సపుతరా సరస్సు
సపుతరా సరస్సు | |
---|---|
ప్రదేశం | డాంగ్స్, గుజరాత్ |
అక్షాంశ,రేఖాంశాలు | 20°34′32″N 73°44′43″E / 20.5755°N 73.7452°E |
సరస్సు రకం | కృత్రిమ సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ప్రాంతాలు | డాంగ్స్ |
సపుతరా సరస్సు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల డాంగ్స్ జిల్లాలోని సపుతరా పట్టణం దగ్గర ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. ఇది ప్రధాన నగరం సపుతరా హిల్ స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది.[1][2]
చరిత్ర
[మార్చు]రాముడు తన అరణ్యవాసంలోని 11 సంవత్సరాలు ఇక్కడ గడిపాడని నమ్ముతున్నందున సపుతరా ప్రాంతానికి పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. సపుతరా అనే పేరుకు ‘సర్పాల నివాసం’ అని అర్ధం.[3]
వినోదం
[మార్చు]ఈ సరస్సు మానవ నిర్మితమైనది. బోటింగ్ వంటి కార్యకలాపాలకు బాగా ప్రాచుర్యం పొందింది. పర్యాటకుల వినోదం కోసం అనేక చిల్డ్రన్స్ పార్కులు, అనేక ఇతర ఆట స్థలాలు ఉన్నాయి. సరస్సు దగ్గర అనేక బోటింగ్ క్లబ్‌లు ఉన్నాయి.[4]
భౌగోళికం
[మార్చు]సపుతరా సరస్సు కొండలు, పచ్చదనంతో నిండి ఉండి, విశ్రాంతి, ఆనందం కలిగించే సుందరమైన ప్రదేశం. ఇక్కడి నుండి సహ్యాద్రి కొండల సుదూర దృశ్యాలు కూడా కనిపిస్తాయి.[2]
జనాభా
[మార్చు]భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, సపుతరా నోటిఫైడ్ ప్రాంతంలో 2,968 జనాభా ఉంది. ఆ జనాభాలో 1,031 మంది పురుషులు, 1,937 మంది మహిళలు ఉన్నారు. డాంగ్స్ జిల్లాలోని అక్షరాస్యత (75.2%) తో పోలిస్తే సపుతరా ప్రాంతం అక్షరాస్యత ఎక్కువ. సపుతరా అక్షరాస్యత రేటు 87.4% గా ఉంది. అందులో పురుషుల అక్షరాస్యత రేటు 89.73%, స్త్రీ అక్షరాస్యత రేటు 86.29% గా ఉంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Saputara Hill station". Dangs district administration website. Retrieved 13 Jun 2018.
- ↑ 2.0 2.1 2.2 "Saputara Gujarat, Saputara Tourist Guide, route map Saputara, Directory of hotels & resorts in Saputara, Hill station saputara". www.indianmirror.com. Retrieved 2021-05-31.
- ↑ "Saputara- A Beautiful Hill Station in Gujarat". Tour My India (in ఇంగ్లీష్). 2015-06-15. Retrieved 2021-05-31.
- ↑ "Incredible India | Saputara". www.incredibleindia.org. Retrieved 2021-05-31.