సయీద్ అన్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయీద్ అన్వర్
Saeed anwar 2003.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Saeed Anwar
బ్యాటింగ్ శైలి Left-handed
బౌలింగ్ శైలి Slow left arm orthodox
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Pakistan
టెస్టు అరంగ్రేటం(cap 120) 23 November 1990 v West Indies
చివరి టెస్టు 31 August 2001 v Bangladesh
వన్డే లలో ప్రవేశం(cap 68) 1 January 1989 v West Indies
చివరి వన్డే 4 March 2003 v Zimbabwe
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 55 247 146 325
సాధించిన పరుగులు 4,052 8,824 10,169 11,223
బ్యాటింగ్ సగటు 45.52 39.21 45.19 37.91
100s/50s 11/25 20/43 30/51 26/54
ఉత్తమ స్కోరు 188* 194 221 194
బాల్స్ వేసినవి 48 242 653 858
వికెట్లు 0 6 9 31
బౌలింగ్ సగటు 31.83 45.77 20.80
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0
మ్యాచ్ లో 10 వికెట్లు n/a n/a
ఉత్తమ బౌలింగ్ 2/9 3/83 4/39
క్యాచులు/స్టంపింగులు 18/– 42/– 65/– 64/–
Source: Cricinfo, 31 January 2010

సయీద్ అన్వర్ (ఉర్దూ: سعید انور‎, పాకిస్తాన్‌లోని కరాచీలో 1968వ సంవత్సరం సెప్టెంబర్ 6న జన్మించారు) ఒక మాజీ పాకిస్తానీ ప్రారంభ బాట్స్‌మాన్. ఎడమచేతి వాటం కలిగి, 1997వ సంవత్సరంలో చెన్నైలో భారతదేశముకు ప్రతిగా సాధించిన 194 పరుగులకు ఆయన ప్రసిద్ధిచెందారు, ఒక రోజు అంతర్జాతీయ ఆటలో ఇంతకు పూర్వం ఇది అత్యధిక స్కోరు. 2010వ సంవత్సరం ఫిబ్రవరి 24న, భారతదేశానికి చెందిన సచిన్ టెండుల్కర్ దక్షిణ ఆఫ్రికాకు ప్రతిగా 200* పరుగులు సాధించి, అన్వర్ యొక్క రికార్డును అధిగమించారు.[1][2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సయీద్ అన్వర్ 1989వ సంవత్సరంలో, కరాచీలోని NED విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు మరియు వృత్తిరీత్యా ఇంజినీరు. వృత్తిపరంగా టెస్ట్ క్రికెటర్ అయ్యేముందు ఆయన తన మాస్టర్'స్ విద్య కొరకు సంయుక్త రాష్ట్రాలు వెళ్లేందుకు యోచిస్తూ ఉన్నారు.

2001వ సంవత్సరంలో, ఆయన కుమార్తె దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించాక ఆయన వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కున్నారు.[3] పర్యవసానంగా ఆయన మతంవైపు మళ్ళారు మరియు పాకిస్తానీ క్రికెట్ జట్టు యొక్క ఇస్లామీకరణకు ఇది ఒక మలుపుగా చూడబడింది, చివరికి దానిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోవటంలో పాకిస్తాన్ యొక్క వైఫల్యానికి ఇది విమర్శించబడింది.[4] దీర్ఘకాలిక విరామం తరువాత ఆయన క్రికెట్టుకు తిరిగి వచ్చారు మరియు 2003 ప్రపంచ కప్లో అత్యంత నిలకడైన బాట్స్‌మెన్‌లలో ఒకనిగా ఉన్నారు.

షార్జాలోని ఆడబోయే ఒక-రోజు అంతర్జాతీయ టోర్నమెంటుకు జట్టులో నుంచి ఆయనను తొలగించిన తరువాత, 2003వ సంవత్సరం ఆగష్టు 15న, ఆయన క్రికెట్టు నుండి తన విరమణను ప్రకటించారు.[5] తబ్లిఘి జమాత్‌తో కలిసి పాకిస్తాన్ అంతటా ఇస్లామును ప్రబోధించడానికి ఆయన తన జీవితాన్ని అర్పించారు. లాహోరులో ఆయన, తన మాజీ జట్టు సభ్యుడైన వసీం అక్రం జీవిత భాగస్వామి హుమా అక్రం యొక్క అంత్యక్రియ ప్రార్థనలను నడిపించారు.[6]

వృత్తి జీవితం[మార్చు]

[Anwar] used an eclectic approach to batting – classical betrothed to unorthodox, footwork against spin as quick as a hiccup, and wrists supple yet powerful to brush the field like a Picasso.

Ramiz Raja, 2010.[7]

తన రోజున ఎటువంటి బౌలింగ్ దాడినైనా ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ప్రారంభ బాట్స్‌మాన్ అయిన అన్వర్, ఒక-రోజు ఆటలలో ఒక దాడిచేసే బాట్స్‌మాన్ మరియు టెస్ట్ మాచ్ లలో ఒకసారి స్థిరపడ్డ తరువాత, మైదానం అంతటా వేగంగా పరుగులు సాధించేవారు. శారీరిక శక్తికంటే మంచి సమన్వయము మరియు మణికట్టు విదిలింపు ద్వారా ఆయనకు విజయం దక్కింది, మరియు తన గుర్తింపు చిహ్నమైన విదిలింపుకు అన్వర్ ప్రసిద్ధిచెందారు. ఆఫ్ స్టంప్‌‌కు బయట విసరబడిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆరు పరుగులకు లేపే సామర్ధ్యం ఆయనకి ఉంది. సమన్వయం మరియు త్వరితగతిన పరుగులు సాధించే అన్వర్ యొక్క సామర్ధ్యం ఆయనను సమూహం యొక్క ప్రీతిపాత్రునిగా చేశాయి. 1997వ సంవత్సరంలో ఆయన విస్డన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్‌గా నామకరణం చేయబడ్డారు.

అన్వర్ ఒక-రోజు ఆటలో భారతదేశానికి ప్రతిగా భారత గడ్డపై శతకాన్ని సాధించిన మొట్టమొదటి పాకిస్తానీ బాట్స్‌మాన్. మిగిలిన ఏ పాకిస్తానీ ఆటగానికంటే కంటే కూడా ఆస్ట్రేలియాకు ప్రతిగా అత్యధిక బాటింగ్ సగటును (59.06) ఆయన కలిగి ఉన్నారు, మరియు ఒకసారి వారికి ప్రతిగా మూడు వరుస శతకాలను సాధించారు. డర్బన్ లో దక్షిణ ఆఫ్రికాకు ప్రతిగా ఆయన ఒక అత్యున్నత శతకాన్ని సాధించారు, ఇది పాకిస్తానుకు దక్షిణ ఆఫ్రికాలో మొదటిసారి ఒక టెస్ట్‌ మాచ్‌‌ను గెలిచేందుకు అవకాశం ఇచ్చింది.

1997వ సంవత్సరం, మే 21న చెన్నైలో, ODI మాచ్‌లో అన్వర్ భారతదేశానికి ప్రతిగా 194 పరుగులు సాధించారు.[8] 2009వ సంవత్సరం, ఆగష్టు 16న చార్లెస్ కావెంట్రీ బంగ్లాదేశ్‌కు ప్రతిగా ఈ అద్భుతకృత్యాన్ని సమంచేశారు.[9] 2010వ సంవత్సరం, ఫిబ్రవరి 24న, దక్షిణ ఆఫ్రికాకు ప్రతిగా సచిన్ టెండుల్కర్ ఛేదింపబడని 200 పరుగులు సాధించేవరకు ఇది ప్రపంచంలోనే ఏ ఒక్క బాట్స్‌మెన్‌చే కూడా సాధింపబడని అత్యధిక వ్యక్తిగత స్కోరు.

షార్జాలోని 1993-1994 చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక, వెస్ట్ ఇండీస్ మరియు శ్రీలంకలకు ప్రతిగా శతకాలతో, ODIలలో మూడు వరుస శతకాలు సాధించిన బాట్స్‌మెన్ యొక్క ప్రత్యేక క్లబ్బులో అన్వర్ సభ్యుడు. ఆయన తన వృత్తి జీవితంలో మూడు సందర్భాలలో రెండు వరుస శతకాలను సాధించారు, మరియు ODIలలో ఈ ఘనకార్యాన్ని పూర్తిచేసిన మొట్టమొదటి బాట్స్‌మాన్ అయ్యారు.[10]

రికార్డులు[మార్చు]

సయీద్ అన్వర్ యొక్క వృత్తిజీవితపు ప్రదర్శన రేఖాపటం.

2010వ సంవత్సరం, ఫిబ్రవరి 24న, దక్షిణ ఆఫ్రికాకు ప్రతిగా భారతదేశానికి చెందిన సచిన్ టెండుల్కర్ (200*) దానిని అధిగమించేవరకు అన్వర్ (194) మరియు చార్లెస్ కావెంట్రీ (194*) ODI మాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల యొక్క రికార్డును పంచుకున్నారు. నాలుగు సందర్భాలలో అన్వర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ వరుస శతకాలను సాధించారు. ఆస్ట్రేలియాకు ప్రతిగా టెస్ట్ మాచ్‌లలో మిగిలిన ఏ పాకిస్తానీ ఆటగానికంటే కుడా అయన అత్యధిక టెస్ట్ బాటింగ్ సగటును (59.06) కలిగి ఉన్నారు, మరియు ఒక రోజు అంతర్జాతీయ ఆటలలో ఒక పాకిస్తానీ ప్రారంభ బాట్స్‌మాన్‌గా 20 శతకాలను సాధించారు.

సయీద్ అన్వర్‌చే సాధించబడిన శతకాలు[మార్చు]

ఒకరోజు అంతర్జాతీయ శతకాలు[మార్చు]

 • పరుగుల శీర్షికలో, * నాట్ అవుట్‌ను సూచిస్తుంది.
 • శీర్షిక పేరు ఆట ఆటగాడి యొక్క క్రీడా జీవితం యొక్క ఆట సంఖ్యను సూచిస్తుంది
సయీద్ అన్వర్ యొక్క ఒక రోజు అంతర్జాతీయ శతకాలు
పరుగులు ఆట ప్రతిగా నగరం/దేశం వేదిక సంవత్సరం
[1] 126 12  శ్రీలంక అడిలైడ్, ఆస్ట్రేలియా అడిలైడ్ ఓవల్ 1990
[2] 126 20  New Zealand లాహోర్, పాకిస్తాన్ గడ్డాఫీ స్టేడియం 1990
[3] 110 34  శ్రీలంక షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1993
[4] 107 39  శ్రీలంక షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1993
[5] 131 40  వెస్ట్ ఇండీస్ షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1993
[6] 111 41  శ్రీలంక షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1993
[7] 104* 65  ఆస్ట్రేలియా రావల్పిండి, పాకిస్తాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం 1994
[8] 103* 76  Zimbabwe హరారే, జింబాబ్వే హరారే స్పోర్ట్స్ క్లబ్ 1995
[9] 104* 92  New Zealand షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1996
[10] 112 93  శ్రీలంక షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1996
[11] 194 101  [[భారత్ {{{altlink}}}|భారత్]] చెన్నై, ఇండియా MA చిదంబరం స్టేడియం 1997
[12] 108* 116  వెస్ట్ ఇండీస్ లాహోర్, పాకిస్తాన్ గడ్డాఫీ స్టేడియం 1997
[13] 104 119  [[భారత్ {{{altlink}}}|భారత్]] షార్జా, UAE షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 1997
[14] 140 125  [[భారత్ {{{altlink}}}|భారత్]] ఢాకా, బంగ్లాదేశ్ బంగబంధు నేషనల్ స్టేడియం 1998
[15] 103 158  Zimbabwe లండన్, యునైటెడ్ కింగ్డం కెన్నింగ్టన్ ఓవల్ 1999
[16] 113* 159  New Zealand మాంచెస్టర్, యునైటెడ్ కింగ్‌డమ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ 1999
[17] 105* 190  శ్రీలంక నైరోబీ, కెన్యా జింఖానా క్లబ్ గ్రౌండ్ 2000
[18] 104 191  New Zealand నైరోబీ, కెన్యా జింఖానా క్లబ్ గ్రౌండ్ 2000
19 101 246  [[భారత్ {{{altlink}}}|భారత్]] సెంచూరియన్, దక్షిణ ఆఫ్రికా సెంచూరియన్ పార్క్ 2003

టెస్ట్ క్రికెట్ శతకాలు[మార్చు]

 • పరుగులు శీర్షికలో, * నాట్ అవుట్ ను సూచిస్తుంది.
 • శీర్షిక పేరు ఆట ఆటగాడి యొక్క క్రీడా జీవితం యొక్క ఆట సంఖ్యను సూచిస్తుంది
సయీద్ అన్వర్ యొక్క టెస్ట్ క్రికెట్ శతకాలు
పరుగులు ఆట ప్రతిగా నగరం/దేశం వేదిక సంవత్సరం
[1] 169 3 న్యూజిలాండ్ వెల్లింగ్టన్, న్యూజిలాండ్ బేసిన్ రిజర్వ్ 1994
[2] 136 5 శ్రీలంక కొలంబో, శ్రీలంక P శరవణముత్తు స్టేడియం 1994
[3] 176 17 ఇంగ్లాండ్ లండన్, యునైటెడ్ కింగ్డం ది ఓవల్ 1996
[4] 107 21 న్యూజిలాండ్ రావల్పిండి, పాకిస్తాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం 1996
[5] 118 28 దక్షిణ ఆఫ్రికా డర్బన్, దక్షిణ ఆఫ్రికా కింగ్స్ మెడ్ 1998
[6] 145 32 ఆస్ట్రేలియా రావల్పిండి, పాకిస్తాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం 1998
[7] 126 33 ఆస్ట్రేలియా పెషావర్, పాకిస్తాన్ అర్బాబ్ నియాజ్ స్టేడియం 1998
[8] 188* 38 భారతదేశం కోల్‌కతా, భారత్ ఇడెన్ గార్డెన్స్ 1999
[9] 119 41 ఆస్ట్రేలియా బ్రిస్బేన్, ఆస్ట్రేలియా బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్ 1999
[10] 123 47 శ్రీలంక గాలే, శ్రీలంక గాల్లే ఇంటర్నేష్నల్ స్టేడియం 2000
[11] 101 55 బంగ్లాదేశ్ ముల్తాన్, పాకిస్తాన్ ముల్తాన్ క్రికెట్ స్టేడియం 2001

వీటిని కూడా చూడండి[మార్చు]

 • రాబర్ట్ ఎంక్

సూచనలు[మార్చు]

 1. PTI, Feb 24, 2010, 06.08pm IST (2010-02-24). "Sachin becomes first batsman to score 200 in an ODI". Timesofindia.indiatimes.com. Retrieved 2010-11-24. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
 2. "Sachin break Anwar's Record". Cricketworld4u.com. మూలం నుండి 2010-05-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-24. Cite web requires |website= (help)
 3. "Saeed Anwar's young daughter dies". Cricinfo.com. 1 September 2001. Retrieved 2010-08-07.
 4. "Leading News Resource of Pakistan". Daily Times. 2010-02-07. మూలం నుండి 2012-07-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-24. Cite web requires |website= (help)
 5. "Saeed Anwar confirms retirement | Pakistan Cricket News | ESPN Cricinfo". Cricinfo.com. Retrieved 2010-11-24. Cite web requires |website= (help)
 6. "Huma Akram buried in Lahore | Pakistan Cricket News | ESPN Cricinfo". Cricinfo.com. Retrieved 2010-11-24. Cite web requires |website= (help)
 7. Samiuddin, Osman (24 May 210), A batsman's nightmare, Cricinfo, retrieved 2010-10-28
 8. "6th Match: India v Pakistan at Chennai, May 21, 1997 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo.com. Retrieved 2010-11-24. Cite web requires |website= (help)
 9. Ravindran, Siddarth (2009-08-16). "Short fuse, long haul". Cricinfo. Retrieved 2009-08-17. Cite web requires |website= (help)
 10. క్రిక్ఇన్ఫో - ODIస్ - 100స్ ఇన్ మోస్ట్ కన్సిక్యూటివ్ ఇన్నింగ్స్ Archived 2007-06-04 at the Wayback Machine. క్రిక్ఇన్ఫో. ఆగస్టు 25, 2006న పునరుద్ధరించబడింది.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Pakistan Squad 1996 Cricket World Cup మూస:Pakistan Squad 1999 Cricket World Cup మూస:Pakistan Squad 2003 Cricket World Cup