సమీవుల్లా బేగ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1981 ఏప్రిల్ 15 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2002-17 | జమ్మూ కాశ్మీర్ |
మూలం: Cricinfo, 2015 23 October | |
సమీవుల్లా బేగ్ (జననం 1981, ఏప్రిల్ 15) భారత మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. 2002 నుండి 2017 వరకు జమ్మూ కాశ్మీర్ తరపున ఆడాడు.[1]
కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్ అయిన అతను 2016 అక్టోబరులో 2016–17 రంజీ ట్రోఫీలో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు. [2] 2013-14లో అస్సాంపై విజయంలో అతని ఉత్తమ ఫస్ట్ క్లాస్ బౌలింగ్ గణాంకాలు 42 పరుగులకు 6 వికెట్లు తీశాడు.[3]
ఆయనకు సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నాయి. అతను జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు, పైపు నెట్‌వర్క్‌లు, నీటి వడపోత ప్లాంట్ల సంస్థాపన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Samiullah Beigh". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 October 2015.
- ↑ "Rohilla ton in vain as Haryana collapse to defeat". ESPN Cricinfo. 30 October 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 October 2016.
- ↑ "Jammu and Kashmir v Assam 2013-14". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 February 2020.
- ↑ Kishore, Shashank (24 February 2020). "Captain, rebel, coach - the many hats of J&K's Samiullah Beigh". Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 February 2020.