సత్యనారాయణపురం (విజయవాడ)

వికీపీడియా నుండి
(సత్యనారాయణపురం(విజయవాడ) నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సత్యనారాయణపురం, విజయవాడ నగరంలోని పెద్ద పేటలలో ఒకటి. ఈ పేటకు పడమరమరన ఏలూరు కాలవ, ఉత్తరాన ముత్యాలంపాడు,విజయవాడ, తూర్పున సత్యనారాయణపురం రైల్వే నివాసాలు మరియు దక్షిణాన బావాజీ పేట, గాంధినగరం ఉన్నాయి. ఇది పూర్తిగా నివాస ప్రధానమయిన పేట. వ్యాపార వ్యవహారములు, దుకాణములు ఎక్కువగా నాగెశ్వరరావు పంతులు రొడ్డునందు ఉన్నాయి.

ఆలయాలు[మార్చు]

ఇక్కడ శివాలయం, రామాలయము ఉన్నాయి. ఇందులో శివాలయము పురాతనమయినది. రామాలయం 1960లలో కళ్ళెపల్లి కృష్ణంరాజుగారు కట్టించారు. ఆయనకు ఒక రైసు మిల్లు ఉండేది.ఇక్కడ ఉండు రామాలయం చాలా పురాతనం అయినది.

ముఖ్య కూడళ్ళు[మార్చు]

శివాజీ కేఫ్, బాబూరావు మేడ, కుక్కల మేడ, రాజన్ కిళ్ళీ షాపు మొదలగునవి. పూర్వపు కెంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీరు శ్రీ కె ఏల్ రావుగారికి ఇక్కడ ఒక చక్కటి నివాస భవనము ఉంది. ప్రస్తుతము అందులో టెలిఫొను ఎక్సెంజి ఉంది.

విద్యా సదుపాయములు[మార్చు]

ఇక్కడ మునిసిపాలిటీ వారి ఏ.కె.టి.పి.ఉన్నత పాఠశాల (అంధ్రకెసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల)ఉన్నది. ఇందులో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. ఈ స్కూలును ఒకప్పుడు టి.వి.ఏస్ చలపతిరావు ఉన్నత పాఠశాల అని పిలిచేవారట. ఇది కాక, శ్రీ విజ్ఞాన విహార్ అను స్కూలుకూడా ఉంది. ఇవి కాక అనేక చిన్న చితక బళ్ళు, పాఠశాలలు చాలా ఉన్నాయి.ప్రాథమిక విద్యకొరకు ఇక్కడి పిల్లలు పేట బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు.

బాంకులు[మార్చు]

ఇక్కడ అన్ని ప్రముఖ బాంకు శాఖలు ఉన్నాయి. బాంకు శాఖలన్నీ కూడా దాదాపు ఒకే వీధిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న బాంకు శాఖలు స్టేట్ బాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బాంకు, ఆంధ్రా బాంకు, కార్పొరేషన్ బాంకు, ఇంగ్ వైశ్యా బాంకు మరియు లక్ష్మి బాంకు వంటీ కూడా చాలా ఉన్నాయి.

ప్రముఖ స్థలాలు[మార్చు]

  1. బాబురావు మేడ (BABURAO BUILDING) (ఈ పేటలోని మొట్ట మొదటి ఏత్తయిన భవనము.ఇప్పటికి కూడా ఎత్తయిన భవనములలో ఒకటి, ఆపార్ట్ మెంటు కాని ఏకైక ఎత్తయిన భవనము. --
  2. కె.ఏల్.రావు మేడ (K L RAO BUILDING) (ప్రముఖ ఇంజనీరు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కె.ఎల్ రావుగారి స్వగృహం --
  3. కుక్కల మేడ (ఈ భవనపు మొదటి సొంతదారులు చాలా కుక్కలు పెంచెవారట, అందుకని ఆ భవనమునకు ఆ పేరు వచ్చినది)ప్రస్తుతము, ఈ భవనము విశ్వ హిందూ పరిషత్ వారి అధీనములో ఉంది. ఆ భవనమును కూలదోసి బహుళ అంతస్తుల భవనమును కట్టినారు.

సిటీ బస్సులు[మార్చు]

3, 20 నంబరు గలిగిన బస్సులు సత్యనారాయణపురం నుండి బయలుదేరి విజయవాడలోని వివిధ ప్రాంతములకు వెళతాయి. మరియు బెంజి సర్కిల్ నుంచి పసువుల ఆసుపత్రికి వెల్లాలి అంటె ఎటువంటీ బస్సులయిన వెల్లును

ఇతర వివరాలు[మార్చు]

  1. ఇక్కడ చాలాకాలమునుండి శివాజీ కేఫ్ అనే పెరుతొ ఒక కాఫీ హొటలు ఉంది.ఈ హొటలును 1950 ప్రాంతములలో శ్రీ దమ్మాలపాటి మాధవరావుగారు మొదలు పెట్టినారు. ఆతరువాత అది చాలా చెతులు మారినప్పటికి, అదె పెరుతొ ఇప్పటికి నడిఛెడిది. ఆ హోటలును మూసివేసినారు. ఐననూ, అక్కడ ఉన్నకూడలికి అదే పేరు. . ఈ పేరుతో ఉన్న కూడలి ఈ పేటకు ముఖ్య కూడలి.
  2. ఇక్కడ ఒక ఉద్యానవనము (పార్క్)ఉన్నది. ఈ ఉద్యానవనము 2007లో పునరుద్ధరించారు
  3. ఇక్కడ జిల్లా గ్రంథాలయం ఉంది. 1990లలో ఇక్కడ లైబ్రెరియనుగా పని చెసిన శ్రీ రాజెశ్వర రావుగారు విశేష కృషి జరిపి, ఈ గ్రంథాలయంనకు చక్కటి భవనము కట్టించారు.
  4. ఒక్క సినిమా హాలు కూడా లేని పేటలలో ఇది ఒకటి.
  5. ఈ మధ్య వరకు (2004 సంవత్సరము వరకు), సత్యనారాయణపురంమునకు ప్రత్యేక రైలు స్టేషను ఉండేది. రాకపొకలకు ఆడ్డముగా ఉండుట వలన (ఆ రైలు మార్గము మీద 5 గెట్లు అవి వెయుటవలన రాకపొకలకు అంతరాయము) ఆ స్టేషనును తొగించారు. స్టేషన్ను రైలు పట్టాలను తొలగింఛి, మునుపు పట్టాలు ఉన్న ఛోటున, రామవరప్పాడు వరకూ ఒక రహదారిని వేసినారు.