సత్యవతీ ఎం సిర్సత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవతీ ఎం సిర్సత్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

సత్యవతీ ఎం సిర్సత్ జన్మస్థలం కరాచీ. ఆమె తండ్రి షిప్పింగ్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తూ ఉండేవాడు. సత్యవతీ ఎం సిర్సత్ తల్లితండ్రులు ఇద్దరూ థియోసోఫిస్ట్ సమాజానికి చెందిన వారు. తండ్రి షిప్పింగ్ ఉద్యోగం కారణంగా వారు అనేకదేశాలు తిరుగుతూ ఉండేవారు. ఆమె డాక్టర్ జార్జ్, రుక్మిణీదేవి అరండేల్ స్థాపించిన " బెసెంట్ మెమోరియల్ స్కూలు "లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. రుక్మిణీదేవి అరండేల్ " కళాక్షేత్ర " సంగీత నృత్యపాఠశాల వ్యవస్థాపకురాలు. సత్యవతీ ఎం సిర్సత్ టీనేజ్‌లో పౌల్ డీ క్రూఫీ వ్రాసిన " ది మైక్రోబ్ హంటర్స్ " పుస్తకం చదివి ప్రభావితురాలైంది. సత్యవతీ ఎం సిర్సత్ చదువుతో చక్కని సంస్కృతికూడా అలవరచుకుంది.

కాలేజ్[మార్చు]

సత్యవతీ ఎం సిర్సత్ కుటుంబం బంబే వెళ్ళిన తరువాత " సెయింట్ క్సేవియర్ కాలేజి "లో మైక్రోబయాలజీ ప్రధానాంశంగా డిగ్రీ పూర్తిచేసింది. ఆమెకు మైక్రో ఆర్గానిజం అంటే మక్కువ అధికం. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే " డి టాటా మెమోరియల్ హాస్పిటల్ ఫర్ కేంసర్ అండ్ అల్లాయ్ డిసీసెస్ " చీఫ్ పెథాలజిస్ట్‌ ఖనోల్కర్‌తో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ముందుగా సమాధానం లేకపోయినా రెండుగంటల తతువాత ఆయన లోపలికీలిచి ఆమెతో చాలాసేపు ముచ్చటించారు. సత్యవతీ ఎం సిర్సత్ తరువాత డాక్టర్ ఖనోల్కర్ వద్ద పనిచేయడానికి అవకాశం లభించింది.

రీసెర్చ్[మార్చు]

డాక్టర్ ఖనోల్కర్ ఫిజీషియన్‌గా, కళాకారుడు, కళారాధకుడు అలాగే పలు భాషాసాహిత్యంలో ప్రవేశం ఉంది. 1948లో భారతప్రభుత్వ హెల్త్ మినిస్ట్రీ టాటా మెమోరియల్‌లో పెథాలజీ డిపార్ట్‌మెంటును ప్రారంభించి సంపూర్ణ కేన్సర్ పరిశోధనలు చేపట్టే ప్రయత్నం చేసింది. సీనియర్ డాక్టొరల్ విద్యార్థినిగా ఆమె రీసెర్చ్ సెంటర్ స్థాపన సభ్యులలో ఒకరైంది. కొత్తగా ఆరంభించబడిన డిపార్ట్‌మెంటుకు అవసరమైన సాంకేతికాల కొరకు విదేశాలకు పంపిన ముగ్గురు సభ్యులలో సత్యవతీ ఎం సిర్సత్ ఒక్కరు. రీసెర్చ్ పరిశోధనలలో ఆమె హాంస్ సెలీ, ఆలర్ట్ జెంట్-జియోగీ, లినస్‌పౌలింగ్, ఏక్స్ హడ్డో, చార్లెస్ ఒబర్లింగ్ విలియం అస్ట్బ్యురీలతో కలిసి పనిచేసింది.తిరిగి వచ్చిన తతువాత కొత్త లాబరేటరీ ఆరంభిందబడింది. అందులో చాలా మంది విద్యార్థులు ఆసక్తిగా చేరారు. తరువాత అది అంర్జాతీయ గుర్తింపు పొందింది.

ప్రోత్సాహం[మార్చు]

సత్యవతీ ఎం సిర్సత్ తండ్రి సెయింట్ స్కేవియర్ కాలేజ్ ప్రొసెసర్‌గా పనిచేసాడు. తరువాత ఆయన షిప్పింగ్‌కు మారాడు. ఆయన పుస్తకాల అభిమాని అంతేకాక సంస్కృత పండితుడు , రచయిత. ఆయన ఆసక్తులను పిల్లలకు కూడా అందించాడు. ఆయన పిల్లలకు ఉన్నత చదుల ముఖ్యత్వం గురించిన ప్రేరరణ కలిగించాడు. తరువాత ఆమెకు డాక్టర్ ఖొనాల్కర్ కలిగించిన ప్రేరణ కూడా చెప్పతగినదే. తరువాత సత్యవతీ ఎం సిర్సత్‌కు ప్రేరణ కలిగించిన వ్యక్తులలో ఆమె భర్త సిర్‌సత్ ఒకరు. భార్యాభర్తల మద్య చాలా వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆమెకు ఆమె భర్త స్నేహితుడు, శ్రేయోభిలాషి , మార్గదర్శిగా ఉన్నాడు.అమె భర్త అంతర్జాతీయ " అంకో పెథాలజిస్ట్ ". ఆయన విద్యార్థులు ఆరాధించే ఉత్తమ పెథాలజిస్ట్ టీచర్. ఆమె భర్త ఆమెకు రీసెర్చ్ సహాయకుడుగా సహకరించడమే కాక ఆమె రీసెర్చ్‌లో అమె సాధించినదానికి సంతోషించేవాడు.

ఉద్యోగవిరమణ[మార్చు]

సత్యవతీ ఎం సిర్సత్ ఉద్యోగాన్ని తన జీవితం, సాధన , తపసు అని భావించింది. ఆమె లాబరేటరీలను తపోభూములుగా భావించింది. పనిచేయడాన్ని ఆమె ప్రేమించిది. భారతదేశం , ఆగ్నేయాసియా దేశాలలో దాదాపు 200 మంది విద్యార్థులకు ఆమె శిక్షణ ఇచ్చింది. ఆమె ఉద్యోగం నుండి విశ్రమించిన తరువాత టాటా మెమోరియల్ సెంటరు మెడికల్ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేసింది. ఆమె భారతీయబాలభన్ ఆయుర్వేదిక్ సెంటరులో " ఏంషియంట్ ఇంసైట్స్, మోడ్రెన్ డిస్కవరీస్ "లో 17 సనత్సరాలు పనిచేసింది. అదిచేయడానికి ఆమెకున్న అమూల్యమైన సంస్కృత ఙానం ఉపకరించింది. ఆమె " ప్రాజెక్ట్ ఆఫ్ కేన్సర్ నోసాలజీ ఆఫ్ వ్రిద్ధత్రయి " (చరక, శుష్రుత, వాగ్భట్ట) కొరకు పనిచేసింది. పురాతన వైద్యవిధానం ఆధునిక వైద్యంతో అనుసంధానించడమే ఆ ప్రాజెక్ట్ లక్ష్యం.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.