సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం
ఇతర పేర్లు | SSCTU (ఎస్ఎస్సీటీయూ) |
|---|---|
| స్థాపితం | 2023 |
| వైస్ ఛాన్సలర్ | ఆచార్య వై ఎల్ శ్రీనివాస్ |
| రెక్టర్ | జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ తెలంగాణ |
| చిరునామా | గిరిజన యూనివర్సిటీ ములుగు జిల్లా తెలంగాణ, ములుగు, తెలంగాణ, 506343, భారతదేశం |
| ప్రాంగణం | సబ్ అర్బన్ |
| భాష | ఆంగ్లం |
| అనుబంధాలు | UGC యూజీసీ |
| జాలగూడు | https://ssctu.ac.in/ |
సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTribalU) ఒక భారతదేశపు గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఏర్పాటు చేయబడింది. భారత పార్లమెంటు 2023 చట్టం ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009 సవరణతో ఇది స్థాపించబడింది. ఇది ప్రత్యేకంగా ఆదివాసీ మరియు గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటుచేయబడిన కేంద్ర విశ్వవిద్యాలయం.
చరిత్ర
[మార్చు]ఈ విశ్వవిద్యాలయానికి ఆదివాసీల ఆరాధ్యదేవతలు అయిన సమ్మక్క-సారలమ్మ పేరును కల్పించారు. 2023 డిసెంబర్ 7న లోక్‌సభలో బిల్లు ఆమోదించబడింది. ఇది ములుగు జిల్లా కేంద్రంలో స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభ దశలో జకారాం గ్రామంలో ఉన్న యూత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణం నుండే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం 335.04 ఎకరాల భూమిని కేటాయించి, నిర్మాణాల కోసం రూ. 900 కోట్ల నిధులను కేటాయించింది.
కోర్సులు మరియు అడ్మిషన్లు
[మార్చు]2024–25 విద్యా సంవత్సరానికి బీఏ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది. సీట్ల కేటాయింపు రిజర్వేషన్ విధానానికి అనుగుణంగా జరుగుతుంది. భవిష్యత్తులో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పరిశోధన అవకాశాలు అందించనుంది.
తొలి ఉపకులపతి
[మార్చు]ఈ విశ్వవిద్యాలయం మొదటి వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర విద్యాశాఖ ఆయన నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయస్సు వరకూ ఉండనుంది.
శ్రీనివాస్ గారు నిజామాబాద్ జిల్లా బోధన్ నివాసి. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఆంగ్లం, ఎంఫిల్, పీహెచ్‌డి పట్టాలు సాధించారు. అదే విశ్వవిద్యాలయంలో ఆయా పదవుల్లో పనిచేసి, ప్రస్తుతం అరోరా డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్ లో వైస్ చాన్సలర్‌గా ఉన్నారు.
సంబంధిత విశ్వవిద్యాలయాలు
[మార్చు]- హైదరాబాద్ విశ్వవిద్యాలయం
- ఇండిరా గాంధీ గిరిజన విశ్వవిద్యాలయం
మూలాలు
[మార్చు]- Chary, Maheshwaram Mahendra. Hindustantimes Telugu. "Sammakka Sarakka Tribal University: సమ్మక్క - సారక్క ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు - కోర్సులు, ముఖ్య తేదీలివే". Retrieved 2025-03-12.
- India Today. "Central Tribal University to be set up in Telangana". Retrieved 2025-03-12.
- ETV Bharat. "HCU స్థాయిలో గిరిజన యూనివర్సిటీ.. వచ్చే ఏడాది తరగతులు!" (2023-10-05). Retrieved 2025-03-12.
- ETV Bharat. "సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం" (2023-12-08). Retrieved 2025-03-12.
- NTV Telugu. "తాత్కాలిక క్యాంపస్ ప్రారంభించిన కేంద్ర మంత్రి" (2024-03-08). Retrieved 2025-03-12.
- Andhrajyothy. "తొలి వీసీగా వై.ఎల్. శ్రీనివాస్". Archived on 12 March 2025.
- Telugu Global. "ములుగు ట్రైబల్ యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్". (2025-03-11). Retrieved 2025-03-12.