Jump to content

సన్ ఆఫ్ సర్దార్ 2

వికీపీడియా నుండి
సన్‌ ఆఫ్ సర్దార్‌ 2
దర్శకత్వంవిజయ్ కుమార్ అరోరా
రచనజగదీప్ సింగ్ సిద్ధూ
మోహిత్ జైన్
నిర్మాత
  • అజయ్ దేవ్‌గన్
  • జ్యోతి దేశ్‌పాండే
  • ఎన్ఆర్ పచిసియా
  • ప్రవీణ్ తల్రేజా
తారాగణం
  • అజయ్ దేవగన్
  • మృణాల్ ఠాకూర్
  • రవి కిషన్
  • సంజయ్ మిశ్రా
ఛాయాగ్రహణంఅసీమ్ బజాజ్
కూర్పునినాద్ ఖానోల్కర్
సంగీతంపాటలు:
జానీ
తనిష్క్ బాగ్చి
హర్ష ఉపాధ్యాయ
లిజో జార్జ్ - డీజే చేతస్
తేజ్వంత్ కిట్టు
జే మావని
సన్నీ విక్
స్కోర్:
అమర్ మొహిలే
సలీల్ అమృతే
నిర్మాణ
సంస్థలు
దేవగన్ ఫిల్మ్స్
జియో స్టూడియోస్
పంపిణీదార్లుపనోరమా స్టూడియోస్
పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్
విడుదల తేదీ
2025ఆగస్టు 08
సినిమా నిడివి
147 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 150 కోట్లు[2][3][4]
బాక్సాఫీసుఅంచనా ₹ 43.56 కోట్లు[5]

సన్ ఆఫ్ సర్దార్ 2 2025లో విడుదలైన హిందీ సినిమా. దేవగన్ ఫిల్మ్స్ & జియో స్టూడియోస్ బ్యానర్‌లపై అజయ్ దేవ్‌గన్ , జ్యోతి దేశ్‌పాండే , ఎన్ఆర్ పచిసియా & ప్రవీణ్ తల్రేజా నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించాడు. 2012 చిత్రం సన్ ఆఫ్ సర్దార్‌కు సీక్వెల్ గా నిర్మించిన సినిమాలో అజయ్ దేవ్‌గన్, మృణాల్ ఠాకూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించగా ప్రధాన ఫోటోగ్రఫీ జూలై 2024లో ప్రారంభమై లండన్‌లోని ఎడిన్‌బర్గ్, భారతదేశంలోని చండీగఢ్‌లలో షూటింగ్ జరిగింది.

ఈ సినిమా మొదట 25 జూలై 2025న విడుదల చేయాలని నిర్ణయించిన అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఆగస్టు 1న విడుదలైంది.[6][7]

సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా సెప్టెంబర్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[8]

జస్సీ (అజయ్ దేవగణ్)కు వీసా రావడంతో తన భార్య డింపుల్ (నీరు బజ్వా) దగ్గరకు వెళతాడు. ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత జస్సీని విడాకులు ఇవ్వమని కోరుతుంది డింపుల్. ఆ బాధలో ఉన్న అతనికి పాకిస్తాన్‌కు చెందిన రబియా (మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. రబియా (మృణాల్ ఠాకూర్) సవతి కుమార్తె సబా (రోషిణీ వాలియా) ఇంగ్లాండ్‌లో సెటిలైన సర్దార్ కుటుంబంలో అబ్బాయిని ప్రేమిస్తుంది. సబా పెళ్లి కోసం రబియాకు భర్తగా నటించడానికి జస్సీ అంగీరిస్తాడు. తానొక కల్నల్ అని అబద్ధం చెబుతాడు. తన కుమారుడిని ప్రేమించిన అమ్మాయి భారతీయురాలు కాదని, పాకిస్తానీ అని రాజా (రవి కిషన్)కు తెలిసిందా ? లేదా ? జస్సీ - రబియా నిజంగా భార్యాభర్తలు కాదని అందరికీ తెలిసిందా ? లేదా ? చివరకు ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."పెహ్లా తు దుజా తు"జానీజానీవిశాల్ మిశ్రా3:51
2."సన్ ఆఫ్ సర్దార్ 2 (టైటిల్ ట్రాక్)"షబ్బీర్ అహ్మద్ , ఖరా, సుకృతి భరద్వాజ్హర్ష ఉపాధ్యాయ్రోమీ, సుధీర్ యదువంశీ, సుకృతి భరద్వాజ్3:45
3."ది పో పో సాంగ్"అర్మాన్ శర్మతనిష్క్ బాగ్చిగురు రంధవా2:43
4."నాజర్ బట్టు"ప్రణవ్ వత్సహర్ష ఉపాధ్యాయ్, జే మావానీజుబిన్ నౌటియాల్3:33
5."కాళి ఐనాక్"కుమార్లిజో జార్జ్ - డీజే చేతస్రోమి, లిజో జార్జ్3:15
6."రబ్బా సాను"ఖారాసన్నీ విక్వికాస్ మాన్3:14
7."నాచ్డి"అల్బెల్ బ్రార్తేజ్వంత్ కిట్టునేహా కక్కర్2:37
మొత్తం నిడివి:22:58

మూలాలు

[మార్చు]
  1. "EXCLUSIVE: CBFC censors Xi Jinping's mention in Son Of Sardaar 2; replaces 'item' with 'madam'". Bollywood Hungama. Retrieved 30 July 2025.
  2. Tolani, Vartika (21 July 2025). "'सन ऑफ सरदार 2' में संजय दत्त की जगह रवि किशन को क्यों किया गया कास्ट? अजय देवगन ने दिया जवाब". Hindustan. Archived from the original on 21 July 2025. Retrieved 2 August 2025.
  3. Jhawar, Rakhee (20 July 2025). "अजय देवगन की 8 अमीर हीरोइन, एक की दौलत इतनी बन जाए सन ऑफ सरदार 2 जैसी 30 फिल्में". Asianet News. Archived from the original on 20 July 2025. Retrieved 2 August 2025.
  4. शिशौदिया, प्रशांत. "बॉलीवुड ने दांव पर लगाए 550 करोड़, 13 फिल्में होंगी रिलीज, बॉक्स ऑफिस पर मुनाफा कमाने के लिए करनी होगी इतने करोड़ की कलेक्शन". NDTV. Retrieved 5 August 2025.
  5. "Son Of Sardaar 2 Box Office Collection". Bollywood Hungama. 1 August 2025. Archived from the original on 3 July 2025. Retrieved 2 August 2025.
  6. "నవ్వుల అల్లరికి న్యూ డేట్ .. సన్‌‌ ఆఫ్ సర్దార్ 2 మూవీ వాయిదా". V6 Velugu. 20 July 2025. Archived from the original on 7 August 2025. Retrieved 7 August 2025.
  7. "రివ్యూ: 'సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2'.. అజయ్‌ దేవ్‌గణ్‌ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?". Eenadu. 4 August 2025. Archived from the original on 7 August 2025. Retrieved 7 August 2025.
  8. "'ఘాటి', 'ధడక్ 2'.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వ‌చ్చిన సినిమాలివే". NT News. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  9. "Did you know Ravi Kishan's role in 'Son of Sardaar 2' was first offered to Sanjay Dutt". The Times of India. 13 July 2025. Archived from the original on 7 August 2025. Retrieved 7 August 2025.

బయటి లింకులు

[మార్చు]