Jump to content

సనాతన ఎనలెటిక్స్ సంస్థ - (బెల్లంపల్లి)

వికీపీడియా నుండి
సనాతన ఎనలెటిక్స్ రిక్రూట్ మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ - బెల్లంపల్లి
రకంపబ్లిక్ కంపెనీ
రిక్రూట్ మెంట్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన
పరిశ్రమకంపెనీ లిమిటెడ్ బై షెర్స్, వ్యాపార సేవలు
స్థాపన04, జూలై 2017
ప్రధాన కార్యాలయండోర్ నంబర్:28-4-5/1&2 1వ అంతస్తు,కాల్టెక్స్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా ,తెలంగాణ రాష్ట్రం, ఇండియా -504251
కీలక వ్యక్తులు
ఎర్ర రంగనాథ్ రాజు సీఈఓ సాయి నాథ్ రాజు, శ్రీనాథరాజు
ఉత్పత్తులువ్యాపార సేవలు
1.0 లక్షలు
Total assets100.0% లక్షలు
ఉద్యోగుల సంఖ్య
300
అనుబంధ సంస్థలుRoC హైదరాబాద్
వెబ్‌సైట్https://sanathanaars.com/

సనాతన ఎనలెటిక్స్,రిక్రూట్ మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిమండల కేంద్రములో సనాతన ఎనలెటిక్స్ రిక్రూట్ మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేటు ఐటీ సంస్థను 2017 లో ఎర్ర రంగనాథ్ రాజు సోదరులు స్థాపించారు. ఇది ప్రభుత్వేతర సంస్థగా వర్గీకరింబడింది. తెలంగాణ రాష్ట్రం రిజిస్ట్రేషన్, RoC - హైదరాబాదు లో నమోదు చేయబడింది[1][2][3].

చరిత్ర

[మార్చు]

సనాతన ఎనలెటిక్స్ రిక్రూట్ మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది షేర్ల లో ద్వారా పరిమితం చేయబడిన కంపెనీ. ఇది ప్రభుత్వేతర కంపెనీగా వర్గీకరించబడినది. ఇది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫీస్ సీటి (RoC) హైదరాబాద్ కింద నమోదు చేయబడింది.కార్పోరేట్ వ్యవహారాల మంత్రి శాఖ,2019 ,కంపౄనీ/LLP డేటా కంపెనీ చట్టం 1956 &2013 ద్వారా కార్పొరేట్ వ్యవహారాలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం పరిపాలనా సంస్థ ఇతర అనుబంధ చట్టాలు,బిల్లులు, నియమాలలో సహా కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శాఖ ప్రకారం ఈ కంపెనీ 04 జూలై 2017 లో స్థాపించబడింది.http://www.mca.gov.in/,31 జులై 2017‌లో నవీకరించబడినది. దీని కార్పొరేట్ గుర్తింపు సంఖ్య సీఐఎన్ నెంబర్ U74993TG2017PTC118084 కలిగి ఉంది.

జాతీయ స్థాయి గుర్తింపు

[మార్చు]

సనాతన ఎనలెటిక్స్ రిక్రూట్ మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 17 జనవరి 2024లో న్యూఢిల్లీ లో జరిగిన భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోల్‌ లో సనాతన ఎనలెటిక్స్ కంపెనీ‌ రూపొందించిన వాహన్ డేటా అనాలసిస్ పోర్టల్ ను ప్రదర్శించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య అతిథిగా హాజరై కంపెనీ ఎక్స్ పోల్ ను ప్రారంభించారు.‌కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ,హర్ దీప్ సింగ్, మనోహర్ లాల్, కుమార్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన సాప్ట్ వేర్ కంపెనీ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం.

అభివృద్ధి

[మార్చు]

ఆర్థిక వ్యవహారాల నిరంతరం ఆర్థిక అభివృద్ధి, వేగవంతమైన డిజిటల్ స్వీకరణ ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ పెరగడానికి దారితీస్తుంది.ఫలితంగా HR కన్సల్టెన్సీ మార్కేట్ క్రమంగా పెరుగుతోంది.‌నైపుణ్య మార్కెట్ పరిణామాన్ని ట్రాక్ చేయడం , సరైన నైపుణ్య పరిపక్వత కలిగిన అభ్యార్థుల సరైన సమూహాన్ని కనుగొనడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. అందువల్ల నాణ్యత, విశ్వసనియత స్థిరత్వంతో కూడిన HR కన్సల్టెన్సీ సంస్థను ఎంచుకోవడం వ్యూహాత్మక అవసరం.డబ్బు ఆదా చేయడమే కాకుండా ,HR సేవలను అవుట్ సోర్సింగ్ చేయడం కూడా కంపెనీ యొక్క సామర్థ్య ఆయుధాశాలకు వ్యూహాత్మక అంచున వేస్తుంది .

అభ్యర్థుల ఎంపిక

[మార్చు]

సనాతన ఎనలెటిక్స్ సంస్థ IT,BFSI , తయారీ రంగాల పై దృష్టి పెడుతుంది[4]. ఇది చాలా కాలం పాటు అధిక - నాణ్యత వనరులు, ప్రత్యేకమైన డేటా బేస్, కఠినమైన ప్రక్రియలు,తగిన కనెక్షన్ లను నిర్మించింది. సనాతన ఎనలెటిక్స్ నైపుణ్యం - నిర్ధిష్ట వృద్ధి ప్రమాణాలపై దృష్టి సారించింది. దాని అంతర్గత విశ్లేషణల ఆధారంగా,బ్యాకెండ్ బృందం తదుపరి స్థాయి అవకాశాన్ని కోరుకునే అభ్యర్థి సంభావ్యత ను సులభంగా గుర్తించగలదు. అందువల్ల సనాతన ఎనలెటిక్స్ సంస్థ ద్వారా అభివృద్ధికి స్థానం లభించిన తర్వాత వారి కెరీర్ ప్రమాణం అంతటా సంస్థతో అనుబంధంగా ఉంటాయి[5].

సేవలు

[మార్చు]

సనాతన ఎనలిటిక్స్ కంపెనీ నాలుగు విభాగాలలో సేవలు అందిస్తుంది. అందులో ఒకటి రిక్రూట్మెంట్, ఏడీపీ, ప్రావిడన్స్ వంటి సంస్థల అవసరాలకు తగినట్లుగా- వీళ్ల దగ్గ రున్న డేటా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఇంటర్వ్యూలకు సిద్ధం చేసి పంపిస్తారు. మరొకటి ఎకనామిక్ రీసెర్చ్ వింగ్. టీవీఎస్, సుందరం, బజాజ్, హోండా మొదలగు వంటి వాహన సంస్థలకు అవసరమైన క్షేత్రస్థాయి వివరాలను వీళ్లు పరిశోధించి అందిస్తారు. ఉదాహరణకు బొగ్గు లేదా కరెంటు ఉత్పత్తి తగ్గితే ఏ బైకులు లేదా కార్ల కొనుగోళ్లు పెరుగుతాయి లేదా తగ్గుతాయి తదితర వివరాలను పరిశోధన చేసి పంపిస్తారు. దాన్ని బట్టి ఆ సంస్థలు వాహనాల తయారీపైన నిర్ణయాలు తీసుకుంటాయి. అంతే కాకుండా సాఫ్ట్వేర్ సంస్థల అవసరాలనూ కూడా ఈ కంపెనీ తీరుస్తుంది. కంపెనీ యొక్క అధీకృత మూలధనం రూ,‌1.0 లక్షలు ,100.0% చెల్లింపు మూలధనం అంటే ‌రూ,10‌లక్షలు ఈ కంపెనీ ప్రధానంగా వ్యాపార సేవలు వ్యాపార రంగంలో సేవలు చురుకుగా సాగుతోంది.ఇక, కొన్నాళ్లక్రితం 'షాప్స్ 'అండ్ మీ' పేరుతో ఓ యాప్నూ తీసుకొ చ్చిందీ సంస్థ. బెల్లంపల్లికి చుట్టుపక్కల ఉండే వందకు పైగా గ్రామాలకు యాప్ ఆర్డర్ల పైన నిత్యావసరాలను ఇళ్లకు చేరవేసే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం స్థానికులనే డెలివరీ సిబ్బందిగా నియమించారు[6].

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2023-10-06). "ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ @ తెలంగాణ". www.ntnews.com. Retrieved 2025-03-16.
  2. "సొంతూరి కోసం సంస్థనే పెట్టారు". EENADU. Retrieved 2025-03-16.
  3. Velugu, V6 (2023-05-15). "సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారబోతున్న బెల్లంపల్లి". V6 Velugu. Retrieved 2025-03-16. {{cite web}}: zero width space character in |title= at position 7 (help)CS1 maint: numeric names: authors list (link)
  4. Global, Telugu (2023-05-23). "తెలంగాణ టైర్-4 పట్టణాల్లో ఊపందుకుంటున్న ఐటీ రంగం | IT sector is gaining momentum in tier-4 towns of Telangana". Telugu Global. Archived from the original on 2025-03-18. Retrieved 2025-03-17.
  5. telugu, NT News (2023-05-21). "KTR | బెల్లంప‌ల్లిలో ఐటీ హబ్‌.. సంద‌ర్శించిన మంత్రి కేటీఆర్". www.ntnews.com. Retrieved 2025-03-17.
  6. Velugu, V6 (2023-05-15). "సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారబోతున్న బెల్లంపల్లి". V6 Velugu. Retrieved 2025-03-17. {{cite web}}: zero width space character in |title= at position 7 (help)CS1 maint: numeric names: authors list (link)