సత్యరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యరాజ్
6105 actor-sathyaraj.jpg
బాహుబలి ఆడియో లాంచ్ సందర్భంగా సత్యరాజ్
జననంరంగరాజ్ సుబ్బయ్య
(1954-10-03) 1954 అక్టోబరు 3 (వయస్సు: 64  సంవత్సరాలు)[1]
కోయంబత్తూరు, తమిళనాడు
ఇతర పేర్లురంగరాజ్
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1978–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమహేశ్వరి (m.1979–ప్రస్తుతం)
పిల్లలుదివ్య సత్యరాజ్ , శిబిరాజ్

సత్యరాజ్ (జ. 3 అక్టోబరు 1954) ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలున్నాయి. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం లాంటి సినిమాల్లో నటించాడు.ఈయన నాస్తికులు గొప్పవ్యక్తి అయిన పెరియర్ గారి అనుచరుడు.

బాల్యం[మార్చు]

సత్యరాజ్ 3 అక్టోబరు 1954న సుబ్బయ్యన్, నదంబాళ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఆయనకు కల్పన, రూప అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన జన్మనామం రంగరాజ్. చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ కు వీరాభిమాని. [2] సత్యరాజ్ కోయంబత్తూరులోని సెయింట్ మేరీస్ కాన్వెంటు పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత రామ్ నగర్ లోని సబర్బన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీయెస్సీ బోటనీ చదివాడు. ఈయన ప్రముఖ గొప్ప నాస్తికులు గొప్ప మేధావి పెరియర్ గారి అనుచరుడు. [3][4][5]

సత్యరాజ్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా అతని తల్లి ఆ రంగంలో ప్రవేశించడానికి అంగీకరించలేదు. అయినా సరే 1976 లో సినీరంగంలో ప్రవేశించడం కోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం చేరాడు.[6]

సినిమాలు[మార్చు]

అన్నకిలి అనే సినిమా చిత్రీకరిస్తుండగా ఆయనకు నటుడు శివకుమార్, మరియు నిర్మాత తిరుప్పూర్ మణియన్ లతో పరిచయం అయింది.[4] కోమల్ స్వామినాధన్ డ్రామా బృందంలో చేరాడు. నటుడిగా ఆయన మొట్టమొదటి సినిమా సట్టమ్ ఎన్ కైయిల్,[7] 1978 లో వచ్చిన ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన ప్రతినాయకుడైన తెంగై శ్రీనివాసన్ కి అనుచరుడిగా నటించాడు. తరువాత కన్నన్ ఒరు కైక్కుళందై అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.[8][9] అందులోనే మరో చిన్న పాత్ర కూడా పోషించాడు. కథానాయకుడిగా ఆయన మొదటి సినిమా 1985 లో వచ్చిన సావి, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. అందులో సత్యరాజ్ ది నెగటివ్ పాత్ర. 1978 నుండి 1985 వరకు సుమారు 75 సినిమాల్లో నటించాడు. వీటిలో చాలా వరకు ప్రతినాయక పాత్రలే. [10][11]

మూలాలు[మార్చు]

  1. Nandhu, Nandhu (3 October 2015). "HAPPY BIRTHDAY SATHYARAJ". Behindwoods.com. Retrieved 4 October 2015.
  2. http://archives.chennaionline.com/interviews/satayaraj.asp
  3. Subha J Rao (2013-05-04). "Many shades of grey". Chennai, India: The Hindu. Retrieved 2013-11-27. Cite news requires |newspaper= (help)
  4. 4.0 4.1 75 படங்களில் வில்லனாக நடித்தபின் கதாநாயகனாக உயர்ந்த சத்யராஜ்: மாறுபட்ட வேடங்களில் நடித்து சாதனை | satyaraj villian 75 movies cinema history
  5. dinakaran at the Wayback Machine (archived డిసెంబరు 7, 2000)
  6. "Sathyaraj: I'm like the kid in TZP - Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2009-04-20. Retrieved 2013-11-27. Cite news requires |newspaper= (help)
  7. [http://cinema.maalaimalar.com/2013/07/22232237/kamal-movie-satyaraj-villan-ro.html కమల్ సినిమాలో సత్యరాజ్ విలన్ పాత్ర | kamal movie satyaraj villan role
  8. ప్రొడక్షన్ మేనేజర్ గా సత్యరాజ్| Sathyaraj cinema became production manager
  9. dinakaran at the Wayback Machine (archived ఆగస్టు 4, 2003)
  10. "Serene ride to success". The Hindu. Chennai, India. 11 August 2000. Retrieved 24 October 2011.
  11. సత్యరాజ్ కమల్ హాసన్ నటించిన సినిమాలు | actor sathyaraj and kamal hassan kakki chattai film
"https://te.wikipedia.org/w/index.php?title=సత్యరాజ్&oldid=2561993" నుండి వెలికితీశారు