సతీష్ మహానా
స్వరూపం
సతీష్ మహానా (జననం 14 అక్టోబర్ 1960) భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, మంత్రిగా పని చేసి 2022 మార్చి 29 ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పని చేస్తున్నాడు.[1][2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సతీష్ మహానా 1960 అక్టోబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించాడు. ఆయన కాన్పూర్‌లోని సెయింట్ జోసెఫ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ప్రారంభ విద్యను, కాన్పూర్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
సతీష్ మహానా 1981లో అనితా మహానాను వివాహం చేసుకున్నాడు, వారికి ఒక కుమారుడు కరణ్ మహానా, ఒక కుమార్తె నేహా మహానా ఉన్నారు.
నిర్వహించిన పదవులు
[మార్చు]| క్రమ సంఖ్యా | నుండి | కు | పదవి | మూ |
|---|---|---|---|---|
| 01 | మార్చి 2022 | ప్రస్తుతం | శాసనసభ స్పీకర్ | |
| 02 | మార్చి 2022 | ప్రస్తుతం | 18వ శాసనసభ సభ్యుడు | |
| 03 | మార్చి 2017 | మార్చి 2022 | పారిశ్రామిక అభివృద్ధి కేబినెట్ మంత్రి | తొలి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం |
| 04 | మార్చి 2017 | మార్చి 2022 | 17వ శాసనసభ సభ్యుడు | |
| 05 | మార్చి 2012 | మార్చి 2017 | 16వ శాసనసభ సభ్యుడు | |
| 06 | మే 2007 | మార్చి 2012 | 15వ శాసనసభ సభ్యుడు | |
| 07 | ఫిబ్రవరి 2002 | మే 2007 | 14వ శాసనసభ సభ్యుడు | |
| 08 | అక్టోబర్ 1997 | మార్చి 2002 | గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి | |
| 09 | 1996 | 2002 | 13వ శాసనసభ సభ్యుడు | |
| 10 | 1993 | 1995 | 12వ శాసనసభ సభ్యుడు | |
| 11 | 1991 | 1992 | 11వ శాసనసభ సభ్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ "Eight-time BJP MLA Mahana elected UP Assembly Speaker unanimously" (in ఇంగ్లీష్). The Indian Express. 30 March 2022. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.
- ↑ "Eight-time MLA Satish Mahana is new Speaker of UP Assembly". ThePrint. 29 March 2022. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.
- ↑ "Eight-term MLA Satish Mahana is Uttar Pradesh assembly's new speaker". The Times of India. 29 March 2022. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.