Jump to content

సత్యపాల్ మాలిక్

వికీపీడియా నుండి
సత్యపాల్ మాలిక్
2018లో మాలిక్
19వ మేఘాలయ గవర్నర్
In office
2020 ఆగస్టు 18 – 2022 అక్టోబరు 3
అంతకు ముందు వారుతథాగత రాయ్
తరువాత వారుబి.డి. మిశ్రా
18వ గోవా గవర్నర్
In office
2019 నవంబరు 3 – 2020 ఆగస్టు 18
అంతకు ముందు వారుమృదుల సిన్హా
తరువాత వారుభగత్ సింగ్ కొష్యారి (అదనపు ఛార్జీ)
10వ జమ్మూ కాశ్మీర్ గవర్నర్
In office
2018 ఆగస్టు 23 –2019 అక్టోబరు 30
అంతకు ముందు వారునరీందర్ నాథ్ వోహ్రా
తరువాత వారుపదవి రద్దు చేయబడింది
జి. సి. ముర్ము
(లెఫ్టినెంట్ గవర్నర్‌గా)
ఒడిశా గవర్నర్
అదనపు బాధ్యత
In office
2018 మార్చి 21 -2018 మే 28
అంతకు ముందు వారుఎస్.సి. జమీర్
తరువాత వారుగణేషి లాల్
27వ బీహార్ గవర్నర్
In office
2017 సెప్టెంబరు 30 – 2018 ఆగస్టు 21
అంతకు ముందు వారు
తరువాత వారులాల్‌జీ టండన్
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
In office
1989–1991
అంతకు ముందు వారుఉషా రాణి తోమర్
తరువాత వారుషీలా గౌతమ్
నియోజకవర్గంఅలీగఢ్
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
In office
1980–1989
నియోజకవర్గంఉత్తర ప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననం (1946-07-24) 1946 జూలై 24 (వయసు 78)
హిసవాడ, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ [1]
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారతీయ క్రాంతి దళ్, జనతాదళ్, కాంగ్రెస్, లోక్‌దళ్, ఎస్.పి
కళాశాలమీరట్ విశ్వవిద్యాలయం (B.Sc, LLB)

సత్య పాల్ మాలిక్ (జననం 24 జూలై 1946) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. మాలిక్ 2018 ఆగస్టు 23 నుండి 2019 అక్టోబరు 23 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర 10వ, చివరి గవర్నర్‌గా పనిచేశారు. అతని పదవీ కాలంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దు చేయడం జరిగింది. తరువాత, అతను గోవాకు 18వ గవర్నరుగా 2019 నవంబరు 3న మారారు. 2020 ఆగస్టు 18 నుండి 2022 అక్టోబరు 3 వరకు మేఘాలయ 21వ గవర్నర్‌గా కూడా పనిచేశారు.[2][3]

1974-77 మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా రాజకీయ నాయకుడిగా అతని మొదటి ప్రముఖ పని. అతను 1980 నుండి 1986, 1986-89 వరకు ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1989 నుండి 1991 వరకు జనతాదళ్ సభ్యునిగా అలీగఢ్ నుండి 9వ లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అతను 2017 సెప్టెంబరు 30 నుండి 2018 అక్టోబరు 23 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేసారు.[4][5] 2018 మార్చి 21 నుండి 2018 మే 28 వరకు అదనపు బాధ్యతలతో ఒడిశా గవర్నర్‌గా పనిచేసారు.

నేపథ్యం

[మార్చు]

మాలిక్ ఉత్తర ప్రదేశ్ బాగ్ పట్ లోని హిసావాడ గ్రామంలో జన్మించాడు. [6] [7] [8] వీరిది జాట్ కుటుంబం. ఇతను రాజకీయాల్లో చేరడానికి ముందు మీరట్ కాలేజ్ నుండి తన లా డిగ్రీని పూర్తిచేసాడు. [9] [10]

నిర్వహించిన పదవులు

[మార్చు]

అతను 1989 లో జనతాదళ్ టికెట్‌పై అలీగఢ్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. మొత్తం 2,33,465 (51.5 శాతం) ఓట్లుతో భారీ విజయం సాధించాడు, అంతకు ముందు సిట్టింగ్ ఎంపీ ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఉషా రాణి తోమర్ 77,958 ఓట్ల తేడాతో ఓడిపోయారు, వీరికి 1,55,507 (34.2 శాతం) ఓట్లు వచ్చాయి. [11] [12] [13] 1996 లో అలీగఢ్ నుండి తిరిగి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. [14]

జాతీయ రాజకీయాలు

[మార్చు]
  • 1980–89: ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడు
  • 1989–91: జనతాదళ్ టిక్కెట్‌పై అలీఘర్ నుండి లోక్‌సభ సభ్యుడు
  • 1996: SP టిక్కెట్‌పై అలీగఢ్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి, కేవలం 40,789 ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచారుs.[15]
  • 2012: BJP జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. [16]

రాష్ట్రాల గవర్నరు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "9th Lok Sabha Members Bioprofile". Lok Sabha. Archived from the original on 1 October 2017. Retrieved 30 September 2017.
  2. PTI (18 August 2020). "Satya Pal Malik Appointed Meghalaya Governor, to Replace Tathagata Roy". News18. Archived from the original on 26 September 2020. Retrieved 18 August 2020.
  3. "Satya Pal Malik: Have no plans to join active politics". October 2022. Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  4. "New governors appointed: All you need to know". The Times of India. 30 September 2017. Archived from the original on 13 June 2018. Retrieved 30 September 2017.
  5. "Who is Satya Pal Malik?". Indian Express. 30 September 2017. Archived from the original on 30 September 2017. Retrieved 30 September 2017.
  6. "Microsoft Word - biograp_sketc_1a.htm" (PDF). Retrieved 22 August 2018.
  7. "In Kashmir, governors kill time boozing and golfing: Satyapal Malik". 15 March 2020. Archived from the original on 16 మే 2021. Retrieved 4 అక్టోబరు 2021.
  8. "Facing 'threat of transfer', J&K governor Satya Pal Malik takes his case to public, banks on Jat roots to keep BJP onside-Politics News, Firstpost". 28 November 2018.
  9. "::Welcome to Meerut College". Archived from the original on 2022-01-18. Retrieved 2021-10-04.
  10. "Modi Govt's Strategy Behind Appointment Of Satya Pal Malik As J&K Governor". Outlook.
  11. "Archived copy". Archived from the original on 22 February 2015. Retrieved 22 October 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  12. "Aligarh Partywise Comparison". Eci.nic.in. Retrieved 22 August 2018.
  13. "Electiontrends.in". electiontrends.in. Archived from the original on 16 ఏప్రిల్ 2021. Retrieved 27 December 2019.
  14. "Rediff On The NeT: Polling Booth: Election' 96: Uttar Pradesh/Aligarh". Rediff.com. Retrieved 22 August 2018.
  15. "Rediff On The NeT: Polling Booth: Election' 96: Uttar Pradesh/Aligarh". Rediff.com. Archived from the original on 28 June 2022. Retrieved 24 June 2022.
  16. Shekhar, Kumar Shakti (27 October 2021). "Satya Pal Malik: When Satya Pal Malik courted controversies as governor – from Bihar, Jammu-Kashmir and Goa to Meghalaya". The Times of India. Archived from the original on 17 August 2022. Retrieved 24 June 2022.