సత్య యామిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్య యామిని
జననం (1995-02-15) 1995 ఫిబ్రవరి 15 (వయసు 29)
వృత్తినేపథ్య గాయకురాలు
తల్లిదండ్రులు
  • ప్రభాకర్ (తండ్రి)
  • శ్రీదేవి (తల్లి)

సత్య యామిని (జననం 1995 ఫిబ్రవరి 15) భారతీయ నేపథ్య గాయని. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళ భాషా చిత్రాలలో పాటలు ఆలపిస్తుంది.

పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి మ్యూజిక్‌ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాహుబలి సినిమాలో తన పాట మమతల తల్లి.. తో ప్రసిద్ధిచెందింది.[1]

బాల్యం[మార్చు]

ఆమె తెలంగాణలోని హైదరాబాద్‌లో 1995 ఫిబ్రవరి 15న ప్రభాకర్, శ్రీదేవి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఎయిర్‌లైన్ కంపెనీలో ఉద్యోగి కాగా, తల్లి గృహిణి. చిన్నతనంలో తండ్రితో కలిసి పాటలు హమ్ చేసే సత్య 7 సంవత్సరాల వయస్సులో సంగీత ఉపాధ్యాయురాలు లతామురళి వద్ద గానంలో శిక్షణ పొందింది.

కెరీర్[మార్చు]

ఆమె సరిగమప లిటిల్ చాంప్స్‌ (SaReGaMaPa)లో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఆమె లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో చేరి సంగీత ఉపాధ్యాయుడు రామాచారి వద్ద శిక్షణ తీసుకుంది. అదే సమయంలో స్వర నీరాజనం, సూపర్ సింగర్ 8 వంటి టీవీ కార్యక్రమాలలో పాల్గొన్నది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆమె ప్రతిభకు ముగ్ధులయ్యాడు. దీంతో ఆయన టీమ్‌లో సత్య యామిని చేరి కోరస్ సింగర్‌గా గుర్తింపుతెచ్చుకుంది.

2015లో ఆమె బాహుబలి: ది బిగినింగ్ సినిమాలోని మమతల తల్లి.. పాటతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇది సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో వరుసపెట్టి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. బాహుబలి తర్వాత శైలజారెడ్డి అల్లుడు, అల వైకుంఠపురములో.., కొండపొలం, అఖండ, వకీల్‌సాబ్‌, రాధేశ్యామ్‌, బింబిసార, అహింస ఇలా ప్రతీసినిమాలోనూ హిట్ సాంగ్స్ ఆమె అందించింది.

పురస్కారాలు[మార్చు]

  • 2021 తమిళ చిత్రం ఎనిమి నుండి "తుమ్ తుమ్" పాటకుగానూ సత్య యామిని 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ అందుకుంది.

మూలాలు[మార్చు]

  1. "satya yamini | కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి 'మమతల తల్లి' సింగర్‌-Namasthe Telangana". web.archive.org. 2023-04-27. Archived from the original on 2023-04-27. Retrieved 2023-04-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)