సతీష్ పాల్ రాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సతీష్ ‌పాల్‌రాజ్ భారత రాజకీయ నాయకులు, విద్యావేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు జిల్లా తెనాలి మండలం చావలి లో 1943లో పున్నయ్య,[1] సీతారావమ్మకు జన్మించాడు. అసలు పేరు మల్లికార్జునరావు. 1963లో క్రైస్తవమతం స్వీకరించాడు. సతీశ్‌పాల్‌రాజ్‌గా పేరు మార్చుకుని 1972లో భద్రాచలం వచ్చి గుడ్‌ సమారిటిన్ ఇవాంజిలికల్ లూథరన్ చర్చిని స్థాపించాడు. పలు చోట్ల వీటి శాఖలను ఏర్పాటు చేశాడు. 1992లో సెయింట్‌ పాల్స్ పాఠశాలను,[2] 2000లో కళాశాలను, 1997లో డా. పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కళాశాలను నెలకొల్పాడు[3][4] మన్యంలో తొలిసారిగా సాంకేతిక విద్యను అందించిన విద్యావేత్తగా గుర్తింపు పొందాడు. 2004లో గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు.[5] 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వేమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిగా అతను తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌పై 8721 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. సతీష్ పాల్ రాజ్‌ కు 52756 ఓట్లు రాగా, రాజేంద్రప్రసాద్‌కు 44035 ఓట్లు లభించాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతనికి కొడుకు, కూతురు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "అఫిడవిట్". affidavitarchive.nic.in. Retrieved 2020-06-06.
  2. "The Bridge Church's primary International mission is in India". www.bridgechurchhayling.co.uk. Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
  3. "DPREC - Dr Paul Raj Engineering College | Youth4work". youth4work.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-06.
  4. "Welcome to Paul Raj Engineering College". www.dprec.ac.in. Retrieved 2020-06-06.
  5. "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-06-06.