సమ్మేళనం
| సమ్మేళనం | |
|---|---|
| దర్శకత్వం | తరుణ్ మహాదేవ్ |
| కథ | తరుణ్ మహాదేవ్ |
| నిర్మాత | సునయని బి, సాకేత్ జె |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | శ్రవణ్ జి కుమార్ |
| కూర్పు | శ్రవణ్ జి కుమార్ |
| సంగీతం | యశ్వంత్ నాగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: శరవణ వాసుదేవన్ |
| ఆర్ట్ డైరెక్టర్ | హరీష్ కూనపురి |
నిర్మాణ సంస్థ | ఆ గుడ్ టేల్ సినిమా |
విడుదల తేదీ | 2025 ఫిబ్రవరి 20 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సమ్మేళనం 2025లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. ఆ గుడ్ టేల్ సినిమా బ్యానర్‌పై సునయని బి, సాకేత్ జె నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు.[1] ప్రియా వడ్లమాని , గణాదిత్య, నూతక్కి బిందు భార్గవి, శ్రీకాంత్ గుర్రం, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ట్రైలర్‌ను ఫిబ్రవరి 10న విడుదల చేసి,[2] సిరీస్‌ను ఆరు ఎపిసోడ్లుగా ఫిబ్రవరి 20న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేశారు.[3]
కథ
[మార్చు]రామచంద్ర అలియాస్ రామ్ (గణాదిత్య) రచయిత. తన స్వీయ అనుభవాలతో పుస్తకం రాస్తాడు. దానికి మంచి స్పందన రావడంతో, పుస్తకం గురించి కొన్ని సంగతులు ఓ న్యూస్ పేపర్లో ప్రచురితమవుతాయి. ఆ ఆర్టికల్‌ను చూసి కొన్నాళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు రామ్‌ను వెతుక్కుంటూ శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (వినయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) వస్తారు. అర్జున్, రామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ క్రమంలో వారిద్దరూ వారి ఆఫీసులోనే పని చేసే మేఘనను ప్రేమిస్తారు. ఆ తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[4][5]
నటీనటులు
[మార్చు]- ప్రియా వడ్లమాని
- గణాదిత్య
- నూతక్కి బిందు భార్గవి
- వినయ్ అభిషేక్
- శ్రీకాంత్ గుర్రం
- జీవనప్రియ రెడ్డి
- శివంత్ యాచమనేని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరత్.వి
- కో-డైరెక్టర్: తిరుపతి.కె
- అసోసియేట్ డైరెక్టర్: కపీష్ ఆకుల
- అసిస్టెంట్ డైరెక్టర్: వంశీ చిలుకూరి
మూలాలు
[మార్చు]- ↑ "స్నేహం ప్రేమల సమ్మేళనం". Eenadu. 20 February 2025. the original నుండి 10 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.
- ↑ "ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. 'సమ్మేళనం' ట్రైలర్ రిలీజ్". NT News. 15 February 2025. the original నుండి 10 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.
- ↑ "డైరెక్టుగా ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ETV Winలో హుషారు పోరి సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". ABP News. 8 February 2025. the original నుండి 10 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.
- ↑ "పుస్తకం చుట్టూ తిరిగే ప్రేమ కథ.. ఓటీటీలో సందడి చేస్తున్న నయా వెబ్ సిరీస్..!". Hmtv. 20 February 2025. the original నుండి 10 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.
- ↑ "సమ్మేళనం రివ్యూ: విలన్ లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?". A. B. P. Desam. 20 February 2025. the original నుండి 10 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.