Jump to content

సత్యగోపాల్ మిశ్రా

వికీపీడియా నుండి
సత్యగోపాల్ మిశ్రా

పదవీ కాలం
1980–1996
ముందు సుశీల్ కుమార్ ధారా
తరువాత జయంత భట్టాచార్య
నియోజకవర్గం తమ్లుక్

వ్యక్తిగత వివరాలు

జననం (1939-08-12)1939 ఆగస్టు 12
కళ్యాణ్‌చక్, మిడ్నాపూర్ , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2013 మే 24(2013-05-24) (వయసు: 73)
రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ , కోల్కతా , పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె

సత్యగోపాల్ మిశ్రా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్యగోపాల్ మిశ్రా భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1980 లోక్‌సభ ఎన్నికలలో తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శ్యామ్ దాస్ భట్టాచార్యపై 123051 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1984 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సారదిందు సమంతపై 11692 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

సత్యగోపాల్ మిశ్రా 1989 లోక్‌సభ ఎన్నికలలో తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జోయంత భట్టాచార్యపై 24656 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 1991 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జోయంత భట్టాచార్యపై 1062 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Tamluk Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 21 July 2025. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  2. "Tamluk Lok Sabha Election West_Bengal". Hindustan Times. 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
  3. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  4. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  5. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  6. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.