ పొంది డిప్లొమా అందుకొని 1978లో ఈనాడులో జూనియర్ సబ్ ఎడిటర్‌గా చేరి ఆ తర్వాత ఆంధ్రభూమి పత్రికకు సబ్ ఎడిటర్‌గా, 1985లో ఉదయంలో చీఫ్ సబ్ ఎడిటర్‌గా పని చేశాడు. ఆయన ఉదయం పత్రిక మూతపడిన తర్వాత గ్రానైట్ వ్యాపారం చేశాడు. సజ్జల రామకృష్ణా రెడ్డి 2014లో స్థాపించిన సాక్షి మీడియాలో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా, పబ్లిషర్‌గా నియమితుడయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాజకీయ సలహాదారుగా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆయన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితుడై, 28 జూన్ 2019న భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2 June 2021). "ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  2. The New Indian Express (28 June 2019). "Sajjala Ramakrishna takes charge as advisor to Andhra Pradesh government". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.