సమితి నిబంధనలు (చట్టం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఒక కంపెనీకి సంబంధించిన సమితి నిబంధనలు లేదా అమెరికా లేదా కెనడా కంపెనీకి సంబంధించిన ఏకీకృత నిబంధనలు అనే పదాన్ని వాడుకలో నిబంధనలుగా వాడుతుంటారు. (మరియు ఇవి తరచుగా పూర్తి పదానికి సంక్షిప్త పదంలాగా పెద్ద అక్షరాలలో చూపబడుతుంటాయి). నిబంధనలు అనేవి భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్, ఇంకా అనేక ఇతర దేశాలలో ఒక కంపెనీ ఏర్పరచడానికి అవసరమైన షరతుల గురించి తెలుపుతాయి. దానిలో సమితికి సంబంధించిన విఙ్ఞాపనతో పాటుగా, కంపెనీ రాజ్యాంగం కూడా ఉంటుంది. LLC అనే దానికి సమానార్ధాన్నిచ్చే పదం సంస్థ నిబంధనలు. జర్మనీలో Gesellschaftsvertrag, ఫ్రాన్స్‌లో స్టాటట్స్, పోలెండ్‌,[1]లో స్టాటట్, దక్షిణ కొరియాలో జెయోంగ్-గ్వాన్ అనేవి ఇతర దేశాలలో దీనికి దాదాపుగా సమానమైన పదాలు.

ఈ వ్యాసం చివర ఇవ్వబడిన సూచికలు ప్రధానంగా బ్రిటీష్ కంపెనీ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడ్డాయి.

ఈ నిబంధనలు అనేక అంశాలతో కలగలసి ఉంటాయి. అయితే ఒక దేశ చట్టంలో మాదిరిగా అన్ని అంశాలతో పనిలేదు. వీటిలో అన్ని అంశాలూ చర్చించనప్పటికీ, ఇవి కిందివాటిని ప్రస్తావిస్తాయి:

 • షేర్లు, (వీటినే స్టాక్ అని కూడా అంటారు) వివిధ రకాల షేర్లకు సంబంధించిన వివిధ రకాల ఓటింగ్ హక్కుల గురించి వీటిలో ఉంటుంది.
 • మేధోసంపత్తి హక్కులకు విలువ కట్టడం, అంటే సహభాగస్తుని IPRకు విలువ కట్టడం, ఉదాహరణకు
 • ఒక వాటాదారుడు తనకు రావలసిన దానికన్నా ఎక్కువ భాగాన్ని అడిగినప్పుడు కానీ, సహ వాటాదారులతో పాటుగా సమానంగా భాగాన్ని కోరినప్పుడు
 • నిర్వాహకుల సమావేశాలు - దానికి కావలసిన కనీస కోరం, ఓట్ల శాతం
 • నిర్వాహకుల నిర్ణయాలు - బోర్డు నిర్వహిస్తుందా లేక వ్యవస్థాపకుని ద్వారానా అనేది
 • షేర్లను మార్చుకునే వీలు - వ్యవస్థాపకునికి ఇవ్వబడిన హక్కులు, లేదా కంపెనీ సభ్యులు చేసే పనులు
 • అధ్యక్షుని ప్రత్యేక అధికారాలు, అతనిని లేదా ఆమెను ఎన్నుకునే పద్ధతి
 • భాగ పంపిణీ విధానం - లాభాలు వచ్చినా లేదా మరొక రకంగా జరిగినా లాభాల శాతాన్ని ప్రకటించే పద్ధతి
 • నియమాలను, సభ్యులకు విషయాలను తెలియజేసే పద్ధతులను రూపొందించడం.
 • వ్యవస్థాపకుని అనుమతిని, అపరాధ రుసుములను వెల్లడిచేసే పద్ధతులను, సమాచారాన్ని విశ్వసనీయంగా తెలియజేసే పద్ధతులను ఎంపిక చేయడం
 • తిరస్కరించే హక్కులను - అమ్మకం హక్కులను మరియు వ్యవస్థాపకుడిచే కౌంటర్ బిడ్‌కు సంబంధించిన హక్కులు.

ఒక కంపెనీ ప్రధానంగా వాటాదారుల ద్వారానే నడపబడుతుంది. కాని వెసులుబాటు కోసం, రోజూవారి కార్యక్రమాలను నిర్వహించడం కోసం, ఎంపిక చేయబడిన నిర్వాహకులే కంపెనీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాధారణంగా వాటాదారులందరూ కలిసి బోర్డ్ నిర్వాహకు (BOD)లను వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఎన్నుకుంటారు. చట్ట ప్రకారం ఇది తప్పక పాటించాల్సిన విధిగా ఉండొచ్చు (ఉదా: ఇండియా).

నిర్వాహకుల సంఖ్య కంపెనీ పరిమాణం, చట్టపరమైన అవసరాల పైన ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఛైర్మన్ సాధారణంగా కంపెనీతో సంబంధంలేని సుపరిచితుడైన బయటి వ్యక్తి అయి వుంటాడు. అయితే అతడు/ఆమె ఒక కంపెనీకి ప్రత్యేకించి అమెరికన్ కంపెనీకి వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండాలి. నిర్వాహకులు కంపెనీలో ఉద్యోగస్తులయి కాని కాకుండా కాని ఉండొచ్చు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాధారణంగా కొంతమంది ప్రధానమైన వాటాదారులు కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరికి వార్షిక సర్వసభ్య సమావేశాలలోAGM, కొంత మంది వ్యక్తులను నియమిత సంఖ్యలో నిర్వాహకులుగా నియమించే హక్కు ఉంటుంది. దీనిని వేరేవరూ అభ్యంతర పెట్టరాదు. కోశాధికారిని, అధ్యక్షుణ్ణి ఎన్నుకునే హక్కు సాధారణంగా ప్రధాన ఉమ్మడి వాటాదారులకు (ఈ అభ్యర్థిత్వాన్ని వీరు పంచుకుంటారు) మాత్రమే వుంటుంది. వాటాదారులు స్వతంత్ర నిర్వాహకులను కూడా ఎన్నుకోవచ్చు (ప్రజల నుంచి). అధ్యక్షుడు ప్రధాన కంపనీ వృద్ధి పొందించేవారితో సంబంధంలేని వ్యక్తి అయి, సుపరిచితుడైన బయటి వ్యక్తి అయి వుండాలి.

ఎంపిక కాబడిన బోర్డు నిర్వాహకులు BOD కంపెనీ లావాదేవీలను నిర్వహిస్తారు. మరుసటి AGM/EGM వచ్చేవరకు వాటాదారులు నిర్వహించవలసిన పాత్ర ఏమి ఉండదు. కంపెనీ యొక్క లక్ష్యాలు దాని ప్రయోజనం వాటాదారుల చేత ముందుగానే నిర్ణయింపబడి వుంటుంది. సంఘం యొక్క విఙ్ఞాపన (MOA) విడిగా ఉన్నట్లయితే దానిలో కంపెనీ పేరు, ప్రధాన కేంద్రం చిరునామా వివరాలు, నిర్వాహకుల వివరాలు, కంపెనీ ప్రధాన ఉద్దేశం వంటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం దానిలో తెలియజేయాలి. వాటిని AGMలో కానీ, అసాధారణ సర్వసభ్య సమావేశం (EGM) లోకానీ, చట్టపరంగా అన్ని అనుమతులు వున్నప్పుడు తప్ప ఎప్పటికీ మార్చకూడదు. సాధారణంగా MOAను దేశ ప్రభుత్వం చేత నియమింపబడిన 'రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్' చేపడతాడు. ప్రతి AGM సమావేశంలోనూ లెక్కలను సరిచూస్తారు. వీటిని సంస్థలోని ఆడిటర్లు కానీ (ఉద్యోగులు), బయటి నుండి వచ్చిన ఆడిటర్లు కానీ సరిచూస్తారు.

బోర్డు సంవత్సరంలో అనేకసార్లు సమావేశమవుతుంది. సమావేశమయ్యే ప్రతీసారి ముందుగానే 'అజెండా'ను తయారుచేస్తారు. ప్రతి సమావేశానికీ కనీస సంఖ్యలో (కోరం) నిర్వాహకులు హాజరుకావాలి. దీన్ని ముందుగానే తయారు చేసుకున్న నిబంధనలను బట్టి గానీ చట్టపరమైన అవసరాలనుబట్టి గాని నిర్థారిస్తారు. సమావేశాన్ని అధ్యక్షుడు ముందుండి నడిపిస్తాడు. అతను లేనప్పుడు ఉపాధ్యక్షుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. నిర్వాహకులు వారివారి బాధ్యతలకు అనుగుణంగా పని చేస్తారు. తర్వాతి AGMలలో కానీ లేదా అది అత్యంత ముఖ్యమైన విషయం అయినట్లైతే EGMలో కానీ తీర్మానాలను తీసుకుంటారు. ప్రధాన వాటాదారులు ఎంపిక చేసుకున్న నిర్వాహకులు, ఆయా వాటాదారుల ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఇది కచ్చితంగా ఇలాగే జరగకపోవచ్చు. కంపెనీ లక్ష్యాలు, పోటీకనుగుణంగా వారు కూడా నిర్ణయాలను తీసుకోవచ్చు. ఓట్లు ఇరు పక్షాలకూ 'సమం'గా వచ్చినపుడు ఈ పరిస్థితిని 'అధిగమించ'డానికి అధ్యక్షుడు తన ఓటును వినియోగించవచ్చు. AGMలో అనేక తీర్మానాలపై ఓటింగు జరుగుతుంది.

AGM ను నియమిత విరామం తర్వాత, వాటాదారులకు ముందుగానే తెలియజేసి నిర్వహిస్తారు. సమావేశం జరగడానికి అవసరమైన కనీస సంఖ్యలో వాటాదారులు హాజరు కావాలి. సమావేశం జరపడానికి అవసరమైన కనీస సంఖ్యలో హజరు కాకపోతే, ఆ సమావేశాన్ని రద్దు చేసే మరొకసారి సమావేశాన్ని ఏర్పరుస్తారు. అప్పటికి కూడా కనీస సంఖ్యలో హాజరుకాకపోతే, మూడవసారి కనీస సంఖ్యలో సభ్యులు హాజరు అయ్యారా అన్నదానితో నిమిత్తం లేకుండానే నిర్ణయాలు తీసుకోవచ్చు. దేశాలనుబట్టి, కంపెనీలను బట్టి పద్ధతుల్లో తేడాలుంటాయి.

నిర్ణయాలను అధ్యక్షుని సమక్షంలో, చేతులు పైకెత్తి తీసుకుంటారు. చేతులెత్తే పద్ధతి అంగీకరించనప్పుడు ఓటింగ్ పద్ధతిని అనుసరిస్తారు. వ్యక్తిగతంగా గానీ, కంపెనీ చేత పంపిణీ చేయబడిన కాగితాలలో మార్క్ చేసిగానీ ఓటు వేస్తారు. వాటాదారుడు హాజరుకాని సందర్భాలలో అతని అధికారిక అనుమతితో 'అతనికి బదులు'గా బయటి వ్యక్తి కూడా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఒక్కో వాటాకు ఉండే విలువనుబట్టి ఓట్లు మారతాయి. వీటిలో కొన్ని నిర్ణాయకంగా ఉంటే మరికొన్ని అలా ఉండకపోవచ్చు. తీర్మానాలు సాధారణ తీర్మానాలు, ప్రత్యేక తీర్మానాలు అని రెండు రకాలుగా ఉంటాయి.

ప్రత్యేక తీర్మానాలను నిర్వాహకుల సమావేశంలో తీసుకుంటారు. ఎక్కువమంది సమ్మతి ఆధారంగా సాధారణ తీర్మానాలను తీసుకుంటారు. కొన్నిసార్లు భాగస్తుల ఓట్లతో వీటిని చాలా తీసుకుంటారు. కంపెనీ రాజ్యంగంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక తీర్మానాలను తీసుకోవడానికి 60, 70 లేదా 80% ఓట్లు కావాలి. భాగస్వాములుకాని వాటాదారులు దీనిలో ఓటు వేయవచ్చు సాధారణ లేదా ప్రత్యేక తీర్మానాలు చేయాల్సి వచ్చినప్పుడు, వాటిని కంపెనీ లేదా కార్పోరేట్ చట్టంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన తీర్మానాలలోని కొన్ని అంశాలు చట్టపరమైన అవసరాలకనుగుణంగా ఉండవచ్చు.

నెస్లే S.A లేదా నెస్లే లిమిటెడ్ లేదా నెస్లే AG[2]కి సంబంధించిన కొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో నమూనా సమితి నిబంధనలను టేబుల్ A గా పిలుస్తారు. వీటిని 1865 నుంచి ప్రచురిస్తున్నారు.[3] చాలా కంపెనీల సమితి నిబంధనలు - ముఖ్యంగా చిన్న కంపెనీలవి - టేబుల్ A నుండే రూపొందుతున్నాయి. లేదా దానిని ఆధారంగా చేసుకొని తయారవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి కంపెనీకి వివిధ రకాల నిబంధనలను చేర్చుకోవడానికిగానీ, వాటిని సవరించుకోవడానికిగానీ స్వేచ్ఛ ఉంది. ప్రత్యేకమైన తీర్మానాల ద్వారా వీటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు. కంపెనీల చట్టం పరిధిలో అవసరాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేసుకోవచ్చు ఈ రకమైన అవసరాలు ప్రవేటు కంపెనీలకంటే పబ్లిక్ కంపెనీ లకు భారంగా పరిణమిస్తాయి.

నవంబర్ 8, 2006లో రాయల్ అస్సెంట్‌{ /1}ను పొందిన కంపెనీ చట్టం 2006 2009 అక్టోబర్ 1 నుండి పూర్తిగా అమలులోకొచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కంపెనీలు నిబంధనలను రూపొందించుకునేందుకుగాను ఇది కొత్తతరహా సమితి మాదిరి నిబంధనలను అందజేస్తున్నది. కొత్త శాసనం ప్రకారం సమితి నిబంధనలు UK కంపెనీకి ఏకైక రాజ్యాంగబద్ధ పత్రంగా మారనున్నది. ఇప్పుటి వరకు విడిగా వున్న సంఘ విఙ్ఞాపన[4]ను ఇది తనలో భాగం చేసుకుంటున్నది.

గమనికలు[మార్చు]

 1. Articles of Agreement Law & Legal Definition
 2. http://www.nestle.com/MediaCenter/MediaLibrary/Documents/Documents.htm?GUID=D0ABBAF1-E3DE-438C-BD3A-937CE90718C9
 3. జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్ 1856 - టేబుల్ B
 4. 2006 చట్టానికి ముందున్న చట్టం ప్రకారం, మెమోరాండమ్ మరియు ఆర్టికల్స్ మధ్య తేడా ఉన్న ఎడల మెమోరాండమ్ సాధారణంగా చెల్లుబాటవుతుంది: చూడండి ఆష్బరి v వాట్సన్ (1885) 30 Ch D 376.

బాహ్య లింకులు[మార్చు]