Jump to content

సత్యన్ అంతికాడ్

వికీపీడియా నుండి
సత్యన్ అంతికాడ్
జననం
సత్యన్ అంతికాడ్

అంతికాడ్ , త్రిస్సూర్ , కేరళ
వృత్తి
  • దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • గీత రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1982–ప్రస్తుతం
కృతులుసత్యన్ అంతికాడ్ ఫిల్మోగ్రఫీ
భాగస్వామినిమ్మీ
పిల్లలు3
పురస్కారాలు2008, 2005, 1999 - ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

సత్యన్ అంతికాడ్ భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్& గేయ రచయిత.[1][2] ఆయన ప్రధానంగా మలయాళ సినిమాల్లో పని చేస్తున్నాడు. ఆయన ఐదు దశాబ్దాల కెరీర్‌లో 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు, 12 సినిమాలకు గీత రచయితగా, 6 సినిమాలకు స్క్రిప్ట్ రచయితగా ఉన్నాడు. ఆయన జాతీయ చలనచిత్ర అవార్డు, ఐదు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు. ఆయన తన "ఈశ్వరన్ మాత్రం సాక్షి" పుస్తకానికి 2019 లో హాస్యం కోసం కేరళ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సత్యన్ అంతికాడ్ కేరళలోని త్రిసూర్ జిల్లాలోని అంతికాడ్‌లో ఎం.వి. కృష్ణన్, ఎం.కె కళ్యాణి అమ్మలకు జన్మించాడు.[4] ఆయన నిమ్మి సత్యన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికీ 3 కుమారులు అరుణ్ సత్యన్, అనూప్ సత్యన్ & అఖిల్ సత్యన్ ఉన్నారు. వాళ్ల నాన్నలాగే అనూప్, అఖిల్ ఇద్దరూ సినిమా దర్శకులు. అనూప్ వరనే అవశ్యముండ్ (2020)తో దర్శకుడిగా పరిచయం కాగా, అఖిల్ పచువుమ్ అత్బుత విళక్కుమ్ (2023)తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సినీ జీవితం

[మార్చు]

సత్యన్ 1973లో రేఖ సినీ ఆర్ట్స్‌లో డాక్టర్ బాలకృష్ణన్‌కి సహాయ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన పి. చంద్రకుమార్‌కి అసోసియేట్ డైరెక్టర్‌గా, దర్శకుడు జెస్సీకి పలు సినిమాలలో సహాయ సహకారాలు అందించాడు. సత్యన్ 1982లో కురుక్కంటే కళ్యాణంతో దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు.[5] సత్యన్ రెండు నవలలను సినిమాలుగా తీశారు: మోహన్‌లాల్ నటించిన అప్పుణ్ణి ( VKN నవల యొక్క చలన చిత్ర అనుకరణ) & జయరామ్, మంజు వారియర్ నటించిన ఇరట్టక్కుట్టికలుడే అచ్చన్ (సీవీ బాలకృష్ణన్ నవల అనుసరణ). పింగమి వంటి సినిమాలు విడుదల సమయంలో కమర్షియల్‌గా పరాజయం పాలైనప్పటికీ సంవత్సరాలుగా కల్ట్ ఫాలోయింగ్‌ను పొందాయి.[6][7]

పుస్తకాలు

[మార్చు]

సత్యన్ అంతికాడ్ ఈశ్వరన్ మాత్రం సాక్షి, శేషం వెళ్లితిరయిల్ & ఆత్మవింటే అడిక్కురిప్పుకల్‌లను రచించాడు. ఈశ్వరన్ మాత్రం సాక్షి 2019లో హాస్యానికి కేరళ సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది.[8]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ప్రధాన వ్యాసం: సత్యన్ అంతికాడ్ ఫిల్మోగ్రఫీ

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా మూ
2024 మజవిల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవార్డులు మాస్టర్ ఎంటర్టైనర్ (దర్శకుడు) అవార్డు
2001 జాతీయ చలనచిత్ర అవార్డులు మలయాళంలో ఉత్తమ చలనచిత్రం కొచ్చు కొచ్చు సంతోషంగల్
1986 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ కథ టిపి బాలగోపాలన్ ఎంఏ
1999 ప్రజాదరణ పొందిన ఆకర్షణ & సౌందర్య విలువలతో ఉత్తమ చిత్రం వీండుం చిల వీట్టుకార్యంగల్
2005 ప్రజాదరణ పొందిన ఆకర్షణ & సౌందర్య విలువలతో ఉత్తమ చిత్రం అచువింటే అమ్మ
2007 ఉత్తమ స్క్రీన్ ప్లే వినోదయాత్ర
2008 ప్రజాదరణ పొందిన ఆకర్షణ & సౌందర్య విలువలతో ఉత్తమ చిత్రం ఇన్నతే చింత విషయం
1996 దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు తూవల్ కొట్టారం
2003 ఉత్తమ చిత్రం మనస్సినక్కరే
ఉత్తమ దర్శకుడు
2003 ఆసియానెట్ ఫిల్మ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు
2005 ఉత్తమ చిత్రం అచువింటే అమ్మ
1999 ఉత్తమ చిత్రం వీండుం చిల వీట్టుకార్యంగల్
2006 మాతృభూమి ఫిల్మ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు రసతంత్రం
2019 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు న్జన్ ప్రకాశన్

మూలాలు

[మార్చు]
  1. "The director with the golden touch" (in ఇంగ్లీష్). The New Indian Express. 16 May 2012. Retrieved 23 September 2025.
  2. "Exclusive: Malavika Mohanan Signs Malayalam Film With Director Sathyan Anthikad" (in ఇంగ్లీష్). Filmfare. 28 January 2025. Archived from the original on 23 September 2025. Retrieved 23 September 2025.
  3. "സ്‌നേഹ സാന്ത്വനം പോലെ, Interview - Mathrubhumi Movies". Archived from the original on 2012-08-12. Retrieved 1 November 2015.
  4. "കഥ തുടരുകയാണ്.., Interview - Mathrubhumi Movies". Archived from the original on 2011-07-11. Retrieved 1 November 2015.
  5. "Weblokam : Sathyan Anthikkad Birthday | Weblokam profile". Archived from the original on 19 జనవరి 2007. Retrieved 1 నవంబరు 2015.
  6. "Weblokam : Sathyan Anthikkad Birthday". Archived from the original on 19 జనవరి 2007. Retrieved 1 నవంబరు 2015.
  7. "സ്‌നേഹ സാന്ത്വനം പോലെ, Interview - Mathrubhumi Movies". Archived from the original on 2012-08-12. Retrieved 1 November 2015.
  8. "Kerala Sahitya Akademi fellowships for P. Valsala, N.V.P. Unithiri". The Hindu. 15 February 2021. Retrieved 11 January 2022.

బయటి లింకులు

[మార్చు]