Jump to content

సయ్యద్ మసుదల్ హుస్సేన్

వికీపీడియా నుండి
సయ్యద్ మసుదల్ హుస్సేన్

పదవీ కాలం
1980  1998
ముందు కాజిమ్ అలీ మీర్జా
తరువాత మొయినుల్ హసన్
నియోజకవర్గం ముర్షిదాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1939-08-14)1939 ఆగస్టు 14
ముర్షిదాబాద్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
జీవిత భాగస్వామి నర్గీస్ సత్తార్
నివాసం ముర్షిదాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

సయ్యద్ మసుదల్ హుస్సేన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సయ్యద్ మసుదల్ హుస్సేన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అబ్దుస్ సత్తార్ పై 68755 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1984 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అజీజుర్ రెహమాన్‌పై 6,262 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సయ్యద్ మసుదల్ హుస్సేన్ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అజీజుర్ రెహమాన్‌పై 56544 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1991 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అలీ హొస్సేన్ మండల్‌పై 112601 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సయ్యద్ మసుదల్ హుస్సేన్ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అనరుల్ హొస్సేన్ ఖాన్‌పై 37,185 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Murshidabad Lok Sabha Election Results 1962 - 2024" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.